అన్వేషించండి

Cabbage Dosa: టేస్టీ క్యాబేజీ దోశ, ఎంత తిన్నా తినాలనిపిస్తుంది

క్యాబేజీ దోశె ఎప్పుడైనా తిన్నారా? ఓసారి ప్రయత్నించండి

మసాలా దోశె, కారం దోశె, ఉప్మా దోశె, రవ్వ దోశె... ఇలా రకరకాల దోశెలు ఉన్నాయి. ఎప్పుడూ వీటినే తింటే బోరు కొట్టేస్తుంది. కొత్తగా క్యాబేజీ దోశెను కూడా ఓసారి ప్రయత్నించండి. దీని రుచి అదిరిపోతుంది. రుచి కొత్తగా అనిపిస్తుంది కూడా. పిల్లలు కచ్చితంగా నచ్చే అవకాశం ఉంది. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులువు. ఓసారి చేసి తిన్నారంటే మీరే మళ్లీ మళ్లీ వండుకుంటారు. 

కావాల్సిన పదార్థాలు
బియ్యం - రెండు కప్పులు
ఎండు మిర్చి - రెండు
ఉల్లిపాయ - ఒకటి
జీలకర్ర - రెండు స్పూన్లు
చింతపండు - చిన్న ఉండ
కొత్తిమీర - ఒక కట్ట
క్యాబేజీ - కప్పు
కొబ్బరి ముక్కలు - ఒక కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత

తయారీ ఇలా
1. బియ్యాన్ని రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఆ బియ్యాన్ని మెత్తగా రుబ్బాలి. 
2. ఆ బియ్యంలోనే జీలకర్ర, కొత్తిమీర, కొబ్బరి ముక్కలు, చింతపండు వేసి మెత్తగా రుబ్బాలి. అవసరం అయితే నీటిని కలపాలి. 
3. ఆ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. 
4. ఉల్లిపాయలు, క్యాబేజీలను చాలా సన్నగా తరగాలి. 
5. వీటిని బియ్యం మిశ్రమంలో వేయాలి. ఉండలు కట్టకుండా బాగా కలపాలి. 
6. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేసి వేడెక్కనివ్వాలి. 
7. పెనంపై బియ్యం మిశ్రయాన్ని గరిటెతో వేసి దోశెలా పలుచగా రుద్దాలి. 
8. రెండు వైపులా బాగా కాల్చాక తీసి ప్లేటులో వేసుకోవాలి. 
9. కొబ్బరి చట్నీతో ఈ దోశెలు తినడం వల్ల మంచి రుచిగా ఉంటుంది. 

క్యాబేజీ దోశె తినడం వల్ల ఎన్నో పోషకాలు అందుతాయి. దీనిలో సల్ఫోరఫేన్, కామెంఫెరాల్ అని పిలిచే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవన్నీ శరీరంలో వాపులు, నొప్పులు తగ్గేందుకు సహకరిస్తాయి. కాబట్టి రుమటాయిడ్ ఆర్ధరైటిస్ వంటి సమస్యలతో బాధపడేవారు క్యాబేజిని తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. దీనిలో  విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిలో ఇది ముందుంటుంది. ఎముకలు, రక్తనాళాలు, కండరాలు ఆరోగ్యంగా ఉండేందుకు క్యాబేజీ మేలు చేస్తుంది.  గుండె ఆరోగ్యానికి అవసరం అయిన శక్తివంతమైన సమ్మేళనాలు ఈ కూరగాయలో పుష్కలంగా ఉంటాయి. హైబీపీ ఉన్న వారు కూడా క్యాబేజీని అధికంగా తినాలి. ఇందులో ఉండే పొటాషియం బీపీని నియంత్రిస్తుంది. అందుకే హైబీపీ ఉన్న వారు కచ్చితంగా క్యాబేజీని ఆహారంలో భాగం చేసుకోవాలి. వారానికి రెండు సార్లు తింటే ఆరోగ్యపరంగా మేలు జరుగుతుంది.

