అన్వేషించండి

TGPSC Group1 Recruitment: తగ్గేదేలే అంటున్న టీజీపీఎస్సీ, 1:50 నిష్పత్తిలోనే 'గ్రూప్‌-1' మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక

Group 1 Mains: నిబంధనలకు విరుద్దంగా గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక కుదరదని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది. 1:50 నిష్పత్తిలోనే ఎంపికచేయనున్నట్లు ప్రకటించింది.

TGPSC Group1 Mains Selection Ratio: తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు అభ్యర్థులను 1:100 నిష్పత్తిలో ఎంపికచేయాలంటూ ఒకపక్క నిరుద్యోగులు డిమాండ్లు చేస్తుంటే.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) మాత్రం తగ్గేదేలే అంటోంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి 1:50 నిష్పత్తిలోనే 'గ్రూప్‌-1' మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ప్రకటించింది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ ఆధారంగా మెయిన్స్ పరీక్షకు సాధారణ పరిపాలనశాఖ జారీచేసిన ఉత్తర్వుల(జీవో నెం. 55, 29)లోని నిబంధనల ప్రకారం 1:50 నిష్పత్తిలోనే ఎంపిక చేస్తామని స్పష్టం చేసింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు అభ్యర్థుల ఎంపికపై హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా..  వారి అభ్యర్థనలను పరిశీలించిన టీజీపీఎస్సీ మెయిన్స్ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపికచేయడం సాధ్యం కాదని తెలిపింది. ఈ మేరకు అభ్యర్థుల అభ్యర్థనలను తిరస్కరిస్తున్నట్లు వెల్లడిస్తూ ఇటీవల టీజీపీఎస్సీ మెమో జారీచేసింది.

'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్షలో మెరిట్ ఆధారంగా మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని ఇటీవల కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం.. అభ్యర్థుల అభ్యర్థనలను పరిశీలించాలని కమిషన్‌కు సూచించింది. చట్టానికి లోబడి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని, ఆ నిర్ణయాన్ని అభ్యర్థులకు తెలియజేయాలని కమిషన్‌ను ఆదేశించింది. ఈ మేరకు అభ్యర్థుల అభ్యర్థనలను పరిశీలించిన టీజీపీఎస్సీ.. వాటిని తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు హైకోర్టులో మెమో దాఖలు చేసింది. అయితే దీనిపై నిరుద్యోగుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

అభ్యర్థనల తిరస్కరణకు కమిషన్ చెప్పిన కారణాలు ఇవీ..

➥ ప్రభుత్వ సాధారణ పరిపాలనశాఖ జారీ చేసిన 'జీవో నెం.55'ను సవరణ చేస్తూ 'జీవో నం.29' జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ జీవోలోని నిబంధనలకు అనుగుణంగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ అయింది.

➥ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక విషయం జీవో నెం.29లోని పేరా నం.5లో స్పష్టంగా ఉంది. 

➥ ప్రతి మల్టీజోన్‌లో ఖాళీల సంఖ్యకు అనుగుణంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. 

➥ తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్ సర్వీసు రూల్స్ -1996లోని 22, 22ఏ నిబంధనల మేరకు సంబంధిత రిజర్వుడ్ కేటగిరీల్లో అభ్యర్థుల సంఖ్య తక్కువైతే, అందుకు అనుగుణంగా ఆ కేటగిరీల నుంచి అదనంగా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. 

➥ ప్రధాన పరీక్షకు అభ్యర్థుల ఎంపికపై ఉద్యోగ ప్రకటన నం.02/2024లోని పేజి నం.16లోని పేరా 12 లోని పేరా బీ లోనూ 1:50 నిష్పత్తిలో ఎంపికపై స్పష్టంగా పేర్కొన్నారు. 

➥ ప్రభుత్వ సాధారణ పరిపాలనశాఖ జారీ చేసిన 'జీవో నెం.55'ను సవరణ చేస్తూ 'జీవో నం.29' జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ జీవోలోని నిబంధనలకు అనుగుణంగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ అయింది.

➥ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక విషయం జీవో నెం.29లోని పేరా నం.5లో స్పష్టంగా ఉంది. 

➥ ప్రతి మల్టీజోన్‌లో ఖాళీల సంఖ్యకు అనుగుణంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. 

➥ తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్ సర్వీసు రూల్స్ -1996లోని 22, 22ఏ నిబంధనల మేరకు సంబంధిత రిజర్వుడ్ కేటగిరీల్లో అభ్యర్థుల సంఖ్య తక్కువైతే, అందుకు అనుగుణంగా ఆ కేటగిరీల నుంచి అదనంగా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. 

➥ ప్రభుత్వ ఉత్తర్వులు, నిబంధనలకు లోబడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు విడుదల చేసి, ఖాళీలను భర్తీ చేస్తుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల అభ్యర్థనలను పరిశీలించిన తరువాత వాటిని తిరస్కరిస్తున్నట్లు టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
Embed widget