(Source: Poll of Polls)
SVNIRTAR: ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్- కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 నోటిఫికేషన్, పరీక్ష తేదీ ఎపుడంటే
ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్ 2024-25 విద్యా సంవత్సరానికి బీపీటీ, బీఓటీ, బీపీవో, బీఏఎస్ఎల్పీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ‘కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
స్వామి వివేకానంద నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ & రీసెర్చ్ 2024-25 విద్యా సంవత్సరానికి బీపీటీ, బీఓటీ, బీపీవో, బీఏఎస్ఎల్పీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ‘కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ఎన్‌ఏఎల్‌డీ(కోల్‌కతా), ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్(కటక్), ఎన్‌ఐఈపీఎండీ(చెన్నై), పీడీయూఎన్‌ఐపీపీడీ(న్యూదిల్లీ), సీఆర్‌సీఎస్‌ఆర్‌ఈ(గువాహటి)లో ప్రవేశాలు పొందవచ్చు. కనీసం 50% మార్కులతో పన్నెండో తరగతి/ 10+2(సైన్స్ సబ్జెక్టులు- ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/ మ్యాథమెటిక్స్) లేదా తత్సమానం ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం సీట్ల సంఖ్య: 443.
ఇన్‌స్టిట్యూట్ వివరాలు..
➥ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లోకోమోటర్ డిజేబిలిటీస్ (దివ్యాంగ్‌జన్), కోల్‌కతా (ఎన్‌ఏఎల్‌డీ)
➥ స్వామి వివేకానంద నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ (ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్), కటక్
➥ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజెబిలిటీస్ (ఎన్‌ఐఈపీఎండీ), చెన్నై
➥ పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజేబిలిటీస్ (పీడీయూఎన్‌ఐపీపీడీ), న్యూఢిల్లీ
➥ కంపోజిట్ రీజినల్ సెంటర్ ఫర్ స్కిల్ డెవలప్‌మెంట్, రిహాబిలిటేషన్ అండ్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ (సీఆర్‌సీఎస్‌ఆర్‌ఈ), గువాహటి
అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు..
➤ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ): 4 సంవత్సరాల 6 నెలల ఇంటర్న్‌షిప్
➤ బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ (బీవోటీ): 4 సంవత్సరాల 6 నెలల ఇంటర్న్‌షిప్
➤ బ్యాచిలర్ ఆఫ్ ప్రోస్థెటిక్స్ అండ్ ఆర్థోటిక్స్ (బీపీవో): 4 సంవత్సరాల 6 నెలల ఇంటర్న్‌షిప్
➤ బ్యాచిలర్ ఇన్ అడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ (బీఏఎస్‌ఎల్‌పీ): 4 సంవత్సరాలు(ఏడాది ఇంటర్న్‌షిప్‌తో సహా)
అర్హత: కనీసం 50% మార్కులతో పన్నెండో తరగతి/ 10+2(సైన్స్ సబ్జెక్టులు- ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/ మ్యాథమెటిక్స్) లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: కనీసం 17 ఏళ్లు ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.800. మిగతా కేటగిరీలకు రూ.1000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: సికింద్రాబాద్, విజయవాడ.
ముఖ్యమైన తేదీలు..
🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.05.2024.
🔰 అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ తేదీ: 04.06.2024.
🔰 ప్రవేశ పరీక్ష తేదీ: 23.06.2024.
🔰 ఫలితాల ప్రకటన: 05.07.2024
Notification
ALSO READ:
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎపుడంటే
AAI Recruitment 2024: న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా- దేశ వ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ గేట్- 2024 స్కోరు కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 1వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. గేట్ 2024 స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.