అన్వేషించండి

Chicken Soup: శీతాకాలం చికెన్ సూప్ తాగితే ఆ వైరల్ ఇన్ఫెక్షన్లు అన్నీ దూరం, ఇలా చేసుకోండి

చికెన్ సూప్ ఎక్కువ మంది తినడానికి ఇష్టపడరు. చికెన్ కూర వండుకుని తింటారు.

తెలుగిళ్లల్లో చికెన్ సూప్ కన్నాచికెన్ కూర వండుకుని తినేసే వాళ్లే ఎక్కువ. నిజానికి చికెన్ కూర కన్నా శీతాకాలంలో చికెన్ సూప్ తింటేనే చాలా ఆరోగ్యం. చల్లని సాయంత్రం వేళ వేడి వేడి చికెన్ సూప్ తింటే ఆ రుచే వేరు. వేడి సూప్ పొట్టలోకి చేరగానే శరీరానికి చాలా చురుకుదనంతో పాటూ ఉత్తేజంగా అనిపిస్తుంది. ముఖ్యంగా శీతాకాలంలో చికెన్ సూప్ తినడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉన్నాయి. 
 
సూప్ మాత్రమే ఎందుకు?
కూరగా,వేపుడుగా కాకుండా సూప్ రూపంలోనే తీసుకుంటే ఎందుకంత మేలు? శీతాకాలంలో జలుబు, దగ్గు వంటి సులువుగా వస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్లు వెంటనే సోకుతాయి. ఇలాంటివి రాకుండా చికెన్ సూప్‌లోని గుణాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. 'కాపింగ్ విత్ అలర్జీస్ అండ్ ఆస్తమా' జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం వెచ్చని చికెన్ సూప్ ముక్కు ద్వారా ఎలాంటి అలెర్జీ కారకాలు రాకుండా నిరోధించే సిలియా (ముక్కు వెంట్రుకలు) పనితీరును మెరుగుపరుస్తాయి.చికెన్ సూప్‌లోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, ఫ్లూకి వ్యతిరేకంగా నిరోధకతను పెంచుతాయి.చికెన్ సూప్‌లో ఉండే కార్నోసిన్ అనే సమ్మేళనం గొంతునొప్పి, దగ్గు, జలుబుని నయం చేయడంలో ముందుంటుంది. ఈ సమ్మేళనం తెల్ల రక్త కణాలు సమర్థంగా పనిచేసేలా చేసి ఇన్‌ఫ్లమ్మేషన్ రాకుండా తగ్గిస్తుంది. కోడి ఎముకలలో ఉండే జెలటిన్, గ్లూకోసమైన్, కొండ్రోయిటిన్ వంటివి సూప్‌ ద్వారా శరీరానికి చేరుతాయి. కోడి ఎముకలలో ఉండే అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు A, విటమిన్ K2, జింక్, ఐరన్, బోరాన్, మాంగనీస్, సెలీనియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవన్నీ సూప్‌లో కరిగి శరీరంలో చేరుతాయి. 

టేస్టీ చికెన్ సూప్ ఎలా చేయాలో తెలుసుకోండి

కావాల్సిన పదార్థాలు
ఎముకలతో కూడిన చికెన్  - వందగ్రాములు
దాల్చిన చెక్క - చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బల తురుము - నాలుగు
అల్లం తురుము - అర స్పూను
ఉల్లిపాయ - ఒకటి
క్యారెట్ - అరకప్పు
క్యాప్సికమ్ - అర కప్పు
గ్రీన్ బీన్స్ - అరకప్పు
లవంగాలు - మూడు
ఉప్పు - రుచికి సరిపడా
కార్న్ ఫ్లోర్  - రెండు స్పూన్లు
మిరియాల పొడి - అర స్పూను

తయారీ ఇలా
1. ముందుగా కుక్కర్లో చికెన్, దాల్చిన చెక్క, అల్లం తురుము, వెల్లుల్లి తురుము, క్యారెట్, క్యాప్సికమ్, గ్రీన్  బీన్స్, లవంగాలు, ఉప్పు వేసి మూడు నాలుగు విజిల్స్ దాకా ఉడికించాలి. 
2. కుక్కర్ మూత తీసి చికెన్ ముక్కలను ఏరి ఓ ప్లేటులో  వేసుకోవాలి. ఎముకల చుట్టూ ఉండే మెత్తటి ముక్కలను తీసి పెట్టుకోవాలి. ఎముకలు పడేయాలి. 
3. కుక్కర్లో మిగిలిని మిశ్రమాన్ని మళ్లీ స్టవ్ మీద పెట్టి మరిగించాలి. అందులో చికెన్ మెత్తటి ముక్కలను వేసుకోవాలి. 
4. మరుగుతున్నప్పుడు అర స్పూను మిరియాల పొడి వేసి కలపాలి. 
5. చివర్లో కార్న్ ఫ్లోర్ నీటిలో కలిపి ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. అప్పుడు సూప్ కాస్త చిక్కగా అవుతుంది. 

Also read: డెంగ్యూతో పోరాడుతున్నారా? ఇంట్లో తయారుచేసిన ఈ పానీయాలు తాగండి

టాప్ హెడ్ లైన్స్

High BP : బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget