అన్వేషించండి

Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!

Telangana Police Recruitment 2026: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ పరిధిలో ఖాళీగా ఉన్న ఐదు వేల వివిధ కేటగరీల పోస్టుల భర్తీకి అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణలో 5000 పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది.
  • ఆర్థిక శాఖ జీవో 78 ద్వారా ఈ అనుమతి లభించింది.
  • సివిల్, టెక్నికల్ విభాగాల్లో ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు ఉంటాయి.
  • టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ త్వరలో నియామక నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.

Telangana Police Recruitment 2026: తెలంగాణ రాష్ట్రంలో పోలీసు కొలువుల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. హోంశాఖ పరిధిలోని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ పరిపాలనా నియంత్రణలో ఉన్న వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఐదు వేల పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ జూన్ 27, 2026న జీవో నెంబర్‌ 78 జారీ చేసింది. 

రాష్ట్రంలో శాంతి భద్రతలను మరింత మెరుగుపరచడానికి, పోలీస్‌ శాఖలో పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డైరెక్టర్‌ జనరల్ ఆఫ్‌ పోలీస్‌ సమర్పించిన ప్రతిపాదనలను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించింది. శాఖలోని కార్యకరాలాపాలు, అవసరాలు, ఆర్థిక సంబంధిత అంశాలను పరిగణలోకి తీసుకొని, నేరుగా నియామక ప్రక్రియ ద్వారా ఈ ఐదు వేల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. 

మొత్తం ఐదు వేల పోస్టుల్లో సివిల్ పోలీస్ విభాగం నుంచి టెక్నికల్‌ విభాగం వరకు వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి. 

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి పోస్టు   

  • సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌(సివిల్)- 148 పోస్టులు
  • సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌(ఏఆర్)- 14 పోస్టులు 
  • రిజర్వ్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌(టీజీఎస్పీ)- 12 పోస్టులు 
  • సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌(ఎస్‌ఏఆర్ సీపీఎల్)-3 పోస్టులు 
  • అసిస్టెం్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌(ఎఫ్‌పీబీ)-23 పోస్టులు 

పోలీస్‌ కానిస్టేబుల్ స్థాయి పోస్టులు  

  • పోలీస్‌ కానిస్టేబుల్‌(సివిల్) - 3,697 ఉద్యోగాలు 
  • పోలీస్‌ కానిస్టేబుల్‌(AR)-1,052 పోస్టులు 
  • కానిస్టేబుల్‌(ఎస్‌ఏఆర్‌ సీపీఎల్)-24 పోస్టులు 
  • కానిస్టేబుల్‌(డ్రైవర్‌)- పీటీవో 20 పోస్టులు 
  • కానిస్టేబుల్‌(మెకానిక్‌)- పీటీవో- 7పోస్టులు 

నోటిఫికేషన్ ఎప్పుడు?

ప్రభుత్వం తాజాగా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో నియామక ప్రక్రియ వేగవంతం కానుంది. తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ తక్షణమే ఈ ఖాళీలను భర్తీ చేయడానికి సంబంధించి నోటిఫికేషన్ ,షెడ్యూల్‌ విడుదల చేయనుంది. 

నియామక ప్రక్రియ ఎలా ఉంటుంది?

ఈ నియామకాలను తెలంగాణ స్టేట్ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా నిర్వహిస్తారు. హోంశాఖ ప్రిన్సిప్‌ సెక్రటరీ, డీజీపీ ద్వారా స్థానిక కేడర్‌ వారీగా ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, అర్హతలు వంటి పూర్తి వివరాలను టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ సేకరిస్తుంది. బోర్డు త్వరలోనే పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ను జారీ చేసి, అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

Frequently Asked Questions

తెలంగాణలో ఎన్ని పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది?

తెలంగాణ ప్రభుత్వం 5,000 పోలీసు పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ద్వారా అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో శాంతి భద్రతలను మరింత మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ పోలీసు నియామక ప్రక్రియను ఎవరు నిర్వహిస్తారు మరియు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది?

తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSLPRB) ఈ నియామకాలను నిర్వహిస్తుంది. బోర్డు త్వరలోనే పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది.

భర్తీ చేయనున్న 5,000 పోస్టులలో ఏ రకాల ఉద్యోగాలు ఉన్నాయి?

ఈ 5,000 పోస్టులలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌ (SI) మరియు పోలీస్ కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాలు ఉన్నాయి. సివిల్ పోలీస్ నుండి టెక్నికల్ విభాగాల వరకు వివిధ రకాల పోస్టులు భర్తీ చేయబడతాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget