అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Kids Diet : మఫిన్స్​ను ఇలా చేసి పెడితే పిల్లల ఆరోగ్యానికి ఎంతో మంచిది.. రెసిపీ చాలా సింపుల్

Healthy Food for Kids : పిల్లలు, పెద్దలు హెల్తీగా, టేస్టీగా, స్పెషల్​గా ఏమైనా తినాలనుకుంటే మీరు ఆదివారం రోజు స్పెషల్​గా క్యారెట్ మఫిన్స్ చేయవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం.

Carrot Muffins : పిల్లల ఆరోగ్యం కోసం వారికి హెల్తీ ఫుడ్​ని పెట్టాలనుకుంటారు. కానీ వారికి అవి నచ్చవు. అలాంటప్పుడు పిల్లలకు నచ్చే విధంగా హెల్తీ ఫుడ్​ని తయారు చేయవచ్చు. అలాంటి హెల్తీ రెసిపీనే క్యారెట్ మఫిన్లు. ఇవి పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే సూపర్​ ఫుడ్​గా పనిచేస్తాయి. అంతేకాకుండా ఇవి చాలా రుచికరంగా ఉండడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో? వాటిని ఎలా తయారు చేయాలో? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

క్యారెట్స్ - 5

కన్డెన్స్డ్​ మిల్క్ - 60 మి.లీ

పాల పొడి - 20 గ్రాములు

డ్రై ఫ్రూట్స్ - రుచికి తగినంత

పాలు - పావు కప్పు

తయారీ విధానం 

ముందుగా క్యారెట్స్​ బాగా కడిగి పైన లేయర్​ను పీల్ చేయాలి. ఇప్పుడు క్యారెట్స్​ను బాగా సన్నగా తురుముకోవాలి. ఈ కొలతలకు సరిపడాలంటే రెండు కప్పుల క్యారెట్ తురుము ఉండేలా చూసుకోండి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై​ నాన్​స్టిక్ పాన్ ఉంచండి. అది వేడి అయిన తర్వాత దానిలో క్యారెట్ తురుము వేయండి. తురుములోని తేమ ఆవిరైపోయే వరకు క్యారెట్​ను వేయించండి. క్యారెట్​లోని తేమ పోయే వరకు స్టౌవ్ దగ్గరే ఉండి వేయించండి. లేదంటే మాడిపోయే ప్రమాదముంది. 

క్యారెట్​లోని తేమ ఆవిరైపోయాక అందులో పాలు వేయండి. పాలల్లో క్యారెట్ మెత్తబడేవరకు మూత పెట్టి ఉడికించండి. అనంతరం పాల పొడి కూడా వేసి బాగా ఉడికించాలి. ఇప్పుడు దానిలో కండెన్స్​డ్ మిల్క్​ వేయండి. క్యారెట్ మిశ్రమం మందపాటిగా అయ్యేవరకు బాగా కలపాలి. ఇప్పుడు స్టౌవ్ ఆపేసి.. దానిని చల్లారనివ్వండి. మఫిన్ మౌల్డ్​ తీసుకుని దానికి బటర్ అప్లై చేయండి. బటర్ అందుబాటులో లేకుంటే గోధుమపిండిని కూడా వేయొచ్చు. ఇది మఫిన్స్​ మోల్డ్ స్టిక్​ కాకుండా చేస్తుంది. 

చల్లారిన క్యారెట్ మిశ్రమాన్ని మఫిన్ మౌల్డ్స్​లో సగం వరకు పోయాలి. ఓవెన్​ను180 డిగ్రీల సెల్సియస్ వద్ద 5 నిమిషాలు ప్రీ హీట్ చేయండి. అనంతరం మౌల్డ్స్​ను ఓవెన్​లో ఉంచి 170 డిగ్రీల వద్ద 10 నిమిషాలు బేక్ చేయండి. వాటిని బయటకు తీసి ఓ ప్లేట్​లోకి మార్చండి. అంతే హెల్తీ, టేస్టీ క్యారెట్ మఫిన్స్ రెడీ. వీటిని మీరు డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేయవచ్చు. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకు హెల్తీ స్నాక్ పెట్టాలనుకుంటే ఇది చాలా మంచి ఎంపిక. ఎందుకంటే క్యారెట్ మఫిన్స్​ వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు కూడా అందుతాయి. 

క్యారెట్​లో బీటా కెరోటిన్, విటమిన్ ఎ, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని, కంటి చూపును మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి పిల్లలను రక్షిస్తాయి. గొంతునొప్పి, జలుబు, ఇన్​ఫ్లూఎంజా వంటి వంటి ఆరోగ్య సమస్యలు రాకుండా శరీరానికి పోషకాలు అందిస్తాయి. పిల్లలు మఫిన్స్ వంటి వాటిని ఇష్టంగా తింటారు కాబట్టి హెల్తీ ఫుడ్​గా వీటిని మీరు వారికోసం తయారు చేసి తినిపించవచ్చు. అయితే వీటిని పిల్లలే కాదు.. పెద్దలు కూడా హెల్తీ స్నాక్​గా తీసుకోవచ్చు. 

Also Read : బరువు తగ్గాలంటే ఈ ఫ్రూట్స్ తినాలంటున్న నిపుణులు - ఎందుకంటే?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
AR Rahman Legal Notice: వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
Weather Update: బంగాళాఖాతంలో అల్ప పీడనం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో చలికి గజగజ
బంగాళాఖాతంలో అల్ప పీడనం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో చలికి గజగజ
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Embed widget