అన్వేషించండి

TS JCJ Recruitment: తెలంగాణలో 150 జూనియర్ సివిల్ జడ్జీ పోస్టులు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీస్‌లో జూనియర్ విభాగంలో సివిల్ జడ్జీ పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 150 ఖాళీలను భర్తీచేయనున్నారు.

AP High Court Recruitment: తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీస్‌లో జూనియర్ విభాగంలో సివిల్ జడ్జీ పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 150 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఇందులో 2024 సంవత్సరానికి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 31 ఖాళీలు, బదిలీల ద్వారా 15 ఖాళీలను భర్తీచేయనున్నారు. అదేవిధంగా 2024, 2025 సంవత్సరాలకుగాను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన (ఫ్యూచర్‌/ యాంటిసిపేటెడ్‌) 90 ఖాళీలు, బదిలీల (ఫ్యూచర్‌/ యాంటిసిపేటెడ్‌) ద్వారా 14 ఖాళీలు భర్తీ కానున్నాయి.

తెలంగాణ జ్యుడీషియల్ నియమ నిబంధనల ప్రకారం నిర్ధేశించిన అర్హతలు కలిగి ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 17లోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. స్క్రీనింగ్ టెస్ట్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), రాత పరీక్ష, వైవా-వాయిస్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో పరీక్ష నిర్వహిస్తారు.

వివరాలు.. 

* జూనియర్ సివిల్ జడ్జీ (JCJ) పోస్టులు

ఖాళీల సంఖ్య: 150.

➥ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా: 31 పోస్టులు

➥ ట్రాన్స్‌ఫర్ ద్వారా : 15 పోస్టులు

➥ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ (ఫ్యూచర్‌/ యాంటిసిపేటెడ్‌) ద్వారా : 90 పోస్టులు

➥ ట్రాన్స్‌ఫర్ (ఫ్యూచర్‌/ యాంటిసిపేటెడ్‌) ద్వారా: 14 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్ లా డిగ్రీ అర్హత ఉండాలి. మూడేళ్ల పాటు అడ్వకేట్ లేదా ప్లీడర్‌గా ప్రాక్టీస్ చేసి ఉండాలి. తెలంగాణ జ్యుడీషియల్ నియమ నిబంధనల ప్రకారం నిర్ధేశించిన అర్హతలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్థులు 10.04.2024 నాటికి 23 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), రాత పరీక్ష, వైవా-వాయిస్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

పరీక్ష విధానం..

➥ మొత్తం 100 మార్కులకు స్క్రీనింగ్ టెస్ట్ (సీబీటీ) నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నలకు ఒకమార్కు కేటాయించారు. పరీక్ష సమయం 2 గంటలు. 

➥ స్క్రీనింగ్ పరీక్షలో 40 % లేదా ఆపై మార్కులు సాధించిన అభ్యర్థుల్లో 1:10 నిష్పత్తిలో రాతపరీక్షకు ఎంపికచేస్తారు. రాతపరీక్షలో మొత్తం మూడు పేపర్లు (సివిల్ లా, క్రిమినల్ లా, ఇంగ్లిష్ ట్రాన్స్‌లేషన్) ఉంటాయి. ఒక్కో పేపరుకు 100 మార్కుల చొప్పున, మూడు పేపర్లుకు 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిష్ ట్రాన్స్‌లేషన్ పేపర్‌లో 25 మార్కులకు ట్రాన్స్‌లేషన్, 75 మార్కులు ఎస్సే రైటింగ్ ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లిష్‌లోకి వ్యాసాలు రాయాల్సి ఉంటుంది.

➥ రాతపరీక్షలో కనీస అర్హత మార్కులను ఓసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 60 శాతంగా (ఒక్కో పేపరులో కనీసం 55 శాతం మార్కులు), బీసీలకు 55 శాతంగా (ఒక్కో పేపరులో కనీసం 50 శాతం మార్కులు), ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులకు 50 శాతంగా (ఒక్కో పేపరులో కనీసం 45 శాతం మార్కులుగా నిర్ణయించారు.   

వైవా-వాయిస్: మొత్తం 30 మార్కులకు వైవా-వాయిస్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ పరీక్షకు హాజరుకాని వారిని ఉద్యోగ ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి 1:3 నిష్పత్తిలో వైవా-వాయిస్‌కు అభ్యర్థులను ఎంపికచేస్తారు. అర్హత మార్కులుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 40 శాతం మార్కులు, ఇతరులు 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. 

జీత భత్యాలు: నెలకు జీతం 77,840 నుంచి 1,36,520 వరకు అందుకోవచ్చు.

స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష కేంద్రాలు:హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం.

ముఖ్యమైన తేదీలు: 

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 17.05.2024.

➥ స్క్రీనింగ్ టెస్ట్ హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్ ప్రారంభం: 08.06.2024.

➥ కంప్యూటర్ ఆధారిత స్క్రీనింగ్ పరీక్ష తేదీ: 16.06.2024.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Deepfake Scam: డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
Balayya - Venky : అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Embed widget