News
News
X

Telangana Jobs: తెలంగాణలో 20 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ.. త్వరలో నోటిఫికేషన్

Telangana Government Jobs: తెలంగాణలో 20 వేల పోలీసు ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి మహమూద్ అలీ ప్రకటించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు.

FOLLOW US: 

తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్ న్యూస్. రాష్ట్రంలోని పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. తెలంగాణలో త్వరలో 20 వేల పోలీసు నియమకాలను భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వివిధ విభాగాల్లో 80 వేలకు పైగా పోలీసు నియామకాలను చేపట్టినట్లు పేర్కొన్నారు. సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవన ప్రారంభోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మహిళా ప్రాధాన్య‌త‌లో భాగంగా నియామ‌కాల్లో 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించిన‌ట్లు గుర్తు చేశారు. తెలంగాణలో త్వరలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా ప్రభావం, జోనల్ వ్యవస్థ, ఎన్నికలు సహా పలు కారణాల వల్ల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం కరోనా ప్రభావం కాస్త తగ్గింది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలతో కొత్త జోన్ల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. దీంతో నియామక ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.  రాష్ట్ర పోలీసు శాఖలో ఇప్పటికే 19,449 పోస్టుల భర్తీకి అధికారులు ప్రతిపాదనలు పంపారు. వీటికి సర్కారు సైతం ఆమోదముద్ర వేసింది. అన్నీ అనుకూలంగా జరిగితే జూలై నెలాఖరుకు పోలీసు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. 
త్వరలో మరిన్ని పోస్టుల భర్తీ.. 
పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీ అనంతరం మరిన్ని శాఖలలో ఉద్యోగాలను సైతం భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. విద్య, వైద్య శాఖలలో కూడా అత్యధిక సంఖ్యలో ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో వాటికి సంబంధించిన నోటిపికేషన్ కూడా త్వరలోనే విడుదల చేయనుంది. వీటి తర్వాత గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం. టీఎస్‌పీఎస్‌సీ ద్వారా వీటిని భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. 

టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ నియామకం..
సుదీర్ఘ నిరీక్షణ అనంతరం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ )కి చైర్మన్, సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ గా డా. బి. జనార్దన్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. జనార్దన్ రెడ్డి ప్రస్తుతం వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా చేపడతామని జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. 

Published at : 02 Jul 2021 05:23 PM (IST) Tags: Telangana Government Jobs 2021 TS Jobs Notification TS Job 2021 Updates

సంబంధిత కథనాలు

NIDAP: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో ఖాళీలు, అర్హతలివే!

NIDAP: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో ఖాళీలు, అర్హతలివే!

Bank of Baroda Recruitment: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 346 ఉద్యోగాలు, డిగ్రీ అర్హత చాలు!

Bank of Baroda Recruitment: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 346 ఉద్యోగాలు, డిగ్రీ అర్హత చాలు!

UPSC APP: ఒక్క క్లిక్‌తో పూర్తి సమాచారం! అందుబాటులోకి యూపీఎస్సీ మొబైల్‌ యాప్‌!

UPSC APP: ఒక్క క్లిక్‌తో పూర్తి సమాచారం! అందుబాటులోకి యూపీఎస్సీ మొబైల్‌ యాప్‌!

APTET 2022 Result: ఏపీటెట్-2022 ఫలితాలు విడుదల, 58.07 శాతం అర్హత, ఇక్కడ చూసుకోండి!

APTET 2022 Result: ఏపీటెట్-2022 ఫలితాలు విడుదల, 58.07 శాతం అర్హత, ఇక్కడ చూసుకోండి!

APPSC: 'గ్రూపు-1' ఉద్యోగాలకు మళ్లీ ఇంటర్వ్యూలు, కారణమిదేనా!

APPSC: 'గ్రూపు-1' ఉద్యోగాలకు మళ్లీ ఇంటర్వ్యూలు, కారణమిదేనా!

టాప్ స్టోరీస్

Nagarjuna No Politics : విజయవాడ ఎంపీగా పోటీపై నాగార్జున క్లారిటీ - అంటే వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా ?

Nagarjuna No Politics :  విజయవాడ ఎంపీగా పోటీపై నాగార్జున క్లారిటీ - అంటే వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా ?

Revant Vs KTR : తెలంగాణ ఉద్యమంలో మీరెక్కడ ? సోషల్ మీడియాలో రేవంత్ వర్సెస్ కేటీఆర్ !

Revant Vs KTR :  తెలంగాణ ఉద్యమంలో మీరెక్కడ ? సోషల్ మీడియాలో రేవంత్ వర్సెస్ కేటీఆర్ !

68th National Film Awards: జాతీయ అవార్డుల ప్రధానోత్సవం - ఐదు అవార్డులతో ఓ మెరుపు మెరిసిన సూర్య, జ్యోతిక, ప్రత్యేక ఆకర్షణగా తమన్!

68th National Film Awards: జాతీయ అవార్డుల ప్రధానోత్సవం - ఐదు అవార్డులతో ఓ మెరుపు మెరిసిన సూర్య, జ్యోతిక, ప్రత్యేక ఆకర్షణగా తమన్!

JioPhone 5G Launch: రూ.8 వేలలోపే జియో 5జీ ఫోన్! - ఫీచర్లు కూడా లీక్!

JioPhone 5G Launch: రూ.8 వేలలోపే జియో 5జీ ఫోన్! - ఫీచర్లు కూడా లీక్!