News
News
X

Court Exams: కోర్టు ఉద్యోగ పరీక్షల తేదీలు ఖరారు, ఏ పరీక్ష ఎప్పుడంటే?

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అసిస్టెంట్, ఎగ్జామినర్, సిస్టమ్ అసిస్టెంట్, ట్రాన్స్‌లేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు మార్చి 31, ఏప్రిల్ 1 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

FOLLOW US: 
Share:

తెలంగాణ జ్యుడీషియల్ మినిస్ట్రీస్ సర్వీస్‌లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్వహించనున్న నియామక పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు రాతపరీక్ష షెడ్యూలును హైకోర్టు రిజిస్ట్రార్ విడుదల చేశారు. ప్రకటించిన షెడ్యూలు జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఏప్రిల్ 3 నుంచి 5 వరకు రాతపరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో పోస్టులవారీగా నిర్ణీత షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 

ఆయా తేదీల్లో మూడు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు మొదటి షిఫ్టులో, మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2 గంటల వరకు రెండో షిఫ్టులో, సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు మూడో షిఫ్టులో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను మార్చి 23 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  

పరీక్షల షెడ్యూలు ఇలా..

➥ ఏప్రిల్ 3న నిర్వహించే పరీక్షలు... 

జూనియర్ అసిస్టెంట్ (క్లస్టర్-3): ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు.

జూనియర్ అసిస్టెంట్ (క్లస్టర్-1): మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2 గంటల వరకు.

జూనియర్ అసిస్టెంట్ (క్లస్టర్-2): సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు.

➥ ఏప్రిల్ 4న నిర్వహించే పరీక్షలు... 

రికార్డ్ అసిస్టెంట్ (క్లస్టర్-2): 04.04.2023 - ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు.

రికార్డ్ అసిస్టెంట్ (క్లస్టర్-1): 04.04.2023 - మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2 గంటల వరకు. 

ఎగ్జామినర్: సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు.

➥ ఏప్రిల్ 5న నిర్వహించే పరీక్షలు... 

ఫీల్డ్ అసిస్టెంట్: ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు.

ALso Read:

UPSC EPFO Recruitment: ఈపీఎఫ్‌వోలో 577 ఖాళీలు, పూర్తి వివరాలు ఇలా!
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 577 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 17 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఐడీబీఐ బ్యాంకులో 600 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు, అర్హతలివే!
ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) అసిస్టెంట్ మేనేజనర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 600 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 17 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఏదైనా డిగ్రీతోపాటు నిర్ణీత పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 28లోపు దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

ఐడీబీఐ బ్యాంకులో స్పెషలిస్ట్‌ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 114 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 21 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు మార్చి 3 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 24 Feb 2023 07:19 PM (IST) Tags: TS Court Jobs Telangana Court Jobs Court Exams Court Recruitment Exams Court Jobs Exams

సంబంధిత కథనాలు

SRTRI: నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ, ఆపై ఉద్యోగాలు!

SRTRI: నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ, ఆపై ఉద్యోగాలు!

IBPS SO results: ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ తుది ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

IBPS SO results: ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ తుది ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

IBPS Clerk results: ఐబీపీఎస్ క్లర్క్‌ మెయిన్స్‌-2022 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

IBPS Clerk results: ఐబీపీఎస్ క్లర్క్‌ మెయిన్స్‌-2022 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

IBPS PO results: ఐబీపీఎస్ పీవో తుది ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

IBPS PO results: ఐబీపీఎస్ పీవో తుది ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

TS Constable Technical Papers: నేడే కానిస్టేబుల్‌ డ్రైవర్, మెకానిక్ టెక్నికల్ పరీక్షలు!

TS Constable Technical Papers: నేడే కానిస్టేబుల్‌ డ్రైవర్, మెకానిక్ టెక్నికల్ పరీక్షలు!

టాప్ స్టోరీస్

Bandi Sanjay : కేసీఆర్ మళ్లీ గెలిస్తే తెలంగాణ ప్రజల చేతికి చిప్ప తథ్యం- బండి సంజయ్

Bandi Sanjay : కేసీఆర్ మళ్లీ గెలిస్తే తెలంగాణ ప్రజల చేతికి చిప్ప తథ్యం- బండి సంజయ్

Perni Nani : ప్రస్తుత కేబినెట్ తోనే ఎన్నికలకు, మంత్రివర్గ మార్పులపై పేర్ని నాని క్లారిటీ

Perni Nani : ప్రస్తుత కేబినెట్ తోనే ఎన్నికలకు, మంత్రివర్గ మార్పులపై పేర్ని నాని క్లారిటీ

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?