అన్వేషించండి

Densuke Watermelon: ఈ పుచ్చకాయ ధర రూ.4.46 లక్షలు మాత్రమే, దీని ప్రత్యేకత అలాంటిది మరి!

ఈ పుచ్చకాయను కొనుగోలు చేయడానికి బదులు మీరు ఏకంగా పుచ్చకాయల లోడ్‌నే కొనుగోలు చేయొచ్చు.

ఒక కిలో బరువుండే పుచ్చకాయ ఎంత ధర ఉంటుంది? రూ.16 నుంచి రూ.20 వరకు ఉంటుంది కదూ. కొన్ని పుచ్చకాయలను పరిమాణం బట్టి రూ.100 వరకు ధర పలుకుతాయి. అయితే, ఈ పుచ్చకాయ మాత్రం కొన్ని లక్షల విలువ చేస్తుంది. సంపన్నులు ఎగబడి మరీ ఈ పుచ్చకాయను కొనుగోలు చేస్తారు. దీన్ని కొనేందుకు ఎన్ని లక్షలైనా వెచ్చించేందుకు సిద్ధమవుతారు. మరీ అంత డబ్బు పోసి కొనేంత ప్రత్యేకత ఈ పుచ్చకాయలో ఏముందనేగా మీ సందేహం? అయితే, చూడండి. 

జపాన్‌లో సుమారు 1,200 రకాల పుచ్చకాయలు పండుతాయి. వాటిలో ‘డెన్సుకే బ్లాక్ వాటర్ మిలన్’ (డెన్సుకే నల్ల పుచ్చకాయ)కు మాత్రం చాలా ప్రత్యేకత ఉంటుంది. ఏడాది మొత్తంలో కేవలం 100 డెన్సుకే పుచ్చకాయలు మాత్రమే పండుతాయి. పైగా ఇవి సాధాసీదా మార్కెట్లలో లభించవు. వీటిని ప్రత్యేకంగా వేలం పాట ద్వారా విక్రయిస్తారు. దీన్ని జీవితంలో ఒక్కసారైనా రుచి చూడాలనే పట్టుదలతో ఉండేవారు ఈ వేలం పాటలో పాల్గొంటారు. అలాగే తమకు ఇష్టమైన వ్యక్తులకు కానుకగా ఇచ్చేందుకు కూడా పుచ్చకాయను కొనుగోలు చేస్తారు. గొప్పింటివారు ఈ పుచ్చకాయలను తమ ఇళ్లలో అతిథులకు రుచి చూపించడం స్టేటస్‌గా భావిస్తారు. అందుకే, పోటీపడి మరీ ఈ పుచ్చకాయలను సొంతం చేసుకొనే ప్రయత్నం చేస్తారు. 

2019లో ఈ పుచ్చకాయ విలువ రూ.750,000 జపనీస్ యెన్‌లు పలికింది. భారత కరెన్సీ ప్రకారం.. రూ.4,45,972. ఈ డబ్బుతో మనం లారీ లోడ్ పుచ్చకాయలను కొనేయొచ్చు కదూ. అయితే, కోవిడ్-19 మహమ్మారి కారణంగా గత రెండేళ్లలో దీని ధరలు బాగా పడిపోయాయి. అయితే, ఈ ఏడాది మళ్లీ ధరలు పుంజుకోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ప్రపంచంలో అత్యధిక ధర కలిగిన పుచ్చకాయ రికార్డు ఈ డెన్సుకే పుచ్చకాయల పైనే ఉంది. 

Also Read: దాహానికి, డయాబెటిస్‌కు లింకేమిటీ? నోటిలో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

ప్రత్యేకత ఏమిటీ: ఈ పుచ్చకాయ ఇంత రేటు ఉందంటే తప్పకుండా అందులో ఔషద గుణాలు ఉండి ఉండాలని మీరు అనుకుంటున్నారా? అయితే, పప్పులో కాలేసినట్లే. డేన్సుకే పుచ్చకాయలో కూడా సాధారణ పుచ్చకాయలు ఇచ్చే ప్రయోజనాలే ఉంటాయి. అయితే, ఈ పుచ్చకాయలో విత్తనాలు చాలా తక్కువగా ఉంటాయి. పైగా సాధారణ పుచ్చకాయలతో పోల్చితే చాలా తియ్యగా, రుచికరంగా ఉంటాయి. దీని గుజ్జు కూడా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. ఇది ఇంత ధర పలకడానికి కారణం.. దాన్ని పెంచే విధానం. ఈ పుచ్చకాయను సాధారణ పుచ్చకాయాల్లా కాకుండా ప్రత్యేకమైన వాతావరణంలో పండిస్తారు. అన్నీ సమపాళల్లో అందేలా చూస్తారు. ఆ తర్వాత వాటిని బాగా ఫాలిష్ చేసి ప్యాక్ చేస్తారు. ఫలితంగా ఈ పుచ్చకాయలు భలే నిగనిగలాడుతూ కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ పుచ్చకాయ విత్తనాలు యూరప్, ఉత్తర అమెరికాలో అందుబాటులో ఉన్నాయట. ఈ రకం పుచ్చకాయకు ఆయా దేశాల్లో రూ.20 వేలు వరకు దర పలుకుతుందట. అయినా సరే, ఒక పుచ్చకాయ అంత ధర చెల్లించడం విడ్డూరమే కదూ. 

Also Read: వేసవిలో ఏసీ వాడాలంటే వణికిపోతున్నారా? ఈ టిప్స్ పాటిస్తే కరెంట్ బిల్లు ఆదా!

టాప్ హెడ్ లైన్స్

Drumstick Chicken Curry : మునగకాయ చికెన్ కర్రీ రెసిపీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, రుచి అదిరిపోతుంది
మునగకాయ చికెన్ కర్రీ రెసిపీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, రుచి అదిరిపోతుంది
Vertigo vs Blackouts : తల తిరుగుతోందా? కళ్లు చీకట్లు కమ్ముతున్నాయా? ఈ లక్షణాలతో జాగ్రత్త, స్ట్రోక్ కావచ్చు
తల తిరుగుతోందా? కళ్లు చీకట్లు కమ్ముతున్నాయా? ఈ లక్షణాలతో జాగ్రత్త, స్ట్రోక్ కావచ్చు
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Saddula Bathukamma Naivedyam : సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
PM Modi Chennai Tour: సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
Embed widget