అన్వేషించండి

Nonveg Storage Guide : మాంసాన్ని ఎంతకాలం నిల్వ చేయవచ్చు? చికెన్, మటన్ కుళ్లిపోవడానికి ఎన్ని రోజులు పడుతుంది?

Tips to Store Meat Properly : మటన్ లేదా కోడి మాంసాన్ని ఎంతకాలం నిల్వ చేయవచ్చు? అది పాడవ్వడం ప్రారంభం కావడానికి ఎన్ని రోజులు పడుతుంది? అసలు మీట్​ని ఎలా స్టోర్ చేస్తే మంచిదో చూసేద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మాంసం నిల్వలో లోపాలు బ్యాక్టీరియా పెంచి, ఆరోగ్యం పాడు చేస్తాయి.
  • గది ఉష్ణోగ్రతలో గంటలు, ఫ్రిడ్జ్‌లో 3-5 రోజులు మాత్రమే నిల్వ చేయాలి.
  • ఫ్రీజర్‌లో సరైన ప్యాకింగ్‌తో నిల్వ, డీఫ్రాస్టింగ్ పద్ధతులు ముఖ్యం.

Chicken, Mutton and Fish Storage Timelines : చికెన్, మటన్ వంటి మాంసాహార పదార్థాలు చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే వీటిని కొనుగోలు చేసిన తర్వాత ఎంతకాలం నిల్వ ఉంచవచ్చు? ఎప్పుడు అవి కుళ్లిపోవడం స్టార్ట్ అవుతాయి. ఇలాంటి విషయాలు తెలియక చాలామంది వాటిని వండుకుని తిని.. ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటారు. అలాగే సరైన విధంగా నిల్వ చేయకపోతే మాంసంలో బ్యాక్టీరియా వేగంగా పెరిగి.. ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది. అందుకే మాంసాన్ని ఎంతకాలం, ఎలా భద్రపరచాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

బయట ఎంతసేపు ఉంచాలి?

చికెన్ లేదా మటన్‌ను గది ఉష్ణోగ్రతలో ఎక్కువసేపు ఉంచకూడదు. సాధారణంగా వండకుండా ఉంచిన మాంసాన్ని 2 గంటలకు మించి బయట ఉంచితే బ్యాక్టీరియా పెరగడం ప్రారంభమవుతుంది. వేసవిలో లేదా ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు కేవలం 1 గంటలోనే అవి పాడయ్యే ప్రమాదం ఉంటుంది.

ఎక్కువ కాలం నిల్వ చేయాలంటే..

మాంసాన్ని ఎక్కువ కాలం నిల్వ చేయడానికి ఉత్తమ మార్గం దానిని ఫ్రీజర్‌లో భద్రపరచడం. అమెరికా వ్యవసాయ శాఖ ప్రకారం.. -18°C లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసిన మాంసం ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఎందుకంటే ఈ ఉష్ణోగ్రత వద్ద బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు నిర్వీర్యమవుతాయి. అయితే కాలక్రమేణా దాని రుచి, నాణ్యత క్షీణించవచ్చు.

ఫ్రీజర్‌లో ఎన్ని రోజులు ఉంచవచ్చు..

మాంసం గడ్డకట్టడం వల్ల దానిని స్టోర్ చేసే కాలం గణనీయంగా పెరుగుతుంది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం.. చికెన్‌ను సుమారు ఒక సంవత్సరం వరకు గడ్డకట్టించవచ్చు. వివిధ రకాల చేపలను 2 నుంచి 8 నెలల వరకు గడ్డకట్టించి స్టోర్ చేయవచ్చు. అయితే దాని రుచి, నాణ్యత కోసం వాటిని నిర్దేశించిన కాలపరిమితిలోనే ఉపయోగించాలని ఆహార నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

ఫ్రీజర్‌లో మాంసాన్ని ఎలా నిల్వ చేయాలంటే..

మాంసాన్ని గడ్డకట్టించే ముందు దానిని సరిగ్గా ప్యాక్ చేయడం చాలా ముఖ్యం. అసలు ప్యాకేజింగ్‌పై ప్లాస్టిక్ ర్యాప్ లేదా ఫాయిల్ వంటి లేయర్​ వేసి ప్యాక్ చేయడం వల్ల తేమ బయటకు పోకుండా నిరోధించవచ్చని, మాంసం ఎక్కువ కాలం తాజాగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

మాంసాన్ని ఎంత తాజాగా గడ్డకట్టిస్తే, దాని నాణ్యత అంత మెరుగ్గా ఉంటుంది. డీఫ్రాస్ట్ చేసే పద్ధతి కూడా అంతే ముఖ్యం. గడ్డకట్టిన మాంసాన్ని గది ఉష్ణోగ్రతలో ఉంచి కరిగించడం సురక్షితం కాదు. దానిని రిఫ్రిజిరేటర్‌లో గానీ, చల్లటి నీటితో నింపిన మూసివున్న పాత్రలో గానీ, లేదా మైక్రోవేవ్‌ను ఉపయోగించి గానీ కరిగించాలి. సరిగ్గా కరిగించకపోయినా  బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది.

ఫ్రిడ్జ్​లో నిల్వ చేయాలంటే.. 

మీరు పచ్చి మాంసాన్ని ఫ్రిడ్జ్​లో ఉంచాలనకుంటే.. ఎక్కువ కాలం నిల్వ ఉంచలేరు. యుఎస్ వ్యవసాయ శాఖ, ఆహార-ఔషధ పరిపాలన సంస్థ మార్గదర్శకాల ప్రకారం.. చాలా రకాల పచ్చి మాంసాలు రిఫ్రిజిరేటర్‌లో కేవలం 3 నుంచి 5 రోజుల వరకు మాత్రమే సురక్షితంగా ఉంటాయి. ముక్కలుగా కోసిన లేదా కీమా చేసిన మాంసాన్ని రిఫ్రిజిరేటర్‌లో 1 నుంచి 2 రోజులు మాత్రమే ఉంచాలి. ఆ తర్వాత.. అది పాడయ్యే ప్రమాదం పెరుగుతుంది.

అలాగే చికెన్, ఇతర పౌల్ట్రీ ఉత్పత్తులను తక్కువ కాలం మాత్రమే స్టోర్ చేయాలి. పచ్చి చికెన్ రిఫ్రిజిరేటర్‌లో కేవలం 1 నుంచి 2 రోజుల వరకు ఉంచితే దానిని సురక్షితంగా పరిగణిస్తారు. ఒకవేళ చికెన్‌ను వండినట్లయితే.. దానిని 3 నుంచి 4 రోజులలోపు ఉపయోగించాలి. దానిని ఎక్కువ కాలం నిల్వ ఉంచడం వల్ల బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం పెరుగుతుంది.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
Bigger Thighs : తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Embed widget