అన్వేషించండి

Constables: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు గుడ్ న్యూస్, ట్రైనింగ్‌కు హాజరుకాలేకపోయిన వారికి మరో ఛాన్స్

TS Constable Training: తెలంగాణలో కానిస్టేబుల్‌ శిక్షణకు పలు కారణాలతో హాజరుకాలేకపోయిన అభ్యర్థులకు పోలీస్‌ అకాడమీ ఆహ్వానం పంపింది. వీరంతా జులై 22లోపు ఆయా శిక్షణ కేంద్రాల్లో రిపోర్టు చేయాలని కోరింది.

Telangana Constable Training | తెలంగాణలో కానిస్టేబుల్ శిక్షణకు ఎంపికై అనివార్య కారణాల వల్ల హాజరుకాలేక పోయిన 130 మంది అభ్యర్థులకు పోలీసు శాఖ శుభవార్త తెలిపింది. అభ్యర్థులకు మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు అదనపు డీజీ (ట్రైనింగ్) అభిలాష బిస్త్‌ ఒక ప్రకటనలో తెలిపారు. వీరికి జులై 22 నుంచి శిక్షణ నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి (TSLPRB) సివిల్ (Civil), ఏఆర్ (AR), రాష్ట్ర  (TGSP) విభాగాలలో ఉద్యోగాలకు అభ్యర్థులను TSLPRB ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థులకు గత ఫిబ్రవరిలో శిక్షణ ప్రారంభించారు. అయితే కొంతమంది అభ్యర్థులు పలు టెక్నికల్ కారణాల వల్ల శిక్షణకు హాజరుకాలేకపోయారు. అయితే జులై 22 నుంచి వీరికి శిక్షణ ప్రారంభంకానుంది. మొత్తం 9 నెలలు పాటు శిక్షణ కొనసాగనుంది. శిక్షణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లను ఆమె కోరారు. 

ఫిబ్రవరిలో ట్రైనింగ్ ప్రారంభం 
తెలంగాణలో మొత్తం 16,604 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2022 ఏప్రిల్‌లో నోటిఫికేషన్ జారీ కాగా.. 15,750 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇందులో 5,010 పోస్టులు టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. తెలంగాణలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు గత ఫిబ్రవరి 21 నుంచి శిక్షణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 28 కేంద్రాల్లో శిక్షణ నిర్వహించారు. హైదరాబాద్‌లోని రాజాబహదూర్ వెంకట్రామారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీతోపాటు టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్లు, పోలీస్ శిక్షణ కళాశాలలు, జిల్లా శిక్షణ కేంద్రాలు, నగర శిక్షణ కేంద్రాల్లో శిక్షణ ఇచ్చారు.

సివిల్, ఏఆర్, ఎస్‌ఏఆర్ సీపీఎల్, టీఎస్‌ఎస్‌పీ విభాగాలకు సంబంధించి మొత్తం 13,444 మంది కానిస్టేబుళ్లను ఎంపిక చేశారు. అయితే రాష్ట్రంలోని శిక్షణ కేంద్రాల్లో 11 వేల మందికి సరిపడా వసతులు మాత్రమే ఉన్నాయి. దీంతో టీఎస్‌ఎస్‌పీ విభాగానికి చెందిన 5,010 మందికి కానిస్టేబుళ్లకు తాత్కాలికంగా వాయిదా వేసి, మిగిలిన వారికి శిక్షణ ప్రారంభించారు.  ఆ తర్వాత వారికి శిక్షణ కొనసాగించారు. తాజాగా మిగిలిన వారికి శిక్షణకు సంబంధించిన పోలీసు నియామక బోర్డు కీలక ప్రకటన చేసింది. వివిధ కారణాలతో హాజరుకాని 130 మందికి రాష్ట్ర పోలీస్‌ అకాడమీ ఆహ్వానం పంపింది. వీరంతా ఈ నెల 22లోపు ఆయా శిక్షణ కేంద్రాల్లో రిపోర్టు చేయాలని కోరింది. 

గతేడాది కానిస్టేబుల్ మెయిన్ ఫలితాలు 
తెలంగాణలో కానిస్టేబుల్ మెయిన్ పరీక్షల ఫలితాలు గతేడాది మే 30న వెలువడిన సంగతి తెలిసిందే. తుది రాతపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నేపథ్యం(Back Ground), నేరచరిత్ర (Criminal Hostory) గురించి ఆరా తీసి ఎంపికైన వారి తుది జాబితాను పోలీసుశాఖ వెల్లడించింది. తుది ఫలితాలకు సంబంధించి ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ సివిల్, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్, ప్రొహిబిష‌న్, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు 98,218; ఎస్‌సీటీ ఎస్ఐ సివిల్ పోస్టుల‌కు 43,708; ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ ఐటీ అండ్ సీవో ఉద్యోగాల‌కు 4,564; ఎస్‌సీటీ ఎస్ఐ ఐటీ అండ్ సీవో పోస్టుల‌కు 729, ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ డ్రైవ‌ర్, డ్రైవ‌ర్ ఆప‌రేట‌ర్ ఉద్యోగాల‌కు 1,779; ఎస్‌సీటీ ఏఎస్ఐ ఎఫ్‌పీబీ ఉద్యోగాల‌కు 1,153; ఎస్‌సీటీ ఎస్ఐ పీటీవో ఉద్యోగాల‌కు 463, ఎస్‌సీటీ పీసీ మెకానిక్ పోస్టుల‌కు 238 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరి నుంచి 13,444 మంది కానిస్టేబుల్ శిక్షణకు పోలీసుశాఖ ఎంపిక చేసింది.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
APPSC Group 1 Scam SIT Report: ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
Anasuya Bharadwaj : నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
Embed widget