అన్వేషించండి

Christmas 2025 : క్రిస్మస్ కోసం మీ బాల్కనీని ఇలా అందంగా మార్చుకోండి.. Best Decoration Tips

Balcony Decor Ideas for Christmas : క్రిస్మస్ 2025 కోసం చాలామంది బాల్కానీలను అందంగా ముస్తాబు చేసి.. స్టార్స్ పెడుతూ ఉంటారు. మరి మీరు మీ బాల్కనీని క్రిస్మస్ కోసం ఎలా సిద్ధం చేసుకోవచ్చో చూసేద్దాం.

Christmas Balcony Decoration Ideas : బాల్కనీలు ఇంటి విలువను, ఆకర్షణను పెంచుతాయి. అందుకే చాలామంది ఇల్లు తీసుకునే ముందు, అద్దె ఇల్లు అయినా సరే బాల్కనీని కోరుకుంటారు. ఇవి ఇంటికి వెచ్చదనాన్ని, మంచి అనుభూతిని ఇస్తాయి. మీ ఇళ్లు అందంగా కనిపించాలంటే.. బాల్కానీని కూడా అందంగా సర్దుకోవాలి. బాల్కనీ అందంగా ఉంటే చాలు. ప్రశాంతంగా అక్కడే సమయాన్ని గడిపేయవచ్చు. ఈ క్రిస్మస్ సమయంలో బాల్కనీని అందంగా మార్చగలిగే చిట్కాలు ఇప్పుడు చూసేద్దాం.

లేయర్డ్ ఫెయిరీ లైట్లు

(Image Source: ABPLIVE AI)
(Image Source: ABPLIVE AI)

మంచి లైటింగ్ డీప్ కనెక్షన్ ఇస్తుంది. ఇది బాల్కానీని ఆకర్షణీయంగా మార్చేస్తుంది. లేయర్డ్ ఫెయిరీ లైట్లు లేదా LED కర్టెన్లు వార్మ్ లైటింగ్‌ను ఇస్తాయి. ఇది బాల్కానీ లుక్​కి హైలెట్​గా ఉంటుంది. ఇంటిని చూసేవారికి మంచి అనుభూతిని ఇస్తుంది. పండుగ సీజన్‌లో చూడడానికి బాగుంటుంది. ముఖ్యంగా చలికాలంలో చీకటి త్వరగా వస్తుంది. ఆ సమయంలో ఈ లైట్స్ చాలా అందంగా కనిపిస్తాయి. 

సీటింగ్ అరేంజ్మెంట్స్

(Image Source: ABPLIVE AI)
(Image Source: ABPLIVE AI)

లెట్స్​తో అందంగా అందంగా సిద్ధం చేసుకున్న బాల్కనీలో కూర్చోకుంటే ఎలా? కాబట్టి మంచి సీటింగ్​ను అరేంజ్ చేయండి. కాసేపు ఇంట్లోవారితో, స్నేహితులతో వేడి వేడిగా హాట్ చాక్లెట్ తాగుతూ లేదా.. స్నాక్స్ తింటూ మంచి టైమ్​ని స్పెండ్ చేయవచ్చు. ప్లష్ త్రోలు, దిండ్లు సపోర్ట్ కోసం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. 

క్రిస్మస్ ట్రీ సెటప్‌

(Image Source: ABPLIVE AI)
(Image Source: ABPLIVE AI)

క్రిస్మస్ సమయంలో బాల్కనీ డెకరేషన్ అంటే.. క్రిస్మస్ ట్రీ ఉండాల్సిందే. కాబట్టి బాల్కనీలో ఓ వైపు స్టూల్ వేసి లేదా గోడకు అమర్చగలిగే క్రిస్మస్ ట్రీని ఎంచుకోండి. చిన్న స్థలంలోనే పండుగ వాతావరణాన్ని రెట్టింపు చేయగలిగే టిప్ ఇది.

