అన్వేషించండి

TSPSC: 'గ్రూప్-2' పరీక్ష ఓఎంఆర్ విధానంలోనే, టీఎస్‌పీఎస్సీ ప్రకటన!

గ్రూప్‌-2 నియామక పరీక్షను ఆప్టికల్‌ మార్క్‌ రికగ్నైజేషన్‌ (ఓఎంఆర్‌) పద్ధతిలోనే నిర్వహించనున్నట్టు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) జూన్ 15న వెల్లడించింది.

గ్రూప్‌-2 నియామక పరీక్షను ఆప్టికల్‌ మార్క్‌ రికగ్నైజేషన్‌ (ఓఎంఆర్‌) పద్ధతిలోనే నిర్వహించనున్నట్టు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) జూన్ 15న వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 29, 30 తేదీల్లో రెండు సెషన్లలో గ్రూప్-2 పరీక్ష నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కమిషన్ వెల్లడించింది. పరీక్ష నిర్వహణ, కేంద్రాలు తదితర అంశాలపై టీఎస్‌పీఎస్సీ అధికారులు సమావేశాలు నిర్వహించి చర్చించారు. 

గ్రూప్‌-2 పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేసిన విద్యాసంస్థలకు ఆగస్టు 29, 30 తేదీల్లో ఆ రెండు రోజులు సర్కారు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నత విద్యామండలి, కళాశాల విద్యాశాఖ, ఇంటర్‌ బోర్డు, పాఠశాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణలో 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ ఫిబ్రవరి 28న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించారు.గ్రూప్‌-2 పోస్టులకు మొత్తం 5,51,943 దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు సగటున 705 మందికి చొప్పున పోటీ పడనున్నారు.

గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, తహసిల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

పరీక్ష విధానం, సిలబస్ వివరాలు..

మొత్తం 600 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష (సీబీటీ) నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కులు కేటాయించారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు చొప్పున నాలుగు పేపర్లకు కలిపి 600 ప్రశ్నలకు 600 మార్కులు ఉంటాయి.

పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్): 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి. 

➥ పేపర్-2 (హిస్టరీ, పాలిటీ & సొసైటీ): 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి.

పేపర్-3 (ఎకానమీ & డెవలప్‌మెంట్): 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి.

➥ పేపర్-4 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్రావతారణ): 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి.  

పోస్టుల వివరాలు...

* గ్రూప్-2 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 783

1) మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-3): 11 పోస్టులు

విభాగం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్. 

2) అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (ఏసీటీవో): 59 పోస్టులు

విభాగం: కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్సెస్ డిపార్ట్‌మెంట్.

3) నాయబ్ తహసిల్దార్: 98 పోస్టులు

విభాగం: ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్.

4) సబ్-రిజిస్ట్రార్ (గ్రేడ్-2): 14 పోస్టులు

విభాగం: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్.

5) అసిస్టెంట్ రిజిస్ట్రార్: 63 పోస్టులు

విభాగం: కంట్రోల్ ఆఫ్ కమిషనర్- కోఆపరేషన్ & రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్.

6) అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్: 09 పోస్టులు

విభాగం: కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్‌మెంట్.

7) మండల్ పంచాయత్ ఆఫీసర్: 126 పోస్టులు

విభాగం: పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్.

8) ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్: 97 పోస్టులు

విభాగం: ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్.

9) అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 38 పోస్టులు

 విభాగం: హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ డిపార్ట్‌మెంట్.

10) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 165 పోస్టులు

 విభాగం: జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్.

11) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 15 పోస్టులు

 విభాగం: లెజిస్లేటివ్ సెక్రటేరియట్.

12) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 25 పోస్టులు

 విభాగం: ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్.

13) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 07 పోస్టులు

 విభాగం: లా డిపార్ట్‌మెంట్.

14) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 02 పోస్టులు

 విభాగం: తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్. 

15) డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ (గ్రేడ్-2): 11 పోస్టులు

 విభాగం: జువైనల్ కరెక్షనల్ సర్వీసెస్ & వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ డిపార్ట్‌మెంట్. 

16) అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 17 పోస్టులు

 విభాగం: బీసీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్. 

17) అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 09 పోస్టులు

 విభాగం: ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్. 

18) అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ఎస్సీ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 17 పోస్టులు

 విభాగం: ఎస్సీ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్. 

గ్రూప్-2 నోటిఫికేషన్, పరీక్ష స్వరూపం కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
Embed widget