అన్వేషించండి

Beetroot Mysore pak: బీట్‌రూట్‌తో మైసూర్ పాక్ చేసేయండి, ఎంతో ఆరోగ్యం

టేస్టీ మైసూర్ పాక్‌ను బీట్‌రూట్‌తో కూడా తయారు చేయొచ్చు.

ఏదైనా ఆహారం తినే ముందు అది ఆరోగ్యపరంగా మేలు చేస్తుందో లేదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణ మైసూర్ పాక్‌ను తినడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. కాబట్టి బీట్‌రూట్ మైసూర్ పాక్‌ను తిని చూడండి. ఆరోగ్యానికి ఎంతో మంచిది, పైగా ఎంతో రుచి కూడా. దీని రంగు కూడా నోరూరించేలా ఉంటుంది. 

కావాల్సిన పదార్థాలు 
బీట్ రూట్ - రెండు 
శెనగపిండి - ఒక కప్పు 
చక్కెర - ఒక కప్పు 
నెయ్యి - ఒకటిన్నర కప్పు

తయారీ ఎలా
బీట్‌రూట్‌ను సన్నగా తరిగి, మిక్సీలో వేసి జ్యూస్ చేయాలి. ఒక కప్పు జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి శెనగపిండిని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. స్టవ్ కట్టేశాక ఆ పిండిని జల్లెడ పట్టాలి. పిండిలో ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఆ పిండిలో నెయ్యి వేసి బాగా కలపాలి. అలా కలిపాక పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండే కళాయి పెట్టాలి. అందులో పంచదార, బీట్ రూట్ జ్యూస్ వేసి చిన్న మంట మీద తీగపాకం తీయాలి. తీగపాకం వచ్చాక ముందుగా కలిపి పెట్టుకున్న నెయ్యి శనగపిండి మిశ్రమాన్ని వేసి కలపాలి. గరిటతో కలుపుతూనే ఉండాలి. ఉండలు కట్టకుండా చూసుకోవాలి. అంతా బాగా కలిసాక ఒక అరకప్పు నెయ్యిని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి. వీటిలో నెయ్యి ఇగిరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు ఒక ప్లేటుకు నెయ్యిని రాసి మిశ్రమాన్ని వేడిగా ఉండగానే అందులో వేయాలి. చల్లారే వరకు ఉంచి... చల్లారాక ముక్కలుగా కోసుకోవాలి. నోరూరించే బీట్‌రూట్ మైసూర్ పాక్ రెడీ అయినట్టే. 

బీట్ రూట్ తో వండిన వంటకాలు తినడం వల్ల రక్త హీనత సమస్య రాకుండా ఉంటుంది. దీన్ని తినడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి. పిల్లలు, మహిళలు కచ్చితంగా తినాల్సిన కూరగాయల్లో బీట్ రూట్ ముఖ్యమైనది. కాలేయం శుభ్రం అవ్వడానికి కూడా బీట్ రూట్ చాలా అవసరం. చర్మం కూడా ఈ కూరగాయ వల్ల మెరుపు సంతరించుకుంటుంది. ఎన్నో చర్మ సంబంధిత రోగాలు రాకుండా ఇవి అడ్డుకుంటాయి. శరీరం అంతటా ఆక్సిజన్ సవ్యంగా ప్రసారం కావడానికి ఈ కూరగాయ చక్కగా పనిచేస్తుంది. రోజూ బీట్ రూట్ జ్యూస్ తాగితే చర్మం యవ్వనంగా మారిపోతుంది. మధుమేహం ఉన్న వారు ఈ కూరగాయను అధికంగా తినాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ముందుంటుంది. కాబట్టి డయాబెటిస్ రోగులు బీట్ రూట్ రోజూ తిన్ని మంచిదే. 

Also read: మా చెల్లి చేస్తున్న తప్పును నేను భరించాల్సి వస్తోంది, నాన్నకు చెప్పడం ఎలా?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

టాప్ హెడ్ లైన్స్

Amla Benefits : రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
Water Weight : వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే
వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Hair Transplant : హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Embed widget