అన్వేషించండి

Sleeping: నిద్రపోయే టైమ్ రోజూ మారిపోతుందా? గుండె జబ్బులు రావచ్చు

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర, మంచి ఆహారం కీలకమైనవి. వీటిలో ఏది తక్కువగా ఉన్న కూడా దాని ప్రభావం ఆరోగ్యం మీద పడుతుంది.

మనలో చాలా మంది రాత్రి వేళ టైమ్ కి అసలు నిద్రపోరు. ఒక్కో రోజు ఒక్కో టైమ్ కి పడుకుంటూ ఉంటారు. కానీ అది ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. రాత్రివేళ నిద్రని 90 నిమిషాలు ఆలస్యం చేయడం వల్ల రక్త నాళాలకు సంబంధించిన కణాలని దెబ్బతీస్తుంది. దాని ప్రభావం ఎక్కువగా పడేది గుండె మీదే. దీనికి సంబంధించి ఇటీవల జరిపిన అధ్యయనం ప్రకారం పేలవమైన నిద్ర గుండె వ్యాధుల ప్రమాదాన్ని మరింత పెంచుతుందని మరోసారి రుజువైంది. దీర్ఘకాలిక నిద్రలేమి గుండె జబ్బులు కలిగిస్తుంది. సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్ లో కొలంబియా విశ్వవిద్యాలయం చేసిన ఒక కొత్త అధ్యయనం ప్రచురితమైంది. దీర్ఘకాలిక తేలికపాటి నిద్రలేమి సమయం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో వాళ్ళు విశ్లేషించారు.

అందులో ఏముందంటే..

పన్నెండు వారాల పాటు అధ్యయనం సాగింది. పరిశోధకులు దాదాపు వెయ్యి మంది మహిళలని అధ్యయనం కోసం పరీక్షించారు. ప్రతి రాత్రి సాధారణంగా ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోయే 35 మంది ఆరోగ్యకరమైన మహిళలు ఇందులో పాల్గొన్నారు. ఆరు వారాల పాటు మహిళలు తమ సాధారణ దినచర్య ప్రకారం నిద్రపోయారు. మిగిలిన ఆరు వారాలు సాధారణం కంటే 1.5 గంటలు ఆలస్యంగా పడుకున్నారు. ఇందులో పాల్గొన్న వారికి మణికట్టుకి స్లీప్ ట్రాకర్ అమర్చారు. ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం వల్ల శరీరంలోని అనేక ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టాయి. కానీ గంటన్నర పాటు ఆలస్యంగా పడుకున్న వ్యక్తులు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి హృదయనాళ ప్రమాదాన్ని తీవ్రతరం చేసింది.

సరైన సమయానికి నిద్రపోకపోవడం వల్ల రక్తనాళాలు లైన్ చేసే కణాల ఆక్సిడెంట్లు దెబ్బతీస్తాయి. బాగా విశ్రాంతి పొందిన కణాల మాదిరిగా కాకుండా నిద్ర నిరోధిత కణాల పనితీరు మందగిస్తుంది. తేలికపాటి నిద్ర లోపాలు గుండె జబ్బులకి కారణమవుతాయని ఈ అధ్యయనానికి అధ్యక్షత వహించిన పరిశోధకులు తెలిపారు.

నిద్రలేమి వల్ల మతి పోతుందా?

నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం ఎనిమిది గంటల నిద్ర అవసరం. దీని కంటే తక్కువ నిద్రపోతే మతిమరుపు, నిరాశ, బరువు పెరగడం, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఎదురవుతాయి. స్లీప్ అప్నియా, జెట్ లాగ్, రెస్ట్ లెస్ లెగ్స్ సిండ్రోమ్ వంటి అనేక కారణాల వల్ల నిద్రలో ఇబ్బంది ఏర్పడుతుంది. డిప్రెషన్, స్కిజోఫ్రేనియా, క్రానిక్ పెయిన్ సిండ్రోమ్ ఉన్న వారిలో నిద్రలేమి సాధారణంగా కనిపిస్తుంది. దీని నుంచి బయట పడేందుకు మనసు వీలైనంత ప్రశాంతంగా ఉంచుకోవాలి. నిద్ర నాణ్యతని మెరుగు పరిచే ఆహార పదార్థాలు తీసుకోవాలి.

ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. అందుకోసం ధ్యానం, యోగా వంటివి చేయడం మంచిది. రాత్రిపూట ఆలస్యంగా భోజనం అసలు చేయకూడదు. అతిగా తినకుండా తేలికపాటి భోజనాన్ని ఎంచుకుంటే మంచిది. తిన్న తర్వాత నిద్రపోవడానికి కనీసం రెండు నుంచి మూడు గంటల సమయం ఉండేలా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ నిద్ర నాణ్యతని మెరుగుపరుచుకోవచ్చు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: మెడికల్ మిరాకిల్ - కోతికి పంది కిడ్నీ, రెండేళ్లుగా హాయిగా జీవించేస్తోన్న వానరం

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day 7 : అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
Dussehra Navratri Day6 : అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
White Chicken : నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
Beer vs Breezer : బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget