అన్వేషించండి

TSPSC Group2 Exam: టీఎస్‌పీఎస్సీ 'గ్రూప్‌-2' పరీక్ష మరోసారి వాయిదా, త్వరలో కొత్త తేదీలు వెల్లడి

తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష మరోసారి వాయిదా పడింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ డిసెంబరు 27న ప్రకటించింది.

TSPSC Group2 Exam Postponed: తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష మరోసారి వాయిదా పడింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ బుధవారం (డిసెంబరు 27) రాత్రి ప్రకటించింది. వాయిదాపడిన పరీక్ష తేదీలను తర్వాత వెల్లడిస్తామని కమిషన్ స్పష్టం చేసింది. మొత్తం 783 గ్రూప్-2 పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. తొలుత విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరగాల్సి ఉండగా.. అప్పుడు వరుసగా ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు ఆందోళనలతో వాయిదా పడ్డాయి. ఆ తర్వాత నవంబర్ 2, 3 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న వేళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో మరోసారి ఈ పరీక్ష వాయిదా పడింది. తాజాగా మరోసారి వాయిదా వేస్తున్నట్టు టీఎస్‌పీఎస్సీ అధికారులు ప్రకటించారు.

TSPSC Group2 Exam: టీఎస్‌పీఎస్సీ 'గ్రూప్‌-2' పరీక్ష మరోసారి వాయిదా, త్వరలో కొత్త తేదీలు వెల్లడి

తెలంగాణలో 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ గతేడాది ఉద్యోగ ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది.  ఈ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్-2 పోస్టులకు సంబంధించి  ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ షెడ్యూలు విడుదల చేసింది. అయితే గ్రూప్-1, గ్రూప్-4 పరీక్షలు, గురుకుల నియామక పరీక్షలతో పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు సమయం లేనందున గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. దీంతో పరీక్షలను నవంబరు 2, 3 తేదీలకు రీషెడ్యూలు చేస్తూ కమిషన్ నిర్ణయం తీసుకుంది. 

గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, తహసిల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

గ్రూప్-2 పోస్టుల వివరాలు...

మొత్తం ఖాళీల సంఖ్య: 783

1) మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-3): 11 పోస్టులు

విభాగం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్. 

2) అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (ఏసీటీవో): 59 పోస్టులు

విభాగం: కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్సెస్ డిపార్ట్‌మెంట్.

3) నాయబ్ తహసిల్దార్: 98 పోస్టులు

విభాగం: ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్.

4) సబ్-రిజిస్ట్రార్ (గ్రేడ్-2): 14 పోస్టులు

విభాగం: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్.

5) అసిస్టెంట్ రిజిస్ట్రార్: 63 పోస్టులు

విభాగం: కంట్రోల్ ఆఫ్ కమిషనర్- కోఆపరేషన్ & రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్.

6) అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్: 09 పోస్టులు

విభాగం: కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్‌మెంట్.

7) మండల్ పంచాయత్ ఆఫీసర్: 126 పోస్టులు

విభాగం: పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్.

8) ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్: 97 పోస్టులు

విభాగం: ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్.

9) అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 38 పోస్టులు

 విభాగం: హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ డిపార్ట్‌మెంట్.

10) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 165 పోస్టులు

 విభాగం: జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్.

11) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 15 పోస్టులు

 విభాగం: లెజిస్లేటివ్ సెక్రటేరియట్.

12) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 25 పోస్టులు

 విభాగం: ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్.

13) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 07 పోస్టులు

 విభాగం: లా డిపార్ట్‌మెంట్.

14) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 02 పోస్టులు

 విభాగం: తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్. 

15) డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ (గ్రేడ్-2): 11 పోస్టులు

 విభాగం: జువైనల్ కరెక్షనల్ సర్వీసెస్ & వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ డిపార్ట్‌మెంట్. 

16) అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 17 పోస్టులు

 విభాగం: బీసీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్. 

17) అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 09 పోస్టులు

 విభాగం: ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్. 

18) అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ఎస్సీ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 17 పోస్టులు

 విభాగం: ఎస్సీ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్. 

గ్రూప్-2 నోటిఫికేషన్, పరీక్ష స్వరూపం కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget