SBI Clerk Admit Card: ఎస్‌బీఐ మెయిన్ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! పరీక్ష ఎప్పుడంటే?
ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్/రోల్ నెంబర్, పాస్‌వర్డ్/పుట్టినతేది వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు పొందవచ్చు.

ఎస్‌బీఐ క్లర్క్-2025(జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) క్లరికల్ కేడర్) మెయిన్ పరీక్ష అడ్మిట్ కార్డులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. క్లర్క్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్/రోల్ నెంబర్, పాస్‌వర్డ్/పుట్టినతేది వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు పొందవచ్చు. ఏప్రిల్ 12 వరకు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉండనున్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 10, 12 తేదీల్లో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
ఎస్‌బీఐ క్లర్క్(Junior Associate) ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల విడుదలైన సంగతి తెలిసిందే. ప్రిలిమినరీ పరీక్షలు ఫిబ్రవరి 22, 27, 28, మార్చి 1వ తేదీన జరిగాయి. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో 13,735 జూనియర్ అసోసియేట్స్ (క్లరికల్ కేడర్) పోస్టులను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్‌లో 342; అమరావతి సర్కిల్‌లో 50 పోస్టులు ఉన్నాయి.
మెయిన్ ఎగ్జామ్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
వివరాలు....
* జూనియర్ అసోసియేట్స్ (క్లరికల్ కేడర్) పోస్టులు
ఖాళీల సంఖ్య: 13,735 పోస్టులు
రాష్ట్రాల వారీగా ఖాళీలు: గుజరాత్- 1073, ఆంధ్రప్రదేశ్- 50, కర్ణాటక- 50, మధ్యప్రదేశ్- 1317, ఛత్తీస్‌గఢ్- 483, ఒడిశా- 362, హరియాణా- 306, జమ్ము & కశ్మీర్ యూటీ- 141, హిమాచల్ ప్రదేశ్- 170, చండీగఢ్ - 32, లడఖ్ యూటీ- 32, పంజాబ్- 569, తమిళనాడు- 336, పుదుచ్చేరి- 04, తెలంగాణ- 342, రాజస్థాన్- 445, పశ్చిమ బెంగాల్- 1254, అండమాన్ & నికోబార్ దీవులు- 70, సిక్కిం- 56, ఉత్తర్‌ప్రదేశ్- 1894, మహారాష్ట్ర- 1163, గోవా- 20, దిల్లీ- 343, ఉత్తరాఖండ్- 316, అరుణాచల్ ప్రదేశ్- 66, అస్సాం- 311, మణిపుర్- 55, మేఘాలయ- 85, మిజోరం- 40, నాగాలాండ్- 70, త్రిపుర- 65, బిహార్- 1111, జార్ఖండ్- 676, కేరళ- 426, లక్షద్వీప్- 02.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
మెయిన్ పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 190 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో మొత్తం నాలుగు విభాగాలు ఉంటాయి. ఇందులో జనరల్/ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులు; జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు-40 మార్కులు; క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-50 మార్కులు; రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటల 40 నిమిషాలు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ఏపీలో అనంతపురం, గుంటూరు/ విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం; తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లో పరీక్షలు నిర్వహిస్తారు.
బేసిక్ పే: నెలకు రూ.26,730.

ముఖ్యమైన తేదీలు..
➥ మెయిన్ పరీక్ష తేదీలు: ఏప్రిల్ 10, 12.
➥ కాల్ లెటర్ డౌన్‌లోడ్ ప్రారంభం: 29.03.2025.
➥ కాల్ లెటర్ డౌన్‌లోడ్‌కు చివరితేదీ: 12.04.2025.
SBI Clerks 2024 నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..





















