UOH: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు - పూర్తి అర్హతలివే!
UOH Faculty Positions: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

UOH Recruitment: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UOHYD) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకీ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 40 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ, నెట్/ స్లెట్/ సెట్ ఉత్తీర్ణతతో పాటు బోధన/ పరిశోధనానుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 40
* ప్రొఫెసర్/అసోసియేట్ ప్రొఫెసర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
విభాగాలు: మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, కంప్యూటర్ అండ్ ఇన్‌న్ఫర్మేషన్ సైన్స్, కెమిస్ట్రీ, ప్లాంట్ సైన్స్, ఎనిమల్ బయాలజీ, బయోకెమిస్ట్రీ, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, మెడికల్ సైన్స్, న్యూరల్ కగ్నిటివ్ సైన్స్, ఫిలాసఫీ, ఉర్దూ, అప్లయిడ్ లింజిస్టిక్స్ అండ్ ట్రాన్స్ లేషన్ స్టడీస్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, కమ్యూనికేషన్స్, డాన్స్, థియేటర్ ఆర్ట్స్.
కేటగిరీ-I:
⏩ సైన్సెస్..
➥ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్: అసోసియేట్ ప్రొఫెసర్- 01, అసిస్టెంట్ ప్రొఫెసర్- 01.
➥ కంప్యూటర్ అండ్ ఇన్‌న్ఫర్మేషన్ సైన్స్: ప్రొఫెసర్- 02, అసోసియేట్ ప్రొఫెసర్- 02.
➥ ఫిజిక్స్: అసిస్టెంట్ ప్రొఫెసర్- 02.
➥ ఎర్త్, ఓషన్ అండ్ అట్మాస్ఫియరిక్ సైన్స్: ప్రొఫెసర్- 01.
➥ కెమిస్ట్రీ: ప్రొఫెసర్- 02, అసోసియేట్ ప్రొఫెసర్- 01, అసిస్టెంట్ ప్రొఫెసర్- 02.
➥ ప్లాంట్ సైన్స్: అసిస్టెంట్ ప్రొఫెసర్- 01.
➥ ఎనిమల్ బయాలజీ: అసిస్టెంట్ ప్రొఫెసర్- 02.
➥ బయోకెమిస్ట్రీ: అసిస్టెంట్ ప్రొఫెసర్- 01.
➥ ఇంజినీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ: అసోసియేట్ ప్రొఫెసర్- 01.
➥ మెడికల్ సైన్స్: అసిస్టెంట్ ప్రొఫెసర్- 01.
➥ న్యూరల్ కగ్నిటివ్ సైన్స్: అసోసియేట్ ప్రొఫెసర్- 01.
⏩ హ్యుమానిటీస్..
➥ ఫిలాసఫీ: అసోసియేట్ ప్రొఫెసర్- 01.
➥ ఉర్దూ: అసిస్టెంట్ ప్రొఫెసర్- 01.
➥ అప్లైడ్ లింగ్విస్టిక్స్ అండ్ ట్రాన్స్‌లేషన్ స్టడీస్: అసోసియేట్ ప్రొఫెసర్- 01, అసిస్టెంట్ ప్రొఫెసర్- 03.
⏩ ఎకనామిక్స్..
➥ ఎకనామిక్స్: అసోసియేట్ ప్రొఫెసర్- 01, అసిస్టెంట్ ప్రొఫెసర్- 02.
⏩ సోషల్ సైన్సెస్..
➥ హిస్టరీ: అసోసియేట్ ప్రొఫెసర్- 01, అసిస్టెంట్ ప్రొఫెసర్- 01.
➥ పొలిటికల్ సైన్స్: అసోసియేట్ ప్రొఫెసర్- 01.
⏩ ఆర్ట్స్ & కమ్యూనికేషన్..
➥ కమ్యూనికేషన్: ప్రొఫెసర్- 01.
➥ డ్యాన్స్: అసోసియేట్ ప్రొఫెసర్- 01.
➥ థియేటర్ ఆర్ట్స్: అసిస్టెంట్ ప్రొఫెసర్- 01.
కేటగిరీ-II:- బ్యాక్‌లాగ్ పొజిషన్‌లు
⏩ సైన్సెస్..
➥ మాథెమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్: అసోసియేట్ ప్రొఫెసర్- 01, అసిస్టెంట్ ప్రొఫెసర్- 01.
⏩ సోషల్ సైన్సెస్..
➥ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ: అసోసియేట్ ప్రొఫెసర్- 02.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ, నెట్/ స్లెట్/ సెట్ ఉత్తీర్ణతతో పాటు బోధన/ పరిశోధనానుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 65 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ట్రాన్స్ జెండర్ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: అభ్యర్థి అకడమిక్ రికార్డు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీత భత్యాలు: నెలకు ప్రొఫెసర్‌కు రూ.1,44,200 నుంచి రూ.2,18,200; అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,31,400 నుంచి రూ.2,17,100; అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.57,700 నుంచి రూ.1,82,400.
దరఖాస్తు హార్డ్‌కాపీలు పంపాల్సిన చిరునామా:
THE ASSISTANT REGISTRAR
RECRUITMENT CELL, ROOM NO: 221, FIRST FLOOR
ADMINISTRATION BUILDING, UNIVERSITY OF HYDERABAD
PROF. C.R. RAO ROAD, CENTRAL UNIVERSITY P.О.,
GACHIBOWLI, HYDERABAD – 500 046, TELANGANA, INDIA.
ముఖ్యమైన తేదీలు..
🔰 నోటిఫికేషన్ విడుదల: 20.01.2025.
🔰 ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 20.02.2025.
🔰 దరఖాస్తు హార్డు కాపీ పంపడానికి చివరి తేదీ: 24.02.2025.
Notification
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