Also read: కొబ్బరి మీగడ తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది, వారానికోసారి తినండి చాలు

Also read: నా భార్య తనకి కావలసినప్పుడు మాత్రమే నాకు దగ్గరవుతోంది, నా ఆసక్తి పట్టించుకోవడం లేదు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Drinks to Refresh Your Body : హైడ్రేషన్‌తో పాటు ఆరోగ్యానికి మేలు చేసే డ్రింక్స్ ఇవే.. వీకెండ్‌(Weekend)లో హెల్త్ రీసెట్ చేసుకునేందుకు బెస్ట్
హైడ్రేషన్‌తో పాటు ఆరోగ్యానికి మేలు చేసే డ్రింక్స్ ఇవే.. వీకెండ్‌(Weekend)లో హెల్త్ రీసెట్ చేసుకునేందుకు బెస్ట్
Hair Mask To Boost Hair Growth : మెంతులు, కొబ్బరిపాలతో హెయిర్ మాస్క్.. జుట్టు పలుచగా ఉంటే తప్పక ట్రై చేయండి
మెంతులు, కొబ్బరిపాలతో హెయిర్ మాస్క్.. జుట్టు పలుచగా ఉంటే తప్పక ట్రై చేయండి
Leafy Greens Benefits : రోజూ ఆకుకూరలు తినడం ఊపిరితిత్తుల(Lungs)కు మంచిదేనా? కొత్త అధ్యయనంలో ఇంట్రెస్టింగ్ విషయాలు
రోజూ ఆకుకూరలు తినడం ఊపిరితిత్తుల(Lungs)కు మంచిదేనా? కొత్త అధ్యయనంలో ఇంట్రెస్టింగ్ విషయాలు
Mutton Fry Recipe : ఘుమఘుమలాడే మటన్ ఫ్రై రెసిపీ.. రెస్టారెంట్ స్టైల్ టేస్ట్‌తో ఇంట్లోనే సింపుల్‌గా చేసేయండిలా
ఘుమఘుమలాడే మటన్ ఫ్రై రెసిపీ.. రెస్టారెంట్ స్టైల్ టేస్ట్‌తో ఇంట్లోనే సింపుల్‌గా చేసేయండిలా

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Horror: పెట్రోల్ బాంబుతో ప్రియురాలిని బెదిరిస్తూ కారులోనే యువకుడు సజీవదహనం
పెట్రోల్ బాంబుతో ప్రియురాలిని బెదిరిస్తూ కారులోనే యువకుడు సజీవదహనం
Hyderabad Crime News: బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో రక్తపాతం.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో రక్తపాతం.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. Food Ratings లో అట్టడుగున - టెన్షన్ పెడుతున్న FSSAI రిపోర్ట్
హైదరాబాద్ ఫుడ్ లవర్స్‌కు షాక్.. Food Ratings లో అట్టడుగున సిటీ - టెన్షన్ పెడుతున్న FSSAI రిపోర్ట్
US Iran War: ఇరాన్, అమెరికా మధ్య ముగింపు దశకు సీజ్‌ఫైర్ ఒప్పందం! దాడులతో తీవ్ర ఉద్రిక్తత
ఇరాన్, అమెరికా మధ్య ముగింపు దశకు సీజ్‌ఫైర్ ఒప్పందం! దాడులతో తీవ్ర ఉద్రిక్తత
Papaya Leaf Juice : బొప్పాయి ఆకుల జ్యూస్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. ఎలా తీసుకోవాలి? ఎంత మోతాదులో తాగాలి?
బొప్పాయి ఆకుల జ్యూస్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. ఎలా తీసుకోవాలి? ఎంత మోతాదులో తాగాలి?
Vedma Bojju Patel: ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
Drinks to Refresh Your Body : హైడ్రేషన్‌తో పాటు ఆరోగ్యానికి మేలు చేసే డ్రింక్స్ ఇవే.. వీకెండ్‌(Weekend)లో హెల్త్ రీసెట్ చేసుకునేందుకు బెస్ట్
హైడ్రేషన్‌తో పాటు ఆరోగ్యానికి మేలు చేసే డ్రింక్స్ ఇవే.. వీకెండ్‌(Weekend)లో హెల్త్ రీసెట్ చేసుకునేందుకు బెస్ట్
Secrets of Tirumala: 'వేంకటేశ్వర' పేరు వెనుకున్న రహస్యం ఏంటి? తిరుమలలో జరుగుతున్న అద్భుతాలేంటో తెలుసా?
'వేంకటేశ్వర' ఈ పేరు వెనుకున్న రహస్యం ఏంటి? తిరుమలలో జరుగుతున్న అద్భుతాలేంటో తెలుసా?
Embed widget