అన్వేషించండి

CHSL Admit Card: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌-2023 'టైర్‌-2' అడ్మిట్‌ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే 'కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌(సీహెచ్‌ఎస్‌ఎల్‌)-2023' టైర్‌-2 రాతపరీక్ష అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి.

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే 'కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌(సీహెచ్‌ఎస్‌ఎల్‌)-2023' టైర్‌-2 రాతపరీక్ష అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. అడ్మిట్‌ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.  ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబర్‌ 2న  దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఏర్పాటుచేసిన కేంద్రాల్లో టైర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. టైర్-2 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో కంప్యూటర్‌ టెస్ట్‌/ టైపింగ్‌ టెస్ట్‌, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. 

సీహెచ్‌ఎస్‌ఎల్‌ పరీక్ష హాల్‌టికెట్ల (సదరన్ రీజియన్) కోసం క్లిక్ చేయండి..

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 1762 ఖాళీల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మే నెలలో సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ-2023 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో లోయర్‌ డివిజనల్‌ క్లర్క్, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 2 నుంచి 17 వరకు 'టైర్‌-1' ఆన్‌లైన్ పరీక్షను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నిర్వహించింది. ఈ పరీక్ష ఫలితాలను సెప్టెంబరు 28న విడుదల చేసింది. ఈ ఫలితాల్లో ఎల్‌‌డీసీ/జేఎస్‌ఏ పోస్టులకు సంబంధించి 17,495 మంది అభ్యర్థులు, డీఈఓ (కాగ్/సీఏఎఫ్‌పీడీ) పోస్టులకు సంబంధించి 754 మంది అభ్యర్థులు, డీఈఓ (కాగ్/సీఏఎఫ్‌పీడీ మినహాయించి) పోస్టులకు సంబంధించి 1307 మంది అభ్యర్థులు టైర్-2 పరీక్షలకు అర్హత సాధించారు. 

Also Read:  ఎయిమ్స్ భోపాల్‌లో 357 ఖాళీలు - అర్హతలు, ఎంపిక విధానం ఇలా

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి ఉద్దేశించిన కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2023(సీహెచ్‌ఎస్‌ఎల్‌)కు పోస్టుల సంఖ్య పెంచినట్లు సెప్టెంబరు 26న ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుత పోస్టులకు అదనంగా 162 పోస్టులను చేర్చింది. దీంతో గతంలో ఖాళీల సంఖ్య 1,600 ఉండగా.. తాజాగా మొత్తం ఖాళీల సంఖ్య 1,762 కి చేరింది. 

'టైర్-2' పరీక్ష విధానం..
CHSL Admit Card: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌-2023 'టైర్‌-2' అడ్మిట్‌ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Also Read: భెల్‌లో 75 సూపర్‌వైజర్ ట్రైనీ ఉద్యోగాల దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్ పరీక్ష విధానం..

✦  టైర్-2 పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు టైర్-3లో స్కిల్‌టెస్ట్/ టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత ప‌రీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కుల‌ను తుది ఎంపిక‌లో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు.

✦ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు.. డేటా ఎంట్రీ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కాల వ్యవధి 15 నిమిషాలు. డేటా ఎంట్రీ పోస్టుల‌కు గంట‌కు 8000 కీ డిప్రెష‌న్స్ కంప్యూట‌ర్‌పై ఇవ్వాలి. ఇందుకోసం సుమారు 2000-2200 కీ డిప్రెష‌న్స్ ఉన్న ఇంగ్లిష్ వ్యాసాన్ని ఇచ్చి 15 నిమిషాల వ్యవ‌ధిలో కంప్యూట‌ర్‌లో టైప్ చేయ‌మంటారు.

✦ లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. పరీక్ష సమయం 10 నిమిషాలు. టైపింగ్ టెస్ట్‌లో ఇంగ్లిష్ ఎంచుకున్నవారు నిమిషానికి 35 ప‌దాలు, హిందీని ఎంచుకున్నవారు నిమిషానికి 30 ప‌దాలు టైప్ చేయాలి.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Politics: కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
Heatwave Heart Care : వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
Film Development Corporation : AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
Hyderabad News: క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు

వీడియోలు

Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
Shreyas Iyer LSG vs PBKS Do or Die Match | మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శ్రేయస్
IPL Playoff Race PBKS, RR, KKR | నాలుగో స్థానం కోసం మూడుముక్కలాట
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics: కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
Heatwave Heart Care : వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
Film Development Corporation : AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
Hyderabad News: క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
Crime Thriller OTT : వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Guntur Crime News: పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
Peddi: 'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
Embed widget