అన్వేషించండి

TS TET: 'టెట్' నిర్వహణపై భిన్నాభిప్రాయాలు, ముందుకెళితే ఉద్యమిస్తామంటున్న ఉపాధ్యాయసంఘాలు

తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీకి 'టెట్' రూపంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు టెట్‌ నిర్వహణ అనివార్యం కావడంతో 'టెట్' కసరత్తుపై అధికారులు దృష్టి సారించారు.

Telangana Teacher Eligibility Test (TET): తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీకి 'టెట్' రూపంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు టెట్‌ నిర్వహణ అనివార్యం కావడంతో ఇందుకు సంబంధించిన కసరత్తుపై అధికారులు దృష్టి సారించారు. అయితే దీనిపై ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వం మొండిగా 'టెట్‌' నిర్వహించే ఉద్యమించడానికి సైతం సిద్ధమంటూ కొన్ని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఒకవేళ టెట్‌ తప్పనిసరి అని భావిస్తే.. కొత్తవారితో కలిపి కాకుండా టీచర్ల వరకే అంతర్గత పరీక్ష నిర్వహించాలని మరికొన్ని సంఘాలు సూచిస్తున్నాయి. అయితే దీన్ని అంగీకరించేది లేదని 2012 తర్వాత నియమితులైన టీచర్లు స్పష్టం చేస్తున్నారు. అవసరమైతే కోర్టుకెళ్తామని చెబుతున్నారు. దీంతో విద్యాశాఖ అయోమయ స్థితిలో పడిపోయింది.

టెట్‌ అర్హత ఉన్నవారే టీచర్‌ పోస్టులకు అర్హులు..
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టాలన్నా, ప్రమోషన్లు కల్పించాలన్నా 'టెట్' ప్రామాణికంగా ఉంది. విద్యాహక్కు చట్టం కూడా ఇదే చెబుతోంది. కేంద్రం కూడా ఈ మేరకు నిబంధన విధించింది. ప్రమోషన్ల ప్రక్రియ ముగిస్తేగాని ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల సంఖ్యపై స్పష్టత ఉంటుంది. అప్పుడే మెగా డీఎస్‌ఈ చేపట్టడం సాధ్యమవుతుంది. ఇలా ఒకదానికి మరొకటి లింక్‌ ఉండటంతో సమస్య కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు మెగా డీఎస్సీ నిర్వహిస్తామన్న ప్రభుత్వ హామీ విషయంలో నిరుద్యోగుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇలా సంక్లిష్టంగా మారిన ఈ సమస్యపై త్వరలో చర్చించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రికి ఓ నివేదిక ఇచ్చే యోచనలో ఉన్నారు. 

విద్యాహక్కు చట్టం ఏం చెబుతోంది?
కేంద్ర ప్రభుత్వం 2010లో తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టం ప్రకారం టీచర్లుగా పనిచేయాలనుకునే వారు తప్పనిసరిగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) అర్హత సాధించాల్సి ఉంటుంది. ప్రమోషన్లకు కూడా దీన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. దీన్ని అమలుకు సంబంధించి నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్స్‌ ఎడ్యుకేషన్‌ (NCTE) 2012లో ఆదేశాలు జారీ చేసింది. అయితే 2012 కన్నా ముందు ఎక్కడా టెట్‌ లేదనే అభిప్రాయంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 'టెట్‌' తప్పనిసరి నుంచి మినహాయింపునిచ్చింది. ఇదే నిర్ణయం 2022 వరకు కొనసాగుతూ వచ్చింది. ప్రభుత్వ 2022లో ఉపాధ్యాయులకు ప్రమెషన్లు కల్పించేందుకు సిద్ధం కావడంతోనే అసలు సమస్య మొదలైంది. టెట్‌ అర్హత ఉన్న టీచర్లు కోర్టును ఆశ్రయించారు. దీంతో పదోన్నతులకు టెట్‌ తప్పనిసరి అని కోర్టు తీర్పు చెప్పింది. ఫలితంగా టెట్‌ పరీక్ష నిర్వహించడం విద్యాశాఖకు అనివార్యమైంది. రాష్ట్రంలోని సర్కారు బడుల్లో సుమారుగా 1.03 లక్షల మంది టీచర్లు పని చేస్తున్నారు. వీరిలో 2012 కంటే ముందు నియమితులైన వారు 80 వేల మంది ఉంటారు. మిగతా వాళ్లందనూ టెట్‌ అర్హత ఉన్నవాళ్లే ఉన్నారు. కాగా పదోన్నతులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని విద్యాశాఖ మరోసారి కోరినప్పటికీ నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్స్‌ ఎడ్యుకేషన్‌ నిరాకరించింది. 

