News
News
X

ఉద్యోగ నియామకాలు వేగవంతం చేయండి, అధికారులకు సీఎస్ ఆదేశం!

రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై సీఎస్ మార్చి 14న సమీక్ష నిర్వహించారు.

FOLLOW US: 
Share:

రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై సీఎస్ మార్చి 14న సమీక్ష నిర్వహించారు. తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్‌లో నియామక బోర్డుల అధికారులతో ఈ సమావేశం నిర్వహించారు. టీఎస్పీఎస్సీ భర్తీ చేస్తున్న అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నాపత్రం లీకైందని తేలడంతో ఉద్యోగ నియామకాలపై సీఎస్ సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, పోలీసు నియామక బోర్డు చైర్మన్ శ్రీనివాస్ రావు, గురుకుల నియామక బోర్డు కార్యదర్శి మల్లయ్య భట్టు, వైద్య నియామక బోర్డు జేడీ గోపీకాంత్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్‌తో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఇప్పటివరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 17,285 ఉద్యోగాలకు సంబంధించి 17 నోటిఫికేషన్లు విడుదలయ్యాయని, కొన్ని నోటిఫికేషన్లకు ప్రాథమిక పరీక్షలు కూడా పూర్తి చేశామని అధికారులు వివరించారు. గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 నోటిఫికేషన్లకు సంబంధించి జూలై నెలలోగా రాత పరీక్షలు పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు. నవంబర్ నెలవరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ కానున్న అన్ని నోటిఫికేషన్లకు సంబంధించి రాత పరీక్షలు పూర్తి చేస్తామని అధికారులు సీఎస్‌తో తెలిపారు.

మొత్తం పది వేల పోస్టులకు సెప్టెంబర్‌లోగా….
తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 17,516 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా ఇప్పటికే ప్రాథమిక పరీక్షలు పోర్ట్ చేశామని, ఏప్రిల్‌లో రాత పరీక్షలు పూర్తి చేసి, సెప్టెంబర్ నెలలోగా నియామకాలు జరుపుతామని అధికారులు సీఎస్‌తో పేర్కొన్నారు. మెడికల్, హెల్త్ సర్వీస్ బోర్డు ద్వారా ఆగస్టులోగా దాదాపు 10 వేల వివిధ స్థాయి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సీఎస్ తెలిపారు. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా మొత్తం 10  వేల పోస్టులకు సెప్టెంబర్‌లోగా నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు శాంతికుమారి స్పష్టం చేశారు. ఉద్యోగాల నియమాకాల ప్రక్రియలో అన్ని జాగ్రత్తలు తీసుకొని సర్వీసు అంశాలు, రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్ల అంశాల్లో కొన్ని శాఖల్లో పెండింగ్‌లో ఉన్న వాటిని వెంటనే పరిష్కరించి ఆయా ఉద్యోగ ఖాళీలను నోటిఫై చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

Also Read:

పేపర్ లీక్‌పై గవర్నర్ తమిళిసై సీరియస్ - 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు
తెలంగాణలో సంచలనం రేపిన టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై  రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఎంతో భవిష్యత్ ఉంటుందని నమ్మి ప్రభుత్వ సర్వీస్ కోసం శ్రమిస్తున్న అభ్యర్థులకు ఇలాంటి పరిస్థితి తలెత్తడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 48 గంటల్లోగా తనకు పూర్తి నివేదిక సమర్పించాలని టీఎస్ పీఎస్సీని గవర్నర్ తమిళిసై ఆదేశించారు. ప్రతిష్టాతక రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ కమిషన్ నుంచి ప్రశ్నాపత్రం లీకేజీని తీవ్రంగా పరిగణించి, సమగ్ర విచారణ చేపట్టి నివేదిక అందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

ఉద్యోగులే హ్యాక్ చేసి లీక్ చేశారు, నా పిల్లలెవరూ గ్రూప్ 1 రాయలేదు - టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి
పేపర్ లీకేజీ వ్యవహారంపై టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసుల నుంచి అధికారిక నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సోషల్ మీడియాలో వస్తు్న్న వదంతులను నమ్మొద్దని సూచించారు. టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్న ఉద్యోగులు పేపర్ లీక్ చేశారన్నారు. ఔట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న రాజశేఖర్ రెడ్డి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ కలిసి సిస్టమ్ హ్యాకింగ్ చేసి పేపర్లు లీక్ చేశారన్నారు. ఈ వ్యవహారంపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదుచేశామన్నారు. ఈ కేసులో విచారణ జరుగుతుందన్నారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 15 Mar 2023 06:25 AM (IST) Tags: Telangana Jobs TS Chief Secretary Telangana Chief Secretary Chief Secretary Santhi Kumari TS Recruitment

సంబంధిత కథనాలు

SSC CHSLE 2022 Key: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ - 2022 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

SSC CHSLE 2022 Key: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ - 2022 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

ISRO Jobs: ఇస్రో-నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో ఖాళీలు, అర్హతలివే!

ISRO Jobs: ఇస్రో-నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో ఖాళీలు, అర్హతలివే!

L&T Recruitment 2023: ఎల్‌ & టీలో ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, అర్హతలు ఇవే!

L&T Recruitment 2023: ఎల్‌ & టీలో ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, అర్హతలు ఇవే!

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారం, పెన్‌డ్రైవ్‌లో మొత్తం 15 ప్రశ్నపత్రాలు!

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారం, పెన్‌డ్రైవ్‌లో  మొత్తం 15 ప్రశ్నపత్రాలు!

TSPSC Updates : టీఎస్‌పీఎస్సీ బోర్డు సభ్యులనూ ప్రశ్నించనున్న సిట్ - నోటీసులు జారీ !

TSPSC Updates :  టీఎస్‌పీఎస్సీ బోర్డు సభ్యులనూ ప్రశ్నించనున్న సిట్ - నోటీసులు జారీ !

టాప్ స్టోరీస్

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి