అన్వేషించండి

UPSC CDS Final Results: యూపీఎస్సీ సీడీఎస్ఈ (1) - 2023 తుది ఫలితాలు వెల్లడి, 347 మంది ఎంపిక

UPSC CDSE 1 Result: యూపీఎస్సీ సీడీఎస్(1)-2023 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జనవరి 24న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది.

UPSC Combined Defence Services Examination (I), 2023 (OTA) Final Result: యూపీఎస్సీ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CDSE 1)-2023 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జనవరి 24న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. త్రివిధ దళాల పరిధిలోని విభాగాల వారీగా ఫలితాలను విడుదల చేసింది. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు.

ఫలితాలకు సంబంధించి మొత్తం 347 మంది అభ్యర్థులు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి (OTA) ఎంపికయ్యారు. వీరిలో 242 మంది పురుష అభ్యర్థులు, 43 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను 15 రోజుల్లో యూపీఎస్సీ వెల్లడించనుంది. దీనిద్వారా 119వ షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్సు (మెన్)లో 170 ఖాళీలను, 33వ షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్సు (ఉమెన్)లో 17 ఖాళీలను భర్తీచేస్తారు. 

యూపీఎస్సీ సీడీఎస్(1) - 2023 (OTA) తుది ఫలితాలు ఇలా చూసుకోండి..

➥ ఫలితాల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.- https://www.upsc.gov.in/

➥ అక్కడ్ హోంపేజీలో కనిపించే 'Final Result: Combined Defence Services Examination (I), 2023 (OTA)' లింక్ పై క్లిక్ చేయాలి.

➥ ఫలితాలకు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతోంది. 

➥ అక్కడ పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందుటులో ఉన్న ఫలితాలు కనిపిస్తాయి.

➥ 'Ctrl + F' క్లిక్ చేసి హాల్‌టికెట్ లేదా రూల్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చేసుకోవచ్చు. నెంబర్ వస్తే అర్హత సాధించినట్లు లేకపోతే అర్హత లేనట్టే. 

➥ ఆ పీడీఎఫ్ ఫైల్‌లో అభ్యర్థులు తుది ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

➥ ఫలితాలతో కూడిన పీడీఎఫ్‌ను అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకుని, భవిష్యత్ అవసరాల కోసం భద్ర పర్చుకోవాలి.

యూపీఎస్సీ సీడీఎస్(1) - 2023 (OAT) తుది ఫలితాల కోసం క్లిక్ చేయండి..

వివరాలు..

➥ ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడ‌మీ (మెన్), చెన్నై: 170

➥ ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడ‌మీ (ఉమెన్), చెన్నై: 17

కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (I)-2023 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) అక్టోబరు 27న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు త్రివిధ దళాల పరిధిలోని విభాగాల వారీగా ఫలితాలను విడుదల చేయగా. తాజాగా ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి ఎంపికైన అభ్యర్థుల తుది ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది.  త్వరలోనే అభ్యర్థుల మార్కులను వెల్లడించనున్నారు.

ఇండియన్‌ మిలటరీ అకాడమీ, ఇండియన్‌ నేవల్‌ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో నియామకానికి సంబంధించి మొత్తం 235 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. వీరిలో ఇండియన్ మిలిటరీ అకాడమీకి 156 మంది, ఇండియన్ నేవల్ అకాడమీకి 57 మంది, ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి 22 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఇక తాజాగా విడుదల చేసిన ఫలితాలకు సంబంధించి ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీకి 347 మంది ఎంపికయ్యారు.

కంబైన్డ్‌ డిఫెన్స్ స‌ర్వీసెస్ (సీడీఎస్) ఎగ్జామినేష‌న్(I)-2023 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) డిసెంబరు 21న విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్‌‌ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీల్లోని ఖాళీలను భర్తీచేయనున్నారు. డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న అభ్యర్థుల నుంచి డిసెంబరు 21 నుంచి 2023, జనవరి 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులు ఏప్రిల్ 10న రాతపరీక్ష నిర్వహించగా.. ఫలితాలను మే 4న విడుదల చేశారు. రాతపరీక్షలో మిలిటరీ అకాడమీకి 2696 మంది, నేవల్ అకాడమీకి 843 మంది, ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి  629 మంది అర్హత సాధించారు. వీరికి సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఫలితాలను తాాజాగా విడుదల చేసింది.

నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

TGPSC Exams Schedule: టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Ward Secretariat Employees: స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
IGNOU Recruitment: ఇగ్నోలో 43 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ.. దరఖాస్తు విధానం, అర్హతలు ఇవే!
ఇగ్నోలో 43 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ.. దరఖాస్తు విధానం, అర్హతలు ఇవే!

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
YSRCP Leaders Joining Janasena: జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
TGPSC Exams Schedule: టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
రూ.9.19 లక్షల ధరలో రెండు మంచి సెడాన్లు.. బూట్ స్పేస్, మైలేజీ, ఫీచర్లలో రెండిటి మధ్య తేడాలు
టాటా ఏరిస్ CNG vs మారుతి డిజైర్ CNG.. ధర దాదాపు సేమ్‌, ఏ కారులో ఎక్కువ ఫీచర్లు?
Bahadurpuga farmers: బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Tragedy in Medchal Malkajgiri: రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
Embed widget