సిలబస్‌పై ఆందోళ.. 
టెట్‌ రాయాల్సిన చాలామంది ఉపాధ్యాయుల్లో సిలబస్ రూపంలో ప్రతికూలత ఎదురవుతోంది. ప్రస్తుత సిలబస్‌ ప్రకారం పరీక్ష రాయడం కష్టమని వారంతా భావిస్తున్నారు. సర్వీస్‌లో ఉన్న టీచర్లు దశాబ్దాల తరబడి ఏదో ఒక సబ్జెక్టును మాత్రమే బోధిస్తున్నారు. మ్యాథమెటిక్స్ బోధించే టీచర్‌కు సైన్స్, సైన్స్‌ బోధించే టీచర్‌కు మ్యాథమెటిక్స్ అవగాహన ఉండే అవకాశం లేదు. మరోవైపు అన్ని సబ్జెక్టులపై పట్టు ఉంటే తప్ప టెట్‌ అర్హత పొందడం కష్టం. ఇప్పటి యువకులతో పరీక్షలో పోటీ పడలేమని వారు భావిస్తున్నారు. ఈ కారణంగానే టెట్‌ అనివార్యమైతే సులభంగా ఉండే డిపార్ట్‌మెంటల్‌ పరీక్ష మాదిరి ప్రత్యేకంగా నిర్వహించాలని కోరుతున్నారు. జనరల్‌ అభ్యర్థులకు 150 మార్కులకు 90 మార్కులు వస్తేనే అర్హత లభిస్తుంది. కాగా కోచింగ్‌ తీసుకున్నప్పటికీ బీఈడీ అభ్యర్థులు రాసే పేపర్‌–2లో ఓసీలు 5 శాతం మాత్రమే అర్హత సాధిస్తుండటం గమనార్హం. 

ఉపాధ్యాయ సంఘాల స్పందన ఇలా..
ఎన్నో ఏళ్లుగా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారికి టెట్‌ తప్పనిసరి చేయడం సహేతుకం కాదని, ఈ చట్టం తెచ్చినప్పుడే వ్యతిరేకించినట్లు టీపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.నాగిరెడ్డి తెలిపారు. ఈ ఒక్కసారైనా టెట్‌ లేకుండా పదోన్నతులు ఇవ్వాలని, కానీ టెట్‌నే కొలమానంగా భావిస్తే మాత్రం ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ఇదే విషయంపై టీఎస్‌యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి స్పందిస్తూ..  టెట్‌ నిర్వహణపై ప్రభుత్వమే ఆలస్యం చేసింది. ఈ కారణంగానే ప్రమోషన్లు రాకుండా ఆగిపోయాయి. శాఖాపరమైన టెట్‌ నిర్వహిస్తే ఇప్పటికే ఉపాధ్యాయులు అర్హత సాధించే వాళ్లు. టెట్‌ లేకుండా ముందుకుపోవడం కష్టమే. కాబట్టి ఉపాధ్యాయులు దీనికి సిద్ధంగా ఉండాలన్నారు. పీఆర్‌టీయూటీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి మట్లాడుతూ.. టెట్‌ అర్హత పొందకుండా పదోన్నతులు పొందడం కష్టమే. అయితే దీర్ఘకాలంగా పనిచేస్తున్న టీచర్లకు టెట్‌ పరీక్ష అంతర్గతంగా నిర్వహించాలి. ఇతర విద్యార్థులతో కాకుండా వేరుగా చేపట్టాలి. దీన్నో డిపార్ట్‌మెంటల్‌ టెస్ట్‌లా చేపడితే మేలని ప్రభుత్వానికి సలహా ఇచ్చారు.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ - రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలపై చర్చ
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ - రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలపై చర్చ
TGPSC Group1 Recruitment: తగ్గేదేలే అంటున్న టీజీపీఎస్సీ, 1:50 నిష్పత్తిలోనే 'గ్రూప్‌-1' మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక
తగ్గేదేలే అంటున్న టీజీపీఎస్సీ, 1:50 నిష్పత్తిలోనే 'గ్రూప్‌-1' మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక
Andhra Pradesh: కలకలం రేపుతున్న దస్త్రాలు దహనం ఘటన- కీలకంగా మారుతున్న డ్రైవర్‌ వాంగ్మూలం
కలకలం రేపుతున్న దస్త్రాలు దహనం ఘటన- కీలకంగా మారుతున్న డ్రైవర్‌ వాంగ్మూలం
Etvwin Web Series: ఈటీవీ విన్ ఓటీటీ కోసం... చంద్రశేఖర్ యేలేటి వెబ్ సిరీస్!
ఈటీవీ విన్ ఓటీటీ కోసం... చంద్రశేఖర్ యేలేటి వెబ్ సిరీస్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ - రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలపై చర్చ
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ - రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలపై చర్చ
TGPSC Group1 Recruitment: తగ్గేదేలే అంటున్న టీజీపీఎస్సీ, 1:50 నిష్పత్తిలోనే 'గ్రూప్‌-1' మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక
తగ్గేదేలే అంటున్న టీజీపీఎస్సీ, 1:50 నిష్పత్తిలోనే 'గ్రూప్‌-1' మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక
Andhra Pradesh: కలకలం రేపుతున్న దస్త్రాలు దహనం ఘటన- కీలకంగా మారుతున్న డ్రైవర్‌ వాంగ్మూలం
కలకలం రేపుతున్న దస్త్రాలు దహనం ఘటన- కీలకంగా మారుతున్న డ్రైవర్‌ వాంగ్మూలం
Etvwin Web Series: ఈటీవీ విన్ ఓటీటీ కోసం... చంద్రశేఖర్ యేలేటి వెబ్ సిరీస్!
ఈటీవీ విన్ ఓటీటీ కోసం... చంద్రశేఖర్ యేలేటి వెబ్ సిరీస్!
Bigg Boss 8 Telugu: తెలుగు బిగ్ బాస్ 8లో వేణు స్వామి - భారీ పారితోషికం డిమాండ్
తెలుగు బిగ్ బాస్ 8లో వేణు స్వామి - భారీ పారితోషికం డిమాండ్
Team India: 16 గంటల విమాన ప్రయాణంలో భారత క్రికెటర్లు ఏం చేశారంటే?
16 గంటల విమాన ప్రయాణంలో భారత క్రికెటర్లు ఏం చేశారంటే?
Anant Ambani: అనంత్ అంబానీ వాచ్ విలువ తెలిస్తే కళ్లు తేలేస్తారు, ప్రపంచం మొత్తం మీద 30 మాత్రమే ఉన్నాయట
అనంత్ అంబానీ వాచ్ విలువ తెలిస్తే కళ్లు తేలేస్తారు, ప్రపంచం మొత్తం మీద 30 మాత్రమే ఉన్నాయట
Bonalu in Hyderabad 2024: అమ్మకు బోనం.. ఆధ్యాత్మిక సంబురం మాత్రమే కాదు అంటు వ్యాధులు తరిమేసే ఆయుధం!
అమ్మకు బోనం.. ఆధ్యాత్మిక సంబురం మాత్రమే కాదు అంటు వ్యాధులు తరిమేసే ఆయుధం!
Embed widget