News
News
X

TSPSC TPBO Exam: మార్చి 12న టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ రాతపరీక్ష, హాల్‌టికెట్లు ఎప్పుడంటే?

టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ పోస్టుల భర్తీకి మార్చి 12న నిర్వహించనున్నారు. రాతపరీక్ష హాల్‌టికెట్లను మార్చి 6 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు టీఎస్‌పీఎస్సీ మార్చి 4న ఒక ప్రకటనలో తెలిపింది.

FOLLOW US: 
Share:

తెలంగాణలో టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ (TPBO) పోస్టుల భర్తీకి మార్చి 12న నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రాతపరీక్ష హాల్‌టికెట్లను మార్చి 6 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు టీఎస్‌పీఎస్సీ మార్చి 4న ఒక ప్రకటనలో తెలిపింది. హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. మార్చి 12న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహించనున్నారు. 

తెలంగాణ మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 7న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి విదితమే. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి సెప్టెంబర్ 20 నుంచి అక్టోబరు 13 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించారు. మొదట జనవరిలోనే రాతపరీక్ష నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ.. కుదరకపోవడంతో మార్చి 12న నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.32,810 - రూ.96,890 జీతంగా ఇస్తారు.

Notification 

పరీక్ష విధానం: మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. రెండు విభాగాల నుంచి 300 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి 150 ప్రశ్నలు-150 మార్కులు, అభ్యర్థి సంబంధిత సబ్జెక్ట్ నుంచి 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయిస్తారు. 

టీఎస్‌పీఎస్సీ వివిధ పరీక్షల తేదీలు వెల్లడి..

రాష్ట్రంలో ఉద్యోగ నియామక పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) మార్చి 3న వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 15, 16 తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నియామక పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే ఏప్రిల్ 4న హార్టికల్చర్ ఆఫీసర్, ఏప్రిల్ 23న అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) నియామక పరీక్షలు నిర్వహిస్తామని కమిషన్ తెలిపింది. పశుసంవర్ధక శాఖలో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్-ఎ అండ్ బి) పోస్టులకు, రవాణాశాఖలో 113 సహాయ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్(ఏఎంవీఐ) పోస్టులకు, హార్టికల్చర్ ఆఫీసర్ 22 పోస్టులకు గతంలో వేర్వేరుగా టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే నియామక పరీక్షల తేదీలను తాజాగా ఖరారు చేసింది. అయితే, హాల్ టికెట్ డౌన్‌లోడ్‌ తేదీలను మాత్రం ప్రకటించలేదు. పూర్తి వివరాలకు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని అభ్యర్థులకు సూచించింది.
పరీక్షల విధానం, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

గ్రూప్-2 పరీక్ష తేదీ వెల్లడి..

తెలంగాణలో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ ఫిబ్రవరి 28న విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనుంది. పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూలును త్వరలోనే ప్రకటించనున్నారు. పరీక్షలకు వారం ముందునుంచి హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు కమిషన్ ప్రకటించింది.  తెలంగాణలో గ్రూప్‌-2 పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 16తో ముగిసిన సంగతి తెలిసిందే. గ్రూప్-2 పోస్టులకు మొత్తం 5,51,943 దరఖాస్తులు అందాయి. అందినట్లు టీఎస్‌పీఎస్‌సీ అధికారులు ప్రకటించారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. చివరి మూడు రోజుల్లోనే 1.10లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం. చివరి రోజు 68వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్-2 పరీక్షకు ఒక్కో పోస్టుకు సగటున 705 మందికి చొప్పున పోటీ పడనున్నారు.

గ్రూప్-2 నోటిఫికేషన్, పరీక్ష స్వరూపం కోసం క్లిక్ చేయండి.. 

Published at : 05 Mar 2023 10:58 AM (IST) Tags: TSPSC Recruitment TSPSC TPBO Recruitment TPBO Recruitment Notification TPBO Exam Date TPBO Exam Hall Tickets

సంబంధిత కథనాలు

CBI Recruitment: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?

CBI Recruitment: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?

1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి, వివరాలు ఇలా!

1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి, వివరాలు ఇలా!

TS Police SI Admit Card: ఎస్‌సీటీ ఎస్‌ఐ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల - డైరెక్ట్ లింక్ ఇదే

TS Police SI Admit Card: ఎస్‌సీటీ ఎస్‌ఐ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల - డైరెక్ట్ లింక్ ఇదే

IITTM Jobs: ఐఐటీటీఎం-  టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు, అర్హతలివే!

IITTM Jobs: ఐఐటీటీఎం-  టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు, అర్హతలివే!

TSPSC Paper Leakage: 'గ్రూప్‌-1' పేపర్‌ మొదటి టార్గెట్, జూన్‌లోనే పేపర్‌ లీకేజీకి స్కెచ్‌!

TSPSC Paper Leakage: 'గ్రూప్‌-1' పేపర్‌ మొదటి టార్గెట్, జూన్‌లోనే పేపర్‌ లీకేజీకి స్కెచ్‌!

టాప్ స్టోరీస్

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Etela Rajender: ఇది మహిళలు చేసే వ్యాపారమా! టూ బ్యాడ్‌ థింగ్‌ కేసీఆర్: లిక్కర్ కేసుపై ఈటల

Etela Rajender: ఇది మహిళలు చేసే వ్యాపారమా! టూ బ్యాడ్‌ థింగ్‌ కేసీఆర్: లిక్కర్ కేసుపై ఈటల

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

AP Skill Development: 'స్కిల్' డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం: మంత్రి అమర్నాథ్

AP Skill Development: 'స్కిల్' డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం: మంత్రి అమర్నాథ్