అన్వేషించండి

Vaccine: ‘వ్యాక్సిన్ వేసుకోకపోవడం నా తప్పే’... కరోనాతో మరణించడానికి కొన్ని క్షణాల ముందు ఓ తండ్రి పశ్చాత్తాపం

కరోనా కొందరిలో ఇలా వచ్చి అలా వెళ్లిపోతోంది... కానీ కొందరిని మరణపు అంచులకు తీసుకెళుతోంది.

మానవాళిపై కమ్ముకున్న మహమ్మారి కరోనా. వ్యాక్సిన్ రాకముందు వేల మంది ప్రాణాలను బలిగొంది. చీకట్లో చిరుదివ్వెలా వచ్చాయి వ్యాక్సిన్లు. అవి కరోనా రాకుండా అడ్డుకోలేకపోవచ్చు, కానీ మరణాల సంఖ్యను మాత్రం తగ్గించాయన్నది వాస్తవం. అయినా కూడా ఇప్పటికీ చాలా మంది లేనిపోని అపోహలతో, నిర్లక్ష్యంతో వ్యాక్సిన్ వేయించుకోకుండా కాలయాపన చేస్తున్నారు. వైద్యులు, ప్రభుత్వాలు ఎంతగా మొరపెట్టుకుంటున్నా... ఇప్పటికీ వ్యాక్సిన్ వేయించుకోని వారు కోట్లలో ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు క్రిస్టియన్ కాబెరా. ఆయన వ్యాక్సిన్ వేయించుకోనందుకు చాలా పశ్చాత్తాపడ్డాడు. కానీ ఆ పశ్చాత్తాపం ఆయనకు కలిగే సరికే సమయం మించిపోయింది. కరోనా అతని ప్రాణాలను తీసేసింది. ఈ ఘటన లాస్‌ఏంజలస్ లో జరిగింది. 

సైన్సుపై నమ్మకం లేక...
క్రిస్టియన్ కాబెరాకు 40 ఏళ్లు. వారింట్లో అందరూ వ్యాక్సిన్ వేయించుకున్నా తాను మాత్రం వేయించుకోవడానికి ఇష్టపడలేదు. అతనికి భార్య, మూడేళ్ల కొడుకు కూడా ఉన్నారు. ఇతనికి సైన్సు పట్ల నమ్మకం తక్కువ. అందుకే వ్యాక్సిన్‌ను నిర్లక్ష్యం చేసినట్టు అతని తమ్ముడు గినో మీడియాకు చెప్పాడు. ‘క్రిస్టియన్ ఒక్కసారి కూడా అనారోగ్యం బారిన పడలేదు. అందుకే అతను చాలా ధీమాగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి కరోనా బారిన పడడంతో ఆసుపత్రిలో చేర్చాం’ అని చెప్పుకొచ్చాడాయన. కాగా చనిపోవడానికి కొన్ని నిమిషాల ముందు క్రిస్టియన్ తన కుటుంబ సభ్యులు మెసేజ్ పంపాడు. ముందుగా ‘నేను ఊపిరిపీల్చుకోలేకపోతున్నా’ అని పెట్టాడు.  తరువాత ‘నేను చాలా పశ్చాత్తాపపడుతున్నా... వ్యాక్సిన్ తీసుకోనందుకు. ఒకవేళ నేను వ్యాక్సిన్ వేయించుకుని ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. నా ప్రాణం నిలిచేది’ అని మెసేజ్ చేశాడు.  

అలా మెసేజ్ చేసిన కొంత సమయం తరువాత క్రిస్టియన్ మరణించినట్టు కబురు పంపారు వైద్యులు. అతను కరోనా బారిన పడ్డాక వారం రోజులపాటూ ఆసుపత్రిలోనే చికిత్స పొందాడు. ఊపిరితిత్తులకు తీవ్రస్థాయిలో నిమోనియా సోకడంతో పరిస్థితి చేయిదాటి పోయింది. ఊపిరితిత్తులు పూర్తిగా పాడవడంతో క్రిస్టియన్ మరణించాడు. అమెరికాలో దాదాపు వ్యాక్సినేషన్ పూర్తయింది. కానీ క్రిస్టియన్ లాంటి వాళ్లు అతి నమ్మకంతో వ్యాక్సిన్ వేయించుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. 

కరోనాలాంటి మహమ్మారి ఎదుర్కోవాలంటే మన శరీరంలో ఉన్న రోగనిరోధక శక్తి సరిపోదు. దానికి మరింత బలాన్ని అందివ్వాలి. యాంటీ బాడీలు అవసరం పడతాయి. వ్యాక్సిన్లు కరోనాతో పోరాడే శక్తిని మన శరీరానికి అందిస్తాయి. కాబట్టి వ్యాక్సిన్లు వేయించుకోకుండా తాత్సారం చేస్తున్నవాళ్లంతా ఆ ప్రక్రియను త్వరగా పూర్తి చేసుకోవడం అన్ని విధాలా మంచిది. మీ కుటుంబం కోసమైనా మీరు వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Butter Chicken Roast Recipe : టేస్టీ, జ్యూసీ బటర్ చికెన్ రోస్ట్.. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ ఇదే
టేస్టీ, జ్యూసీ బటర్ చికెన్ రోస్ట్.. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ ఇదే
Female Fertility : నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Scrolling Social Media for Hours : గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారా? ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా?
గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారా? ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా?
Foods for Bone Health : ఎముకలను డ్యామేజ్ చేసే ఫుడ్స్ ఇవే.. బోన్స్ హెల్తీగా ఉండాలంటే ఇవి తినేయండి
ఎముకలను డ్యామేజ్ చేసే ఫుడ్స్ ఇవే.. బోన్స్ హెల్తీగా ఉండాలంటే ఇవి తినేయండి

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Impact Indian Politics: భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
Heatwave In AP and Telangana: తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
Abhishek Banerjee Attack: బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీని హైదరాబాద్‌కు తరలిస్తాం: మమతా బెనర్జీ
బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీ హైదరాబాద్‌కు తరలింపు: మమతా బెనర్జీ
Female Fertility : నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Drinker Sai OTT: ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
IPL Best Ever Opening Pair: టోర్నీ హిస్టరీలోనే గిల్, సాయి సుదర్శన్ బెస్ట్ ఓపెనింగ్ జోడీ..  ఫైనల్స్ లో వాళ్ల‌కే ఛాన్స్ ఎక్కువ.. మాజీ క్రికెట‌ర్ అనాల‌సిస్
టోర్నీ హిస్టరీలోనే గిల్, సాయి సుదర్శన్ బెస్ట్ ఓపెనింగ్ జోడీ..  ఫైనల్స్ లో వాళ్ల‌కే ఛాన్స్ ఎక్కువ..
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
CM Vijay Condoles Ajith: అజిత్ ఇంటికి సీఎం విజయ్... వెంట త్రిష కూడా... ఆప్త మిత్రుడికి పరామర్శ
అజిత్ ఇంటికి సీఎం విజయ్... వెంట త్రిష కూడా... ఆప్త మిత్రుడికి పరామర్శ
Embed widget