Gurukula Exams: ముగిసిన గురుకుల నియామక పరీక్షలు, నెలాఖరులోగా ఫలితాల వెల్లడి!
మొదట డిగ్రీ, జూనియర్ లెక్చరర్, తరువాత పీజీటీ, టీజీటీ పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. అక్టోబరు నెలాఖరు నాటికి నియామకాలు పూర్తిచేయాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది.
తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో 9210 పోస్టుల భర్తీకి నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు ఆగస్టు 23తో ముగిశాయి. ఆగస్టు 1న పరీక్షలు ప్రారంభంకాగా.. 19 రోజులపాటు జరిగిన పరీక్షలు ఆగస్టు 23న ప్రశాంతంగా ముగిశాయి. ఈ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 2.66 లక్షల మంది దరఖాస్తు చేశారు. మొత్తం 17 జిల్లాల్లోని 104 కేంద్రాల్లో రోజుకు మూడుషిప్టుల చొప్పున రాతపరీక్షల్ని గురుకుల నియామకబోర్డు నిర్వహించింది. వీటికి సగటున 75.68 శాతం మంది హాజరైనట్లు బోర్డు కార్యనిర్వహణాధికారి మల్లయ్యభట్టు ఒక ప్రకటనలో తెలిపారు.
వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లు..
గురుకుల పరీక్షలకు సంబంధించిన మాస్టర్ ప్రశ్నపత్రాలు, అభ్యర్థుల సమాధానాలు, ప్రాథమిక 'కీ'ని అధికారిక వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు మల్లయ్యభట్టు పేర్కొన్నారు. అభ్యర్థులు లాగిన్ వివరాలు నమోదుచేసి సమాధానాలు సరిచూసుకోవాలని తెలిపారు. ప్రాథమిక 'కీ'పై అభ్యంతరాలుంటే ఆగస్టు 25న సాయంత్రం 5గంటల్లోగా తెలపాలని సూచించారు. అభ్యంతరాలు లాగిన్ ఐడీ ద్వారా మాత్రమే తెలపాలని, ఈ-మెయిల్, వ్యక్తిగత, రాతపూర్వక అభ్యంతరాలు స్వీకరించబోమని స్పష్టం చేశారు. అయితే ఆగస్టు 21, 22, 23 తేదీల్లో జరిగిన పరీక్షలకు సంబంధించి అభ్యర్థుల సమాధానాలు, ప్రాథమిక కీ ఆగస్టు 24న మధ్యాహ్నానికి అందుబాటులోకి వస్తాయని బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షల ప్రాథమిక కీపై ఆగస్టు 26 సాయంత్రంలోగా అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుంది. ఆగస్టు 1న జరిగిన ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ల పరీక్షలపై న్యాయవివాదం నెలకొంది. ఇది పరిష్కారమైన తరువాత వాటి ప్రాథమిక కీ, అభ్యర్థుల సమాధానాల్ని బోర్డు పొందుపరచనుంది.
అక్టోబరు నాటికి నియామక ప్రక్రియ పూర్తి..
ప్రాథమిక కీపై అభ్యంతరాలు తీసుకుని, వాటిని పరిశీలించి రెండు రోజుల్లోగా తుది కీలను బోర్డు ప్రకటించనుంది. అభ్యర్థికి ఎన్నిమార్కులొచ్చాయో కూడా వెల్లడించనుంది. ఉన్నతస్థాయి పోస్టుల నుంచి కిందిస్థాయి పోస్టులకు అవరోహణ క్రమంలో నియామక ప్రక్రియ పూర్తిచేయనుంది. తొలుత డిగ్రీ, జూనియర్ లెక్చరర్, తరువాత పీజీటీ, టీజీటీ పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. అక్టోబరు నెలాఖరు నాటికి నియామకాలు పూర్తిచేయాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది.
ALSO READ:
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 63 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 63 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ, బీకామ్, బీబీఎం, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 05 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 45 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్ కార్యాలయాలు/ యూనిట్లలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 45 మేనేజ్‌మెంట్ ట్రైనీ, వెల్ఫేర్ ఆఫీసర్, జేఎం పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..