News
News
X

Top Job Sites: బెస్ట్ జాబ్ సైట్స్ ఇవే..

రిఫరెన్సులు అడగటం.. రెజ్యూమె పట్టుకుని ఆఫీసులకు తిరగడం.. ఇంటర్వ్యూ కోసం గంటల పాటు వేచిచూడటం.. ఈ రోజులన్నీ పోయాయి. స్మార్ట్ ఫోన్లలో ఒక్క క్లిక్‌తో ఉద్యోగాల వివరాలు వచ్చేస్తున్నాయి.

FOLLOW US: 
Share:

రిఫరెన్సులు అడగటం.. రెజ్యూమె పట్టుకుని ఆఫీసులకు తిరగడం.. ఇంటర్వ్యూ కోసం గంటల పాటు వేచిచూడటం.. ఈ రోజులన్నీ పోయాయి. స్మార్ట్ ఫోన్లలో ఒక్క క్లిక్‌తో ఉద్యోగాల వివరాలు వచ్చేస్తున్నాయి. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఏదైనా జాబ్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి మీ క్వాలిఫికేషన్‌తోపాటు మీకు కావాల్సిన రంగాలను ఎంచుకుంటే మీ ఫోన్లలోనే మీకు తగ్గ ఉద్యోగావకాశాలు కనిపిస్తున్నాయి. మనం ఏ ప్రాంతం నుంచి అయినా వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. మరి అన్ని వెబ్‌సైట్లను నమ్మగలమా? అసలే ఈ మధ్య కాలంలో ఉద్యోగాల పేరిట బురిడీ కొట్టించే యాప్స్, సైట్లు చాలానే పుట్టుకొచ్చాయి. ఉద్యోగావకాశాల కోసం బెస్ట్‌గా ఉండే ఒక 5 సైట్ల వివరాలు మీకోసం.. 
లింక్డ్ఇన్ (LinkedIn)
ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది బెస్ట్ ప్లాట్‌ఫామ్. 2003లో ప్రారంభమైన లింక్డ్ఇన్.. ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని పరిశ్రమలకు చెందిన 740 మిలియన్లకు పైగా యూజర్లు ఇందులో రిజిస్టర్ అయి ఉన్నారు.

ఇందులో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక విద్యార్హత, అనుభవం తదితర వివరాలు ఇవ్వాలి. వీటి ఆధారంగా డీఫాల్ట్‌గా కొన్ని జాబ్ సజెషన్స్ వస్తాయి. ఫేస్‌బుక్‌లో లాగా ఇందులో ఫ్రెండ్ రిక్వస్ట్స్ ఉంటాయి. వీటి ద్వారా ప్రొఫెషనల్ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. వివిధ కంపెనీల రిక్రూటర్లతో నేరుగా కనెక్ట్ అయ్యే అవకాశం ఇందులో ఉంది. కెరీర్ గైడెన్స్, ఇంటర్వ్యూలకు సంబంధించిన టిప్స్ కూడా ఇందులో ఉంటాయి. మనం ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటే ఇందులో ఓపెన్ టూ వర్క్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. 
లింక్: https://www.linkedin.com/
ఇన్‌డీడ్ (Indeed)
ఇది అమెరికాకు చెందిన జాబ్ పోర్టల్. ప్రజలకు ఉద్యోగాలను కల్పించాలనే ఉద్దేశంతో 2004లో దీనిని ప్రారంభించారు. ప్రస్తుతం భారతదేశం సహా ప్రపంచమంతా విస్తరించింది. సెకనుకు 10 కొత్త ఉద్యోగాలను యాడ్ చేస్తుంది. నెలవారీగా 250 మిలియన్ల యాక్టివ్ యూజర్లను కలిగి ఉంది. జాబ్ పోస్టులతో పాటు, కంపెనీల రివ్యూలు, రేటింగ్స్ అందిస్తుంది.

ఇందులో ఉండే సెర్చ్ ఫిల్టర్ల ద్వారా మనకు ఆసక్తి ఉన్న ఉద్యోగాలను ఎంచుకోవచ్చు. రెజ్యూమె క్రియేట్ చేసుకునే సౌకర్యం కూడా ఇందులో ఉంది. ప్రాంతం, జీతం, కంపెనీ, ఫీల్డ్ మొదలైన వాటి ఆధారంగా ఉద్యోగాలను పొందవచ్చు. ఇది ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న నిరుద్యోగం, ఉద్యోగాలు సహా పలు అంశాలపై సర్వేలు కూడా నిర్వహిస్తుంటుంది. 
లింక్: https://in.indeed.com/

నౌకరీ (Naukri)
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన జాబ్ పోర్టల్. 1997లో ఇది ప్రారంభమైంది. నిత్యం వేలాది మంది దీనిని యాక్సెస్ చేస్తారు. ఇందులో మొదట మనం ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఇందులో అనుభవం ఆధారంగా ఫ్రెషర్స్, ఎక్‌పీరియన్స్‌డ్ జాబ్స్, వాక్ ఇన్ ఇంటర్వ్యూలు ఉంటాయి. వీటికి అప్లై చేయడం ద్వారా రిక్రూటర్లు మనతో కనెక్ట్ అవుతారు. ఆకర్షణీయమైన రెజ్యూమెలను క్రియేట్ చేయడానికి నౌకరీ ఫాస్ట్ ఫార్వాడ్ అనే సర్వీస్ కూడా ఉంది. అయితే దీనికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.  
లింక్: https://www.naukri.com/
గ్లాస్‌డోర్ (Glassdoor)

గ్లాస్‌డోర్ కేవలం ఉద్యోగాల కోసం సెర్చ్ చేయడం కోసమే కాకుండా.. కంపెనీల రివ్యూలు, రేటింగ్స్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఒక సంస్థలో పనిచేస్తున్న లేదా పనిచేసిన ఉద్యోగులు దానిలో ఉండే జీతాలు, ఇతర ప్రయోజనాల సమాచారాన్ని ఇందులో పంచుకోవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నించేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దరఖాస్తు చేయాలనుకునే సంస్థలో పనితీరు, జీతాలు ఎలా ఉంటాయనే విషయాలను ముందుగానే అర్థం చేసుకునేందుకు ఇది తోడ్పడుతుంది.  
లింక్: https://www.glassdoor.co.in/
మాన్‌స్టర్ (Monster)

ఇందులో జాబ్ పోస్టింగ్స్‌తో పాటు ఇంటర్వ్యూలు, కెరీర్ గైడెన్స్‌కు సంబంధించిన ఉపయోగకరమైన టిప్స్ బ్లాగ్స్ రూపంలో ఉంటాయి. దీని ఇంటర్‌ఫేస్ చాలా సులభంగా ఉంటుంది. ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని రెజ్యూమె అప్‌లోడ్ చేయడం ద్వారా ఉద్యోగావకాశాలు కనిపిస్తాయి. మనం ఎంచుకున్న ఆప్షన్ల ఆధారంగా ఉద్యోగాలు ఫిల్టర్ అవుతాయి. 

లింక్: https://www.monsterindia.com/

Published at : 22 Jul 2021 08:22 PM (IST) Tags: Job Sites in India Best Job Sites Job sites 2021 Top 5 Job Sites Top Job Sites Job Site Information

సంబంధిత కథనాలు

Gujarat Junior Clerk Exam Cancel: హైదరాబాద్‌లో పేపర్ లీకేజీ కలకలం, జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ రద్దు చేస్తూ కీలక నిర్ణయం

Gujarat Junior Clerk Exam Cancel: హైదరాబాద్‌లో పేపర్ లీకేజీ కలకలం, జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ రద్దు చేస్తూ కీలక నిర్ణయం

SI Constable Marks : ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్, ఆ 7 ప్రశ్నల విషయంలో మార్కులు కలపాలని బోర్డు నిర్ణయం

SI Constable Marks : ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్, ఆ 7 ప్రశ్నల విషయంలో మార్కులు కలపాలని బోర్డు నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచారా!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచారా!

APPSC Mains Exam Schedule: 'గ్రూప్-1' మెయిన్స్ షెడ్యూలు విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?

APPSC Mains Exam Schedule: 'గ్రూప్-1' మెయిన్స్ షెడ్యూలు విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?

APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!

APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!

టాప్ స్టోరీస్

Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ

Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ

Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్

Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్

Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!

Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!

Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్

Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్