అన్వేషించండి

Constipation: ప్రాణం తీసిన మలబద్ధకం, ఇలా చేస్తే అంత డేంజరా?

మలబద్ధకం సమస్యని అంత తేలికగా తీసుకోకూడదు అనేందుకు ఈ ఘటనే సాక్ష్యం.

మలబద్ధకం సమస్య బయటకి చెప్పుకోలేనిది.. అలాగని దాచుకోలేనిది. పొట్టలో తీవ్రమైన అసౌకర్యం కలిగిస్తూ నరకం చూపిస్తుంది. అందుకే పేగు కదలికలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తూ ఉంటారు. అది ఎంత తీవ్రమైనది అంటే ఒక వ్యక్తి ప్రాణాలు కూడా బలి తీసుకుంది. అవును మీరు విన్నది నిజమే మలబద్ధకం సమస్య వల్ల 65 ఏళ్ల వ్యక్తి గుండెపోటు బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు.

65 ఏళ్ల వ్యక్తి వారం పాటు తీవ్రమైన మలబద్ధకం సమస్యతో బాధపడి ప్రాణాలు కోల్పోయాడు. అతడిని కాపాడేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఛాతీ నొప్పి, వికారం, టాయిలెట్ రాకపోవడం వల్ల సదరు వ్యక్తి ఒక రోజు హాస్పిటల్ కి వెళ్ళాడు. సుమారు పది రోజుల నుంచి టాయిలెట్ కి వెళ్లలేదని తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టు డాక్టర్ కి చెప్పాడు. అతడిని కొలంబియాకి చెందిన ఫేమస్ డాక్టర్ రౌడీ రియల్స్ రోయిస్ పరిశీలించారు.

అతడి పరిస్థితి తెలుసుకున్న రోయిస్ ఎలక్ట్రో కార్డియోగ్రామ్ చేశారు. కానీ రోగి హృదయ స్పందన రేటు పెరుగుతూ విపరీతమైన చెమటతో కనిపించాడు. అతనికి గతంలో గుండె సంబంధిత సమస్యల చరిత్ర ఉన్నాయి. దీంతో అతనికి రెక్టల్ ఎనిమా ఇవ్వడం మంచిది కాదని రోయిస్ భావించాడు. దానికి బదులుగా మందులు తీసుకుని మలబద్ధకం సమస్యని తగ్గించేందుకు రోయిస్ చూశాడు. ఎందుకంటే అరుదైన సందర్భాల్లో ఎనిమా చేయడం వల్ల అది మూత్రపిండాలు, గుండెపై ప్రాణాంతకమైన దుష్ప్రభావాలు ప్రేరేపిస్తుంది. కానీ మందులు వేసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు.

మందుల మోతాదుని పెంచారు. బెడ్ కి పరిమితం కాకుండా నడుస్తూ ఉండమని చెప్పాడు. కానీ రోగి మాత్రం డాక్టర్ లేని సమయంలో ఎనిమా చేయించుకోవాలని చాలా పట్టుబట్టాడు. మరొక డాక్టర్ ఆ ప్రక్రియ పూర్తి చేశాడు. దీంతో అతడు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఎనిమా చికిత్స ద్వారా రోగి మలం బయటకి పంపడం వల్ల అతడి గుండె ఆగిపోయింది. ఆ ప్రక్రియ వాగస్ నాడిని మీద తీవ్ర ఒత్తిడి కలిగించింది. దీంతో రక్తపోటు అకస్మాత్తుగా పడిపోయింది. 30 నిమిషాల పాటు అతడిని బతికించేందుకు డాక్టర్ రోయిస్ ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయింది.

మలబద్ధకం వల్ల తీవ్ర ఒత్తిడికి గురికావడం వల్ల పురీషనాళం ప్రొలాప్స్ వంటి సమస్యలకు దారి తీస్తుంది. ఇది పేగు అడ్డంకికి దారి తీస్తుంది. ఈ పరిస్థితి ప్రాణాంతకమైంది. అటువంటి పరిస్థితిలో హృదయ సంబంధ వ్యాధులు, స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఒక్కసారిగా పేగులను ఖాళీ చేయడం వల్ల వాగస్ నాడి దెబ్బతిని ఈ పరిస్థితి తలెత్తుతుంది. రక్తపోటు అకస్మాత్తుగా పడిపోవడం వల్ల గుండె, మెదడు, ఇతర అవయవాలకు తగినంత రక్త ప్రసరణ జరగదు. దీని వల్ల రోగులు గుండె పోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని ఎదుర్కొంటారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: రోజూ నెయ్యి తీసుకుంటే చర్మంలో ఎటువంటి మార్పు వస్తుందో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Infantile Epilepsy : శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
Dondakaya Pachadi : దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
దొండకాయతో కూర, ఫ్రై కాదు పచ్చడి చేసుకోండి.. ట్రెడిషనల్ స్టైల్ రెసిపీ ఇదే
Amla Benefits : రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
Water Weight : వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే
వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget