అన్వేషించండి

మొటిమల కారణంగా చెంపలపై పడిన గుంతలు పోతాయా? ఎలాంటి చికిత్సలు ఉన్నాయి?

యుక్త వయసుకులోకి రాగానే చాలామందికి చెంపలపై మొటిమలు వస్తాయి. వాటి వల్ల కొందరికి శాశ్వతమైన గుంతలు ఏర్పడతాయి

అందంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు. కానీ ఆ అందానికి మొటిమలు చెక్ పెడుతున్నాయి. యుక్త వయసు రాగానే కొందరికి మొటిమలు వచ్చి అవి గుంతలుగా మారుతున్నాయి. అలా గుంతలుగా మారడానికి కారణం వాటిని పదేపదే గిల్లడమే అని చెబుతున్నారు చర్మ వైద్యులు. అలా గిల్లిన ప్రదేశాల్లో అవి గుంతలుగా ఏర్పడతాయి. వీటిని తగ్గించుకోలేక, ఏం చేయాలో తెలియక చాలామంది సతమతమవుతుంటారు. ఇవి అందానికి అడ్డుగానే ఉంటాయి. ముఖాన్ని చూడగానే మొదట ఈ గుంతలే కనిపిస్తాయి. కాబట్టి వీటిని తొలగించుకునే పద్ధతుల కోసం చాలామంది యువత వైద్యులను సంప్రదిస్తున్నారు.

చికిత్సలు ఇవే...
వీటికి వైద్యపరమైన చికిత్సలు ఉన్నాయి. కాకపోతే కొంచెం ఖర్చుతో కూడుకున్నవి. అలాగే కాస్త సమయం కూడా తీసుకుంటాయి. అందంగా మారాలని, గుంతలు పోవాలని కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా వీటిని చేయించుకోవచ్చు. మొదటిది లేజర్ చికిత్స. ఈ లేజర్ చికిత్సలో భాగంగా గుంతలకు చుట్టుపక్కల ఉన్న చర్మాన్ని కొద్దిగా మార్పు చేస్తారు. అంటే ఆ ప్రదేశంలో గుంతలతో సమానంగా చుట్టుపక్కల ప్రదేశాన్ని కూడా చదునుగా చేస్తారు. అప్పుడు గుంతల లోతుతో పక్కనున్న చర్మం కూడా సమానంగా మారుతుంది. దీనివల్ల లోతు కనబడదు. కొన్ని లేజర్ చికిత్సల్లో గుంతల అడుగున ఉన్న కండరాల్లో కొలాజిన్ కుచించకపోయేలా చేస్తారు. దీంతో కోలాజిన్ పైకి లేచి గుంత లోతు లేకుండా ఉబ్బుతుంది. లేజర్ చికిత్సలు చేయడం వల్ల దాదాపు 30% గుంతలు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఇది శాశ్వతమైన చికిత్స అనే చెప్పాలి. మళ్లీ గుంతలు ఏర్పడే అవకాశం ఉండదు. అయితే ఈ లేజర్ చికిత్స ఒక్క సిట్టింగ్‌తో పూర్తవదు. కొందరికి ఏడని ఎనిమిది సార్లు వెళ్లాల్సి వస్తుంది. వారి చెంపలపై ఉన్న గుంతల లోతును బట్టి ఎన్నిసార్లు చికిత్స చేయించుకోవాలన్నది ఆధారపడి ఉంటుంది. ధర కొంచెం ఎక్కువగానే ఉంటుంది.

మరొక చికిత్స...
గుంతలను తగ్గించేందుకు మరో అధునాతన చికిత్స అందుబాటులో ఉంది. అది నానో ఫాట్ గ్రాఫ్టింగ్ చికిత్స. ఇందులో భాగంగా ఆ వ్యక్తుల శరీరంలోని కొవ్వుని తీసి, ద్రవంగా మార్చి గుంతల కిందకు సూదులతో ఇంజక్ట్ చేస్తారు. ఇది గుంతల అడుగున ఉన్న కొలాజన్‌ను కుచించకపోయేలా చేసి ఉబ్బేలా చేస్తుంది. ఈ చికిత్సను ఒక్కసారి చేస్తే సరిపోతుంది. దాదాపు గుంతలు మాయం అవుతాయి. అయితే పూర్తిగా మాయం అవుతాయని చెప్పలేం. 50% వరకు గుంతలు తగ్గిపోతాయి. అలాగే మరొక పద్ధతి కూడా అందుబాటులో ఉంది. అదే డెర్మబ్రేషన్ చికిత్స. ఇందులో ఒక పరికరంతో చర్మం పై పొరలను  చెక్కుతారు.ఇది దాదాపు లేజర్ చికిత్స లాగే ఉంటుంది అంటే చర్మం మొత్తాన్ని ఒక చదునుగా చేస్తారు. అప్పుడు గుంతలు కనబడవు. ఈ  చికిత్స చేసుకున్నాక కోలుకోవడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. ఇంటి దగ్గరే ఉండాలి. ఈ చికిత్సలు ఏమి తీసుకోవాలో మీ గుంతల సైజును బట్టి, లోతును బట్టి ఆధారపడి ఉంటుంది.  చర్మ వైద్యులను, కాస్మెటిక్ సర్జన్లను సంప్రదించాకే మీరు ఏ చికిత్స తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. 

Also read: పురుషుల కంటే స్త్రీలు ఎందుకు ఎక్కువ బరువు పెరుగుతారు? దానికి కారణం ఇదే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
NBK 109 Title Teaser: 'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
NBK 109 Title Teaser: 'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్
Thaman: నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు
Andhra Pradesh News: 29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన
AP Assembly: ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Embed widget