ఆకుపచ్చని మొక్కలు

(Image Source: ABPLIVE AI)
(Image Source: ABPLIVE AI)

ఎవర్ గ్రీన్, పోయిన్‌సెట్టియాస్, బెర్రీ-బ్రాంచ్ యాసలతో కూడిన కుకీ-కట్టర్ డిజైన్‌లను ఉపయోగించి.. మీ బాల్కానీని కలర్​ఫుల్​గా మార్చేయండి. ఆకుపచ్చని మొక్కల నుంచి ఉత్పన్నమయ్యే భావోద్వేగ ప్రతిస్పందన ఇంటికి ప్రశాంతమైన వాతావరణం ఇస్తుంది. 

రస్టిక్ మెటాలిక్ డెకర్

(Image Source: ABPLIVE AI)
(Image Source: ABPLIVE AI)

LED కొవ్వొత్తితో కూడిన లాంతర్లు వంటివి యూరోపియన్ అనుభూతిని ఇస్తాయి. ఈ రకమైన డెకర్ అటు ట్రెడీషనల్, ట్రెండీ వైబ్స్ ఇస్తుంది. కాబట్టి సింపుల్ లాంతర్లు వాటిలో మంచి సువాసనను ఇచ్చే క్యాండిల్స్ పెడితే వాతావరణం చాలా అద్భుతంగా మారిపోతుంది.

క్రిస్మస్ రిలేటడ్ డెకరేషన్స్

(Image Source: ABPLIVE AI)
(Image Source: ABPLIVE AI)

దండలు, స్నోఫ్లేక్‌లు, జింక బొమ్మలు వంటి క్రిస్మస్ లుక్​ని పెంచే.. ఐటమ్స్ కొని బాల్కానీని సిద్ధం చేసుకోవచ్చు. క్రిస్మస్ ట్రీలతో కూడిన దండలు, శాంటాక్లాజ్, రెడ్, గ్రీన్ కాంబినేషన్స్​లో ఉండే డెకార్ మంచి లుక్ ఇస్తాయి. 

మినీ వింటర్ వండర్‌ల్యాండ్‌

(Image Source: ABPLIVE AI)
(Image Source: ABPLIVE AI)

వింటర్ ట్రీలు, ఫెస్టివల్ మగ్స్, టేబుల్ రన్నర్‌లు బాల్కనీని అందమైన ప్రదేశంగా మారుస్తాయి. టేబుల్​పై కూడా ఫెయిరీ లైట్స్ పెట్టి.. మంచి థీమ్ డెకరేట్ చేసుకుంటే బాల్కనీ లుక్ నెక్స్ట్ లెవెల్​లో ఉంటుంది. 

గోడలను స్టైల్ చేయండిలా

(Image Source: ABPLIVE AI)
(Image Source: ABPLIVE AI)

ప్రీ-లైట్ గర్లాండ్‌లు, వాల్ డెకరేషన్స్, మాక్రేమ్ డెకర్ బాల్కనీకి మంచిగా నప్పుతాయి. దీనివల్ల ఫ్లోర్​పై ఎక్కువ డెకరేట్ చేయకపోయినా లుక్ బాగుంటుంది. చిన్న బాల్కనీలు ఉన్నవారు ఇలా వాల్ డెకర్​ని ప్రిఫర్ చేయవచ్చు. 

మరి ఈ క్రిస్మస్​కి మీ ఇంటి బాల్కనీని ఈ టిప్స్​తో మీకు నచ్చినట్లు డెకరేట్ చేసుకోండి. అయితే డెకరేషన్ పూర్తి అయ్యాక స్టార్ పెట్టడం మాత్రం అస్సలు మరచిపోవద్దు. అదే మెయిన్ ఇంపార్టెంట్ డెకరేషన్. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
Monsoon 2026: వర్షం పడుతుంటే టీ తాగుతూ పకోడీలు తినాలనే కోరిక ఎందుకు పెరుగుతుంది?
వర్షం పడుతుంటే టీ తాగుతూ పకోడీలు తినాలనే కోరిక ఎందుకు పెరుగుతుంది?
Gen Z vs Millennials: మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Car Insurance: నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Embed widget