అన్వేషించండి

Makar Sankranti: మకర సంక్రాంతి లాంటి పండుగలు భారత సనాతన సంప్రదాయాల్ని ప్రతిబింబిస్తాయి: బాబా రాందేవ్

సంక్రాంతి వంటి పండుగలు సనాతన సంప్రదాయాలను, యోగా, స్వదేశీ విలువలను ప్రోత్సహిస్తాయని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ (Baba Ramdev ) చెప్పారు.

Makar Sankranti 2026: భారతీయ సంస్కృతి, యోగా, యజ్ఞాలు, స్వదేశీ ఉత్పత్తుల ప్రాధాన్యతను ఫేస్‌బుక్ లైవ్ సెషన్‌లో స్వామి రామ్‌దేవ్ ప్రస్తావించారు. మకర సంక్రాంతి వంటి పండుగలను సనాతన సంప్రదాయానికి పునాదిగా అభివర్ణించారు.

తన ఫేస్‌బుక్ లైవ్ ద్వారా పౌరులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, యోగా గురువు స్వామి రామ్‌దేవ్ భారత సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని హైలైట్ చేశారు. మకర సంక్రాంతి, పొంగల్, బిహు వంటి పేర్లతో సనాతన సంప్రదాయాలకు ఆధారంగా అభివర్ణించారు. ఈ సందర్భాలు కేవలం వేడుకలు మాత్రమే కాకుండా, ప్రకృతి పట్ల గౌరవం, క్రమశిక్షణ, జీవితంలో బ్యాలెన్సింగ్ చేసుకోవడం ప్రాముఖ్యతను కూడా నేర్పుతాయని రామ్‌దేవ్ అన్నారు.

సింథటిక్ ఉత్పత్తుల ప్రమాదాలపై హెచ్చరిక

ఆధునిక జీవనశైలిలో రసాయనాలు, సింథటిక్ ఉత్పత్తుల వాడకం పెరగడంపై రామ్‌దేవ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రసాయనాలపై ఆధారపడటం మానవ ఆరోగ్యానికి హాని కలిగించడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కూడా దెబ్బతీస్తుందని బాబా రాందేవ్ అన్నారు. యోగా గురువు ఈ రసాయనాలను జీవనశైలి రుగ్మతలకు కారణమని పేర్కొన్నారు. ప్రజలు సేంద్రియ, సహజ ఉత్పత్తులను స్వీకరించాలని ప్రజలకు ఆయన సూచించారు. 

యోగా, యజ్ఞం, విద్య ప్రాముఖ్యత

యోగా, 'యజ్ఞం'లను భారతీయ సంస్కృతికి పునాదిగా బాబా రాందేవ్ అభివర్ణించారు. రాందేవ్ ప్రకారం, ఈ పద్ధతులు కేవలం శారీరక వ్యాయామం లేదా మతపరమైన ఆచారాలు మాత్రమే కాదు, వాటి వల్ల మానసిక ప్రశాంతత, సామాజిక సామరస్యం, సమగ్ర ఆరోగ్యానికి మార్గం లాంటివి అన్నారు. రాందేవ్ భారతీయ శిక్షా బోర్డ్ గురించి కూడా ప్రస్తావిస్తూ, ఆధునిక విద్యను భారత విలువలతో అనుసంధానం చేయడానికి  ఇది స్థాపించినట్లు తెలిపారు. తద్వారా భవిష్యత్ తరాలు తమ మూలాలతో అనుసంధానమై ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

స్వదేశీ, మేక్ ఇన్ ఇండియాపై దృష్టి

దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి రామ్‌దేవ్ 'మేక్ ఇన్ ఇండియా'కు మద్దతు తెలిపారు. విదేశీ వస్తువులకు బదులుగా స్వదేశీ ఉత్పత్తులను ఎంచుకోవాలని దేశ ప్రజలకు రాందేవ్ విజ్ఞప్తి చేశారు. భారతదేశంలో తయారు చేసిన ఉత్పత్తులను ఉపయోగించినప్పుడు, మనం మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, స్వదేశీ జ్ఞానాన్ని గౌరవిస్తామని, ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.

పతంజలి ఉత్పత్తులను ఉదాహరణగా పేర్కొంటూ, సహజ జీవనశైలిని అవలంబించడం ద్వారా మాత్రమే ఆరోగ్యకరమైన, నాణ్యమైన జీవితాన్ని గడపవచ్చని అన్నారు. ఈ మారుతున్న మోడ్రన్ రోజుల్లో సైతం పండుగ సందర్భాలలో భారత సంప్రదాయాలు తెలుసుకోవాలని, పాత రోజులకు తిరిగి రావాలని ప్రజలను కోరారు. మరిన్ని వివరాల కోసం, కింద ఇచ్చిన పూర్తి లైవ్ వీడియోను చూడండి:

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day 7 : అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
Dussehra Navratri Day6 : అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
White Chicken : నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
Beer vs Breezer : బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget