Ice Cream Benefits : ఐస్ క్రీమ్‌లు ఆరోగ్యానికి మంచివేనట.. బరువు తగ్గడంలో కూడా హెల్ప్ చేస్తాయంటున్న శాస్త్రవేత్తలు
Ice Cream is Healthy Food : ఐస్ క్రీమ్ అంటే ఇష్టమున్నా.. అది ఆరోగ్యానికి మంచిది కాదని కొందరు తినకుండా ఆగిపోతారు. అయితే తాజా అధ్యయనం ఐస్ క్రీమ్ అంత డేంజరేమి కాదని చల్లని కబురు చెప్తోంది.
New Study on Ice Cream : చిన్నపిల్లల నుంచి.. పెద్దలవరకు ఇష్టంగా తినే వాటిలో ఐస్‌క్రీమ్ కచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా సమ్మర్లో ఐస్‌క్రీమ్‌లకు చాలా డిమాండ్ ఉంటుంది. వేడి నుంచి ఉపశమనం ఇస్తూ.. మనుసును రిఫ్రెష్ చేస్తుంది. అయితే ఈ టేస్టీ ఫుడ్ హెల్త్‌కి మంచిది కాదని చాలా మంది దానికి దూరంగా ఉంటారు. ఇది పూర్తిగా చక్కెర, సంతృప్త కొవ్వు పదార్థాలు కలిగి ఉంటుందని మానేస్తారు. కానీ ఐస్ క్రీమ్ మనం అనుకున్నంత చెడు అయితే కాదని తాజా అధ్యయనం తెలిపింది.
రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది..
సమతుల్యం ఆహారం జాబితాలో రోజూ ఓ స్కూప్ తీసుకోవడం వ్లల ప్రతికూల ప్రభావం ఉండదని తెలిపింది. అంతేకాకుండా దీనివల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఈ స్టడీ తేల్చింది. ఐస్‌క్రీమ్ కాల్షియం, మెగ్నీషియం, బి12 విటమిన్లు, రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేసే ప్రోటీన్‌ను కలిగి ఉంటుందని తెలిపింది. పాలు, క్రీమ్ అనేవి ఐస్‌క్రీమ్‌లో ప్రధానంగా వినియోగిస్తారు. విటమిన్ ఎ, కోలిన్‌ను కలిగి ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంతో పాటు.. రోగనిరోధక శక్తి, మెదడు అభివృద్ధికి తోడ్పడుతున్నాయి వెల్లడించింది.
బరువు తగ్గే అవకాశం..
ఐస్‌క్రీమ్‌లు న్యూట్రీషియన్ రిచ్ ఫుడ్‌గా చెప్తున్నారు. దీనిలో న్యూట్రిషియన్లు, కాల్షియం, ప్రోటీన్, విటమిన్స్ ఉంటాయని ఇవి పూర్తి ఆరోగ్యానికి మంచివని చెప్తున్నారు. మానసికంగా దీనివల్ల ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు. ఇది ఒత్తిడిని తగ్గించి మూడ్‌ని లిఫ్ట్ చేస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని చెప్తున్నారు. సమ్మర్లో ఇవి శరీరానికి హైడ్రేషన్‌ని అందిస్తాయట. ఐస్‌క్రీమ్ క్రేవింగ్స్‌ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇతర ఫుడ్స్ జోలికి వెళ్లరు. దీనివల్ల బరువు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. బోన్స్‌ను హెల్తీగా మార్చడంలో కాల్షియం పనిచేస్తుంది. స్కిన్ హైడ్రేషన్, జీర్ణక్రియలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది.
డెయిరీ ఉత్పత్తులతో ప్రాబ్లమ్ లేదు
తాజా పరిశోధనలో పాలు డెయిరీ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచవని తెలిపింది. అయినప్పటికీ.. పాలు, చీజ్, పెరుగు, ఐస్‌క్రీమ్ వంటి ఆరోగ్యకరమన ఎంపికల మధ్య తేడాను గుర్తించాలని చెప్తున్నారు. నాన్ డెయిరీ ఉత్పత్తులు ఆరోగ్యకరమైనవి కాదు. ఈ ఉత్పత్తుల్లో చక్కెర ఎక్కువగా ఉంటుందని తెలిపారు. పెద్ద మొత్తంలో చక్కెర, ఫ్యాట్, కృత్రిమ స్వీటెనర్లు, గట్టిపడే పదార్థాలు వాటిలో వినియోగిస్తారని తెలిపారు.
పరిమిత మోతాదులో తీసుకోవాలట
ఎండ్ ఆఫ్ ద డే ఐస్‌క్రీమ్‌లు ఆరోగ్యానికి ఎంత మంచివే అయినా.. వాటిని కంట్రోల్‌గా తీసుకోవడం మంచిది అంటున్నారు. డైటీషియన్లు రోజుకు గరిష్ఠంగా అరకప్పు తీసుకోవచ్చని చెప్తున్నారు. ఐస్ క్రీమ్‌ను మితంగా తీసుకుంటే.. ఆహారంలో భాగం చేసుకోవచ్చని.. కానీ తీసుకునే క్వాంటింటీపై కచ్చితంగా శ్రద్ధ చూపించాలంటున్నారు.
Also Read : హాట్ సమ్మర్లో మట్టి కుండలోని నీరు తాగుతున్నారా? అయితే మీరు వీటి గురించి తెలుసుకోవాల్సిందే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మానసిక, శారీరక ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.