News
News
వీడియోలు ఆటలు
X

Sex life: లైంగికాసక్తి తగ్గిపోయిందా? దానికి కారణం ఆ విటమిన్ లోపం కావచ్చు

కొందరిలో లైంగికాసక్తి క్రమేణా తగ్గిపోతుంది. దీనివల్ల భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది.

FOLLOW US: 
Share:

భార్యాభర్తల బంధంలో లైంగిక చర్యకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇది  ఇద్దరి మధ్య ప్రేమను పెంచి దూరాన్ని తగ్గిస్తుంది. కానీ కొంతమందిలో ఆ ఆసక్తి తగ్గిపోతూ వస్తుంది. ఎందుకో కారణం వారికి కూడా తెలియదు. దీనివల్ల వైవాహిక బంధంలో కలతలు రావచ్చు. లైంగికాసక్తి తగ్గడానికి కారణాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కారణాల్లో ఒకటి విటమిన్ డి లోపం. ఈ విషయం తెలిసిన వారు చాలా తక్కువమందే ఉంటారు. విటమిన్ డి ను ‘సన్‌షైన్ విటమిన్’ అని కూడా పిలుస్తారు. అలాగే ‘సెక్స్ విటమిన్’ అని కూడా అంటారు. 

అనేక అధ్యయనాలు చెబుతున్న ప్రకారం విటమిన్ డి లోపం వల్ల వ్యక్తుల సెక్స్ డ్రైవ్‌లో మార్పులు వస్తాయి. టెస్టోస్టెరాన్ ఉత్పత్తిలో విటమిన్ డి పాత్ర చాలా ముఖ్యమైనది. ఇది లోపిస్తే లైంగికాసక్తి తగ్గిపోతుంది. విటమిన్ డి లోపం కేవలం పురుషులను మాత్రమే ప్రభావితం చేయదు. ఇది మహిళల్లో తక్కువ ఈస్ట్రోజెన్ స్థాయిలకు కారణం అవుతుంది. దీని వల్ల వారిలో కూడా విటమిన్ డి లోపం వస్తుంది. క్లీవ్‌ల్యాండ్ హార్ట్ ల్యాబ్  చేసిన పరిశోధన ప్రకారం, విటమిన్ డి జననేంద్రియాలకు రక్త ప్రవాహాన్ని పెంచడంలో సహాయపడుతుంది. రక్త నాళాల గోడల లైనింగ్‌ను మెరుగుపరచడం ద్వారా ఇది లైంగిక జీవితాన్ని రక్షిస్తుంది. రక్త ప్రసరణ సవ్యంగా జరిగేలా చేసి వాపును తగ్గిస్తుంది. 

స్త్రీలో..
విటమిన్ డి లేక ఇతర కారణాల వల్ల ఈస్ట్రోజెన్ ఉత్పత్తి తగ్గితే సెక్స్ కోరికలు కూడా తగ్గిపోతాయి. జననేంద్రియ గోడలోని కండరాలు ఆరోగ్యంగా ఉండవు.ఈస్ట్రోజెన్ తగ్గడం వల్ల జననేంద్రియాలు పొడిగా మారిపోతాయి. 

పురుషుల్లో
విటమిన్ డి లోపం వల్ల మగవారిలో టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఇది శరీరంలో ఎన్నో మార్పులకు కారణం అవుతుంది. వెంట్రుకలు ఊడిపోవడం, కండరాలు కరిగిపోవడం, ఛాతీ భాగం పెరగడం వంటివి జరుగుతాయి. 2018లో  114 మంది పురుషులపై అధ్యాయనాన్ని నిర్వహించారు.  విటమిన్ డి, లైంగిక పనితీరు మధ్య సంబంధాన్ని పరిశీలించారు. విటమిన్ డికి, లైంగికాసక్తికి మధ్య బంధాన్ని ఈ అధ్యయనాన్ని ధ్రువీకరించింది.  పరిశోధన ప్రకారం, తక్కువ సెక్స్ డ్రైవ్‌తో బాధపడుతున్న పురుషులు రెండు వారాల పాటూ రోజుకు 30 నిమిషాలు ఉదయం పూట ఎండలో నిలబడితే మంచిది. 

సూర్యరశ్మికి గురికావడం వల్ల మీ శరీరంలో మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (MSH) ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది మెలనిన్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఇది మీ చర్మాన్ని ఎండ బారిన పడి దెబ్బతినకుండా కాపాడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, మెలనిన్, సెక్స్ హార్మోన్లు ఒకదానికొకటి తమ పనితీరును మెరుపరుచుకోవడానికి సహకరించుకుంటాయి. 

Also read: మండే ఎండల్లో జీన్స్ వేసుకోకపోవడమే మంచిది, లేకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Published at : 05 May 2023 12:05 PM (IST) Tags: Vitamin D Sex drive Decreased sex drive Vitamin D and Sex

సంబంధిత కథనాలు

వేసవిలో షవర్, బాత్ టబ్‌లో స్నానం యమ డేంజర్ - ఈ బ్యాక్టీరియా ప్రాణం తీస్తుందట!

వేసవిలో షవర్, బాత్ టబ్‌లో స్నానం యమ డేంజర్ - ఈ బ్యాక్టీరియా ప్రాణం తీస్తుందట!

Thick Hair Tips: ఒత్తైన జుట్టు కోసం వంటింటి చిట్కాలు

Thick Hair Tips: ఒత్తైన జుట్టు కోసం వంటింటి చిట్కాలు

Sleeping Rules in Shastra: దిండు కింద వీటిని పెట్టుకుని పడుకోవడం పెద్ద తప్పు!

Sleeping Rules in Shastra: దిండు కింద వీటిని పెట్టుకుని పడుకోవడం పెద్ద తప్పు!

గుండె జబ్బుల నివారణకు మంచి పరిష్కారం ఈ జ్యూస్

గుండె జబ్బుల నివారణకు మంచి పరిష్కారం ఈ జ్యూస్

High Cholesterol: కొవ్వుతో జర భద్రం - ఈ లక్షణాలు కనిపిస్తే కొలెస్ట్రాల్ ప్రమాదం పెరుగుతోందని అర్థం!

High Cholesterol: కొవ్వుతో జర భద్రం - ఈ లక్షణాలు కనిపిస్తే కొలెస్ట్రాల్ ప్రమాదం పెరుగుతోందని అర్థం!

టాప్ స్టోరీస్

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Kottu Satyanarayana: మనం చేసిన యాగం వల్లే కేంద్రం మనకి నిధులిచ్చింది - మంత్రి కొట్టు వ్యాఖ్యలు

Kottu Satyanarayana: మనం చేసిన యాగం వల్లే కేంద్రం మనకి నిధులిచ్చింది - మంత్రి కొట్టు వ్యాఖ్యలు

YS Viveka Case : వివేకా కేసులో సీబీఐ అప్ డేట్ - అవినాష్ రెడ్డి A-8 నిందితుడని కోర్టులో కౌంటర్ !

YS Viveka  Case : వివేకా కేసులో సీబీఐ అప్ డేట్ -  అవినాష్ రెడ్డి A-8 నిందితుడని కోర్టులో కౌంటర్  !

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్