Gold Cube: 87 కోట్లు విలువ చేసే గోల్డ్ క్యూబ్‌ను పార్క్‌లో వదిలేశారు, ఎవరైనా ఎత్తేస్తే?
రూ.87 కోట్లు విలువ చేసే 186 కిలోల బంగారాన్ని పార్క్ మధ్యలో వదిలేశారు. ఇప్పుడు అది సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
లాకర్‌లో పెట్టిన బంగారానికే ఈ రోజుల్లో రక్షణ లేదు. అలాంటిది ఆరు బయట.. నలుగురూ తిరిగే పార్కులో వదిలేస్తే? రాత్రికి రాత్రే అది మాయమైపోతుంది కదూ. ఈ విషయం తెలిసి కూడా న్యూయార్క్‌లోని సెంట్రల్ పార్కులో ఓ భారీ గోల్డ్ క్యూబ్‌ను వదిలేశారు. అయితే, అది రోల్డ్ గోల్డ్ కావచ్చని మాత్రం అనుకోవద్దు. అది నిజమైన బంగారమే. రూ.87 కోట్లు విలువ చేసే ప్యూర్ గోల్డ్. అందులోని చిన్న ముక్కను తుంచుకుపోయినా చాలు.. జీవితంలో సెటిలైపోయవచ్చు.
జర్మనీకి చెందిన ఓ కళాకారుడు ఈ గోల్డ్ క్యూబ్‌ను తయారు చేశాడట. ఇందుకు 186 కిలోల 24 క్యారెట్ల బంగారన్ని ఉపయోగించాడట. అయితే, ఈ క్యూబ్‌కు ప్రత్యేకంగా ఏ పేరు పెట్టలేదు. సింపుల్‌గా ‘గోల్డ్ క్యూబ్’ లేదా ‘క్యాస్టెల్లో క్యూబ్’ అని పిలుస్తున్నారంతే. కానీ, దాన్ని అలాగే వదిలేస్తే ఎవరైనా ఎత్తుకుపోతారు కదా అనేగా మీ సందేహం? ఇందుకు మీరు అస్సలు చింతించవద్దు. అంత పెద్ద గోల్డ్ క్యూబ్ పార్క్ మధ్యలో వదిలేశారని తెలిస్తే.. ట్రక్కుల్లో వచ్చి మరీ దాన్ని ఎత్తుకుపోవడానికి ప్రయత్నిస్తారు. అందుకే.. ఆ క్యూబ్ ఏర్పాటుకు ముందే అక్కడ భారీగా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు.
అయితే, క్యూబే కదా.. దీని తయారీ చాలా సులభం అనుకుంటే పొరపాటే. ఎందుకుంటే.. క్యూబ్ అంత కచ్చితంగా ఏర్పడాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. బంగారాన్ని సుమారు 1000 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతలో కరిగించి.. ఓ బాక్సులో వేయాలి. ఆ తర్వాత బుడగలు ఏర్పడకుండా మిశ్రమాన్ని జాగ్రత్తగా చల్లబరచాలి. అయితే, దీన్ని కేవలం ప్రదర్శనకు మాత్రమే ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు.
View this post on Instagram