అన్వేషించండి

Black Plastic: బ్లాక్ ప్లాస్టిక్ బాక్స్‌లో రెస్టారెంట్లలో ఆహారాన్ని అందిస్తున్నారా? ఆ నల్ల ప్లాస్టిక్ ఎంతో హానికరం

ప్లాస్టిక్ అనేక రకాలుగా రంగులు మార్చుకుంటుంది

తెల్ల ప్లాస్టిక్ కవర్లు, నల్ల ప్లాస్టిక్ కవర్లు దొరుకుతూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో రెస్టారెంట్ వాళ్ళు ఆహారాన్ని పార్సెల్ చేసే ప్లాస్టిక్ బాక్సులు కూడా నలుపు రంగు పులుముకున్నాయి. ఇలా బ్లాక్ ప్లాస్టిక్ లో ఆహారాన్ని అందిస్తున్న రెస్టారెంట్ల సంఖ్య పెరిగిపోతోంది. ఈ బ్లాక్ ప్లాస్టిక్ పర్యావరణానికి చాలా హానికరమైనది. పర్యావరణం హానికరంగా మారితే మన ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడినట్టే. బ్లాక్ ప్లాస్టిక్‌ను నిరోధించాల్సిన అవసరం ఉంది.

బ్లాక్ ప్లాస్టిక్ అధికంగా ఫుడ్ ప్యాకేజింగ్, డిస్పోజబుల్ కట్లరీలలో కనిపిస్తుంది. ఈ బ్లాక్ ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేయడం చాలా కష్టం. దీని తయారీలో ప్లాస్టిక్ రెసిన్‌కు... కార్బన్ బ్లాక్ పిగ్మెంట్లను జోడిస్తారు. ఈ వర్ణ ద్రవ్యం ప్లాస్టిక్‌ను నలుపుగా మారుస్తుంది. రీసైక్లింగ్ ప్లాంట్లలో ఈ బ్లాక్ ప్లాస్టిక్ బాక్సులను వేసినప్పుడు... బ్లాక్ ప్లాస్టిక్, అందులోని ఇతర పదార్థాల మధ్య తేడాను ఆ ప్లాంట్లలోని సిస్టమ్ గుర్తించలేదు. దీనివల్ల ఈ నల్లటి ప్లాస్టిక్ అధికంగా దహన యంత్రాలలోకి వెళ్లిపోతుంది. ఆ ప్లాస్టిక్‌ను అక్కడ దహనం చేయడం వల్ల విపరీతమైన పొగ వస్తుంది. ఇది పర్యావరణంలో కలిసి కాలుష్యానికి దోహదం చేస్తుంది. అది మన ఆరోగ్యానికి కూడా ఎంతో హానికరం. ఆ గాలిలో చేరిన ప్లాస్టిక్ కణాలు గాలి ద్వారా మన ఊపిరితిత్తుల్లోకి చేరుకొని, చాలా సమస్యలను సృష్టిస్తాయి.

బ్లాక్ ప్లాస్టిక్ కంటైనర్లలో తయారీలో థాలేట్స్, బీపీఏ వంటి కొన్ని రసాయనాలు ఉంటాయి. వీటిని అధిక ఉష్ణోగ్రతలకు గురిచేసినప్పుడు అవి ఆహారంలో కలిసే అవకాశం ఉంది. ఆహారంతో కలిపి వాటిని తింటే అవి మన శరీరంలో చేరి క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు స్వాగతం పలుకుతాయి. కాబట్టి ప్లాస్టిక్ కంటైనర్లను ఓవెన్‌లో వేడి చేయడం వంటివి చేయకూడదు. ఎక్కువగా వేడిచేస్తే చాలా ప్రమాదం. కంటికి కనిపించకుండా సూక్ష్మంగా ప్లాస్టిక్ కణాలు ఆహారంలో చేరి చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు కారణం అవుతాయి.

ఈ బ్లాక్ ప్లాస్టిక్ కంటైనర్లు సింగిల్ యూజ్ డబ్బాలుగా వాడతారు. ముఖ్యంగా ప్రయాణంలో వీటిని అధికంగా వినియోగిస్తారు. వీటి వినియోగంతో ముడిపడి ఉన్న ఆరోగ్య ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన లేదు. వీలైనంతవరకు బ్లాక్ ప్లాస్టిక్ కంటైనర్లలో ఉన్న ఆహారాన్ని తినక పోవడమే మంచిది. ఇది పర్యావరణాన్ని కాపాడినట్టు అవుతుంది.  అలాగే మీ ఆరోగ్యాన్ని రక్షించుకున్నవారవుతారు.  నిజానికి ప్లాస్టిక్ ఉత్పత్తులు ఏవీ ఆరోగ్యానికి, పర్యావరణానికి మంచివి కావు.

Also read: మైదా పిండిని తెల్లటి విషం అని ఎందుకు పిలుస్తారో తెలుసా? దీన్ని తినకపోతేనే ఆరోగ్యం

Also read: డ్రై షాంపూలు వాడుతున్నారా? వాటిలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయట, బీ కేర్ ఫుల్

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

టాప్ హెడ్ లైన్స్

India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Priyanka Jain : ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Police Complaint OTT : నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget