By: ABP Desam | Updated at : 29 Dec 2022 12:04 PM (IST)
Edited By: Soundarya
Image Credit: Pexels
జుట్టు రాలడం అందరికీ ఒక సమస్యగా మారుతుంది. గతంలో అయితే జుట్టు పెంచుకోవడానికి ఇంట్లో అనేక మార్గాలు ఉండేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సన్నగా, పేలగా కనిపించే జుట్టును ఒత్తుగా మార్చేసుకోవచ్చు. జుట్టు పల్చగా ఉండే వారికి సరికొత్త రూపాన్ని ఇస్తుంది హెయిర్ బొటాక్స్. ఇప్పుడు అన్ని బ్యూటీ పార్లర్స్ లో ఇదే ట్రెండ్ నడుస్తుంది. జుట్టు చికిత్సలో భాగంగా ఎంతోమంది ప్రముఖులు కూడా దీన్ని తీసుకుంటున్నారు. ఇదొక ప్రత్యేకమైన చికిత్స.
హెయిర్ బొటాక్స్ అనేది ఒక లోతైన కండిషనింగ్ ట్రీట్మెంట్. హెయిర్ ఫైబర్లని కెరాటిన్ ఫిల్లర్ తో భర్తీ చేస్తుంది. ఈ చికిత్స వల్ల జుట్టు ఒత్తుగా, మెరిసేలా కనిపిస్తుంది. సన్నగా ఉన్న ప్రాంతాన్ని ఇది నింపుతుంది. హెయిర్ బొటాక్స్ అనేది ఒక కొత్త ట్రెండింగ్ ట్రీట్మెంట్. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రజాధరణ పొందింది. క్యూటికల్స్ లేయర్లని ఇది భర్తీ చేస్తుంది. పోయిన క్యూటికల్స్ ని తాత్కాలికంగా భర్తీ చేసి జుట్టుని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇది జుట్టుకు డీప్ కండిషనింగ్ గా ఉపయోగపడుతుంది. ఇదొక యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్.
జుట్టును తిరిగి మందంగా మార్చేందుకు చికిత్సలో భాగంగా కొన్ని పదార్థాలు ఉపయోగిస్తారు. వాటిలో కొన్ని ఇవి..
ఈ చికిత్స క్యూటికల్స్ సున్నితంగా చేయడానికి సహాయపడుతుంది. అయితే ఇది చేయడం వల్ల జుట్టు ఆకృతి మారకపోవచ్చు. జుట్టును మృదువుగా చేస్తుంది. కానీ ఇతర స్ట్రెయిటనింగ్ మాదిరిగా స్ట్రెయిట్ అవుతుందన్న గ్యారెంటీ లేదు. మీ హెయిర్ ఒక వేళ ఉంగరాల జుట్టు అయితే ఇది ఎటువంటి ప్రభావం చూపించకపోవచ్చు. ఇది జుట్టుకి మంచి కండిషనింగ్, హైడ్రేట్ గా ఉండేందుకు సహకరిస్తుంది.
ఎటువంటి జుట్టుకి ఉపయోగపడుతుంది
హెయిర్ బొటాక్స్ చేయించుకోవడం వల్ల జుట్టు చూసేందుకు చాలా చక్కగా నిగగనిగలాడుతూ కనిపిస్తుంది. గతంలో అయితే జుట్టు తక్కువగా ఉంటే ఒత్తుగా చూపించుకునేందుకు విగ్గులు పెట్టుకోవడం, సవరాలు వేసుకోవడం చూస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు జుట్టు లేని ప్రాంతంలో వెంట్రుకలు ఇంజెక్ట్ చేసి ఆ ఖాళీని భర్తీ చేస్తున్నారు. ఒక ప్యాచ్ లాంటిది స్కాల్ఫ్ కి వేసి దాని మీద ఆర్టిఫిషియల్ జుట్టు పెడుతున్నారు. చూసేందుకు అది నిజమైన జుట్టు మాదిరిగానే కనిపిస్తుంది. ప్రస్తుతం జుట్టు పెంచుకోవడానికి, ఒత్తుగా కనిపించేందుకు అనేక ట్రీట్మెంట్లు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిలో బొటాక్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. అమ్మాయిలు ఎక్కువగా హెయిర్ బొటాక్స్ ట్రీట్మెంట్ కి మొగ్గు చూపుతున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: కొత్త సంవత్సరంలో ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? ఈ తీర్మానాలు పాటించండి
Makeup Tips: ఈ మేకప్ టెక్నిక్స్ అసలు పాటించొద్దు, చర్మానికి హానికరం
జుట్టు రాలిపోతోందా? మీ ఆహారంలో ఈ మార్పులు చేసి చూడండి
Hair Conditioner: జుట్టుకి షాంపూ చేసిన ప్రతిసారీ కండిషనర్ పెట్టడం అవసరమా? ప్రయోజనం ఏంటి?
Winter Skin Care: చలికాలంలో మీ చర్మం పగిలిపోకుండా ఇలా కాపాడుకోండి
Peanuts: మచ్చలు పోయి చర్మం నిగనిగలాడాలంటే వేరుశెనగ తినండి
Demand For TDP Tickets : టీడీపీ టిక్కెట్ల కోసం ఫుల్ డిమాండ్ - యువనేతలు, సీనియర్ల మధ్య పోటీ !
Government Websites Hacked: ప్రభుత్వ వెబ్సైట్లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు,అలెర్ట్ అవుతున్న అధికారులు
Amigos Pre Release - NTR Jr : అన్నయ్య కోసం వస్తున్న ఎన్టీఆర్ - రేపే కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ప్రీ రిలీజ్
Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?