Health Warnings : పొరపాటున ఆ టాబ్లెట్స్‌ను వయాగ్రాతో కలిపి తీసుకుంటే కన్ఫార్మ్ చావేనట
Heart Disease : మీరు వయాగ్రాను ఉపయోగిస్తున్నారా అయితే తాజా అధ్యయనం దీని గురించి కొన్ని విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. కాబట్టి దీని గురించి అందరూ అవగాహన కలిగి ఉండాలంటున్నారు నిపుణులు.
Killer Combo : శారీరక అవసరాల కోసం చాలామంది వయాగ్రాను ఉపయోగిస్తారు. వయసుతో సంబంధం లేకుండా దీనిని వినియోగిస్తారు. అయితే వయోగ్రాను ఉపయోగించేవారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మధ్య వయస్కుల గురించే. వివిధ కారణాల వల్ల వారిలోని శారీరక సామర్థ్యం తగ్గుతూ ఉంటుంది. దాని ఎఫెక్ట్ పర్సనల్ జీవితంపై పడకూడదని.. లేదా ఇతరులతో ఫిజికల్‌గా ఎంజాయ్ చేసేందుకు వయాగ్రాను తీసుకుంటూ ఉంటారు.
కిల్లర్ కాంబినేషన్
ఇదిలా ఉండగా తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం వయాగ్రా గురించి కొన్ని విస్తుపోయే వాస్తవాలను తెలిపింది. వాటి గురించి తెలిస్తే మీరు వయాగ్రా వినియోగాన్ని ఆపేసిన పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కొన్ని టాబ్లెట్స్‌ను వయాగ్రాతో కలిపి తీసుకుంటే మీకు గుండె పోటు లేదా అకారణం సంభవించవచ్చని ఓ అధ్యయనం హెచ్చరించింది. వయాగ్రా తీసుకున్నప్పుడు కొన్ని మందులు తీసుకుంటే అది కిల్లర్ కాంబో మిక్సింగ్ అయి మీ ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుందని అధ్యయనంలో పేర్కొన్నారు.
మధ్య వయస్కుల్లో ఎక్కువ
గుండె సమస్యలతో ఇబ్బంది పడేవారు, ఛాతీ నొప్పి మందులు ముఖ్యంగా నైట్రేట్ కలిగిన మందులు వినియోగించేవారు వయాగ్రాకు వీలైనంత దూరంగా ఉండాలి అంటున్నారు. యూకేలో మధ్య వయస్కులు, వృద్ధులు ఈ కాంబినేషన్‌ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారని తెలిపింది. ఇవి వారి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయని.. ఈ కాంబినేషన్ తీసుకునే వారు త్వరగా మరణించే ప్రమాదముందని పరిశోధనలో తేలింది. యూకేలో దాదాపు రెండు మిలియన్ల మంది గుండె సమస్యను కలిగి ఉన్నారని.. ధమనులు మూసుకుపోయి.. గుండెకు రక్తప్రసరణ తగ్గడం వల్ల ఈ సమస్యలను వస్తున్నాయని తెలిపారు. ఈ సమస్య తగ్గించడం కోసం పలు రకాల నైట్రేట్ మందులను వైద్యులు సూచిస్తున్నారు.
నిపుణులు ఏమంటున్నారంటే..
నిజం చెప్పాలంటే గుండె ఆరోగ్యానికి సంబంధించిన మాత్రలు, వయాగ్ర కూడా రక్తపోటును తగ్గిస్తాయని.. కానీ ఆ రెండింటినీ కలిపి వాడినప్పుడు అవి ప్రమాదకరంగా మారుతాయని స్వీడన్‌లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ నిపుణులు తెలిపారు. గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్న చాలామంది ఈ విషయం తెలియక వయాగ్రాను వాడి తమ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారని వెల్లడించారు. కార్డియాక్ అరెస్ట్ వంటి తక్షణమే చనిపోయే ప్రమాదం ఉండకపోవచ్చు కానీ.. దీర్ఘకాలికంగా ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు పేర్కొన్నారు.
అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ ఈ విషయంలో అధ్యయనం జరిపింది. వయాగ్ర మాత్రలతో గుండె ఆరోగ్యానికి సంబంధించిన నైట్రేట్లను ఉపయోగించిన పురుషుల్లో అకాల మరణానికి 39 శాతం అవకాశం ఉందని కనుగొన్నారు. ఈ నేపథ్యంలోనే అంగస్తంభన లోపం ఉంటే వైద్యుని సంప్రదించి మాత్రమే మందులు తీసుకోవాలని.. లేకుంటే ఏ మందు తీసుకోవద్దని బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ హెచ్చరించింది.
Also Read : హెన్నాలో ఇవి కలిపి తలకు అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో
సోంపు తీసుకుంటున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. కాబట్టి వైద్యుని సలహా కచ్చితంగా తీసుకోవాలి. మూర్ఛ సమస్య ఉన్నవారు దీనికి దూరంగా ఉండడమే మంచిది. గర్భనిరోధక మాత్రలు తీసుకునేవారు కూడా సోంపు తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే సోంపులోని ఈస్ట్రోజెనిక్ లక్షణాలు గర్భనిరోధక మాత్రల ప్రభావాన్ని తగ్గిస్తాయి.