అన్వేషించండి

TSPSC Paper Leak: మరికొన్ని ఎగ్జామ్స్ వాయిదా వేసిన టీఎస్ పీఎస్సీ - 5 ఎగ్జామ్స్ కొత్త తేదీలు ఇవీ

తెలంగాణలో పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలతో ఇప్పటికే పలు పరీక్షలు రద్దు చేసింది టీఎస్ పీఎస్సీ. కొన్ని పరీక్షలను ముందుగానే రద్దు చేసింది కమిషన్. తాజాగా మరికొన్ని పరీక్షలను రీ షెడ్యూల్ చేసింది

TSPSC New Exam Dates Latest News:  తెలంగాణలో పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలతో ఇప్పటికే పలు పరీక్షలు రద్దు చేసింది టీఎస్ పీఎస్సీ. కొన్ని పరీక్షలను ముందుగానే రద్దు చేసింది కమిషన్. తాజాగా మరికొన్ని పరీక్షలను రీ షెడ్యూల్ చేసింది టీఎస్ పీఎస్సీ. 5 నియామక పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించారు. అగ్రికల్చర్ ఆఫీసర్, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్, డ్రగ్స్ ఇన్ స్పెక్టర్, వాటర్ డిపార్ట్ మెంట్ లోని గెజిటెడ్ అండ్ నాన్ గెజిటెడ్ పోస్టులు వంటి మొత్తం 5 పోటీ పరీక్షల తేదీలను కమిషన్ ఓ ప్రకటనలో వెల్లడించింది.  అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు మొదట ఏప్రిల్ 23న పరీక్ష తేదీని ప్రకటించగా, తాజాగా జూన్ 26కు ఎగ్జామ్ వాయిదా వేశారు.

  • మే 16 అగ్రికల్చర్ ఆఫీసర్ ఎగ్జామ్
  • మే 19 డ్రగ్స్ ఇన్ స్పెక్టర్ ఎగ్జామ్
  • జూన్ 26 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ ఎగ్జామ్
  • జులై 18, 19 తేదీలలో వాటర్ బోర్డులో గెజిటెడ్ పోస్టులకు పరీక్షలు
  • జులై 20, జులై 21 తేదీలలో వాటర్ బోర్డులో నాన్ గెజిటెడ్ పోస్టులకు పరీక్షలు

పాత షెడ్యూల్ ప్రకారం ఏవీఎంఐ ఎగ్జామ్  తేదీ  ఏప్రిల్ 23 అని ప్రకటించారు. తాజాగా ఈ పరీక్షను జూన్ 26కు వాయిదా వేసింది టీఎస్ పీఎస్సీ. పేపర్ల లీకేజీ కలకలం, ఇంకా ఏమైనా ఎగ్జామ్ పేపర్లు లీకయ్యాయా అనే అనుమానంతో పరీక్షలను రీషెడ్యూల్ చేస్తోంది కమిషన్. కొత్తగా పేపర్లు తయారుచేసి రీ షెడ్యూల్ చేసిన తేదీలలో ఈ 5 నోటిఫికేషన్లకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు ఏప్రిల్ 25న ఉండాల్సిన పరీక్షను మే 16కు రీషెడ్యూల్ చేశారు. మే 19న డ్రగ్స్ ఇన్ స్పెక్టర్ ఎగ్జామ్ నిర్వహించనుండగా.. వాటర్ బోర్డులో ఉద్యోగాలకు నిర్వహించే ఎగ్జామ్స్ తేదీలను సైతం కమిషన్ ప్రకటించింది. మే 15, 16న నిర్వహించాల్సిన వాటర్ బోర్డులో నాన్ గెజిటెడ్ ఉద్యోగాలను జులై 20, జులై 21 తేదీలకు రీషెడ్యూల్ చేశారు. ఇందులోనే గెజిటెడ్ ఉద్యోగాలకు జులై 18, 19 తేదీలలో ఎగ్జామ్స్ నిర్వహిస్తామని, అభ్యర్థులు ఈ విషయాలు గమనించాలని సూచించారు.

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ఇంకా కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డికి కాన్ఫిడెన్షియల్ విభాగం సూపరింటెండెంట్ శంకరలక్ష్మి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఎలా తెలిసింది? అనేది చిక్కుముడిగా మారింది. మార్చి 11న టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం బహిర్గతమైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇంతవరకు 18 మంది నిందితులను గుర్తించి.. 17 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమినరీలో 100కు పైగా మార్కులు సాధించిన రాజశేఖర్ రెడ్డి బావ ప్రశాంత్ న్యూజిలాండ్‌లో ఉన్నట్లు సిట్ పోలీసులు గుర్తించారు. అతనికి వాట్సప్ ద్వారా నోటీసులు జారీచేశారు. దీనిపై స్పందించిన అతను గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రం తనకు అందలేదంటూ సిట్ అధికారులకు వాట్సప్ ద్వారా సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ప్రశ్నపత్రాల కోసం కాన్ఫిడెన్షియల్ విభాగం సూపరింటెండెంట్ డైరీలో రాసిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉపయోగించినట్లు నిందితులు పోలీసుల దర్యాప్తు, సిట్ కస్టడీలోనూ ఒకేవిధంగా సమాధానమిచ్చారు.

టాప్ హెడ్ లైన్స్

AP Special TET Results: ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
APPSC Group 2 Jobs: 720 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
720 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
AP DSC Notification: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 పోస్టులు, నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు!
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 పోస్టులు, నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు!
TGPSC AEE ఎగ్జామ్ వాయిదా వేయండి: సీఎం రేవంత్‌కు హరీష్ రావు లేఖ
TGPSC AEE ఎగ్జామ్ వాయిదా వేయండి: సీఎం రేవంత్‌కు హరీష్ రావు లేఖ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
YS Jagan Assests Case: వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
Fire Accident: దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
Hardik Pandya News: PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
N Ramchander Rao: 15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
Embed widget