అన్వేషించండి

TS Police: ఎస్ఐ ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

ఆగస్టు 7న నిర్వహించనున్న ఎస్ఐ పరీక్షకు దరఖాస్తు చుసుకున్న అభ్యర్థులు తమ హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణలో ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన హాల్‌టిక్కెట్లను పోలీసు నియామక మండలి విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టిక్కెట్లను అందుబాటులో ఉంచింది. ఆగస్టు 7న నిర్వహించనున్న పరీక్షకు దరఖాస్తు చుసుకున్న అభ్యర్థులు తమ హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 5వ తేదీ రాత్రి 12 గంటల వరకు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆగస్టు 7న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి వరకు నిర్వహిస్తామని పోలీస్ బోర్డు ప్రకటించింది. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,47,217 మంది హాజరుకానున్నారు.

Download SI Hall Tickets 

Official Website

బయోమెట్రిక్‌ విధానంలో హాజరు
పోలీస్ నియామకాలకు సంబంధించి ప్రాథమిక రాతపరీక్షకు బయోమెట్రిక్ విధానాన్ని అమలుచేయనున్నారు. ఈ మేరకు అన్ని పరీక్ష కేంద్రాల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థులు వాటిలో తమ వేలిముద్రలను నమోదుచేయాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ నేపథ్యంలో అభ్యర్థులు చేతివేళ్లకు మెహిందీ, టాటూలు లేకుండా చూసుకోవడం తప్పనిసరి.

503 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు
పోలీస్ శాఖలో 554 ఎస్సై పోస్టుల కోసం జరగనున్న ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 2,47,217 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 503 పరీక్ష కేంద్రాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 35 పట్టణాల్లో సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఆగస్టు 7న ఉదయం 10 గంటలకు పరీక్ష జరగనుండటంతో అభ్యర్థులను గంట ముందే కేంద్రంలోకి అనుమతించనున్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఒక నిమిషమైనా ఆలస్యమైనా లోపలికి అనుమతించరు.

హాల్‌టికెట్‌పై అభ్యర్థి ఫొటో ఉంటేనే అనుమతి..
అభ్యర్థులు తమన హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జులై 30న ఉదయం 8 గంటల నుంచి ఆగస్టు 5న రాత్రి 12 గంటల వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్‌టికెట్లను ఏ4 సైజ్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవాలి. పరీక్ష నిబంధనలకు సంబంధించిన సమాచారాన్ని మరో పేజీలో కాకుండా అదే కాగితంపై వెనకవైపు ప్రింటవుట్ తీసుకోవాలి. బ్లాక్ అండ్ వైట్‌ ప్రింట్ సరిపోతుంది. డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌లోని నిర్దేశిత స్థలంలో అభ్యర్థి ఫొటోను అతికించుకోవాలి. దరఖాస్తు చేసిన సమయంలో డిజిటల్ కాపీలో ఉంచిన ఫొటోనే తిరిగి వినియోగించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పిన్‌లు కొట్టకూడదు. ఫొటో లేకుంటే పరీక్షకు అనుమతించరు. ఒకవేళ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడంలో ఏవైనా సమస్యలుంటే 93937 11110 లేదా 93910 05006 నంబర్లలో సంప్రదించవచ్చు. లేదా support@tslprb.in కు మెయిల్ చేయవచ్చు.

అభ్యర్థులకు ముఖ్య సూచనలు:

  • అభ్యర్థులు సెల్‌ఫోన్లు, టాబ్లెట్, పెన్ డ్రైవ్, బ్లూటూత్ డివైజ్, చేతిగడియారం, కాలిక్యులేటర్, లాగ్ టేబుల్, వాలెట్, పర్సులు, నోట్స్, చార్ట్, రికార్డింగ్పరికరాలు, ఖాళీ పేపర్లను వెంట తీసుకెళ్లకూడదు.
  • నగలు ధరించరాదు. హ్యాండ్ బ్యాగ్, పౌచ్‌లు తీసుకురాకూడదు. భద్రపరిచేందుకు పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి క్లాక్ రూంలు ఉండవు అన్న సంగతి గుర్తించాలి.
  • అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్నులను మాత్రమే లోనికి తీసుకెళ్లాలి.
  • ఓఎంఆర్  షీట్లపై అనవసర రాతలు, గుర్తులు, మతసంబంధ అంశాల్లాంటివి రాస్తే మాల్ ప్రాక్టీస్‌గా పరిగణిస్తారు.
  • పరీక్షలో నెగెటివ్ మార్కులున్నందున అభ్యర్థులు జాగ్రత్తగా సమాధానాలు టిక్ చేయాల్సి ఉంటుంది. పరీక్షపత్రం బుక్‌లెట్‌లో ఇంగ్లిష్ -తెలుగు, ఇంగ్లిష్ -ఉర్దూ భాషలో ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నల్లో ఏవైనా సందేహాలుంటే ఇంగ్లిష్  వెర్షన్‌నే పరిగణనలోకి తీసుకోవాలి.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Delhi Capitals vs Gujarat Titans Highlights | రషీద్ ఖాన్ ట్రై చేసినా.. విజయం దిల్లీదే | ABP DesamPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురంలో ప్రజలు ఎటు వైపు..? | ABP DesamCM Revanth Reddy vs Harish Rao | రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించిన హరీశ్ రావు | ABP DesamPawan Kalyan Dance in Nomination Ryally | కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి నామినేషన్ లో పవన్ చిందులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
KCR News: ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
Medak BRS Candidate :  రూ. వంద కోట్లిస్తా -  మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
రూ. వంద కోట్లిస్తా - మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
Actor Naresh On Pawan Kalyan :  సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
Embed widget