అన్వేషించండి

Cold Feet : పాదాలు ఎప్పుడూ చల్లగా ఉంటున్నాయా? నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం, ఎందుకంటే?

Cold Feet Health Problems : చాలామందికి పాదాలు బాగా చల్లగా ఉంటాయి. అయితే ఇది కామన్ కాదని.. తీవ్రమైన అనారోగ్యాలకు సంకేతం కావొచ్చని చెప్తున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Diseases Causing Cold Feet : మీ పాదాలు తరచుగా మంచులా చల్లగా మారుతున్నాయా? వాతావరణం చల్లగా ఉన్నా.. వేడిగా ఉన్నా.. మీ పాదాలు మాత్రం ఎప్పుడూ చల్లగానే ఉంటున్నాయా? అయితే మీరు దానిని నిర్లక్ష్యం చేయవద్దని చెప్తున్నారు నిపుణులు. చాలామంది దీనినో సాధారణ సమస్యగా భావిస్తారు. ఎందుకంటే.. ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ నెమ్మదిగా ఉండడం లేదా గాలి తగలడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చు అనుకుంటారు. కానీ ఇలా రెగ్యులర్​గా జరుగుతుంటే కామన్ కాదని.. శరీరంలో దాగి ఉన్న మరో కొన్ని వ్యాధులకు సంకేతం కూడా కావచ్చని చెప్తున్నారు.

ఆరోగ్య సమస్యలు వాటి లక్షణాలు

వైద్యుల అభిప్రాయం ప్రకారం.. పాదాలు ఎక్కువ కాలం చల్లగా ఉంటే.. నరాల సమస్య, రక్త ప్రసరణలో ఆటంకం లేదా థైరాయిడ్ వంటి హార్మోన్ల అసమతుల్యతకు సంకేతం కావచ్చని చెప్తున్నారు. అయితే మీ పాదాలు చల్లగా మారడానికి కారణాలు ఏంటి? వైద్యుడిని ఏ పరిస్థితుల్లో సంప్రదించాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గుండె సమస్యలు

పాదాలకు తగినంత రక్తం సరఫరా కానప్పుడు.. అవి చల్లగా అనిపిస్తాయి. ఈ పరిస్థితి సాధారణంగా గుండె సంబంధిత వ్యాధులు ఉన్నప్పుడు, అధిక కొలెస్ట్రాల్ లేదా ధమనులలో బ్లాకేజీల కారణంగా సంభవిస్తుంది.

లక్షణాలు

  • పాదాలలో తిమ్మిరి
  • పాదాలు మొద్దుబారడం
  • నడుస్తున్నప్పుడు అలసట లేదా నొప్పి


Cold Feet : పాదాలు ఎప్పుడూ చల్లగా ఉంటున్నాయా? నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం, ఎందుకంటే?

మధుమేహం

పెరిఫెరల్ న్యూరోపతి అనే పరిస్థితి ప్రధానంగా మధుమేహానికి సంబంధించినది. ఈ సమస్య ఉన్నవారి పాదాల నరాలు దెబ్బతింటాయి. పాదాలలో చల్లదనం, మంట లేదా తిమ్మిరికి దారి తీస్తాయి. ఆ సమయంలో కనిపించే లక్షణాలు ఇవే..

  • పాదాలలో సూదులు గుచ్చినట్లు అనిపించడం
  • తేలికపాటి నొప్పి లేదా మంట
  • నడవడంలో ఇబ్బంది

హైపోథైరాయిడిజం

థైరాయిడ్ గ్రంథి తగినంత హార్మోన్లను ఉత్పత్తి చేయకపోతే.. శరీర ఉష్ణోగ్రత నియంత్రణ ప్రభావితమవుతుంది. దీనివల్ల చేతులు, పాదాలు చల్లగా మారతాయి. దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే..

  • తరచుగా చలిగా అనిపించడం
  • అలసట, బరువు పెరగడం
  • జుట్టు రాలడం, పొడి చర్మం

రైనోడ్స్ సిండ్రోమ్

ఇది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్. ఈ సమస్య ఉంటే చలి ఉన్నప్పుడు లేదా ఒత్తిడి సమయంలో వేళ్లు, పాదాల రక్త నాళాలు కుంచించుకుపోతాయి. దీనివల్ల పాదాలు మంచులా చల్లగా మారుతాయి.

  • పాదాల రంగు నీలం లేదా పసుపు రంగులోకి మారడం
  • తిమ్మిరి 
  • చలిలో తీవ్రమైన ప్రభావం


Cold Feet : పాదాలు ఎప్పుడూ చల్లగా ఉంటున్నాయా? నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం, ఎందుకంటే?

చల్లని పాదాలు కేవలం ఒక సీజన్‌కు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఇది మీ శరీరంలో జరుగుతున్న వివిధ ఆరోగ్య సమస్యలకి సంకేతం. పాదాలు చల్లగా మారడంతో పాటు ఈ తరహా లక్షణాలు గుర్తిస్తే వెంటనే వైద్యుడి దగ్గరకు వెళ్లడం మంచిది. ఈ సమస్య తరచూ కొనసాగితే.. దానిని నిర్లక్ష్యం చేయకపోవడమే మంచిది. సకాలంలో సరైన పరీక్షలు, చికిత్స అందిస్తే.. పాదాలు చల్లగా మారడం తగ్గడమే కాకుండా.. పలు దీర్ఘకాలిక వ్యాధుల సమస్యలను పెరగకుండా కాపాడుకోగలుగుతారు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Common Krait Poisonous Snake: దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Embed widget