అన్వేషించండి

SSC Stenographer Answer Key 2022: స్టెనోగ్రాఫర్ ఆన్సర్ కీ విడుదల, రెస్పాన్స్ షీట్లు కూడా అందుబాటులో! అభ్యంతరాలకు 4 రోజులు గడువు!

ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థులు తమ రూల్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లు పొందవచ్చు.

స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి, డి ఎగ్జామినేషన్-2022 'పేపర్-1' ప్రాథమిక కీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నవంబరు 24న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థులు తమ రూల్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లు పొందవచ్చు. స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నవంబరు 17, 18 తేదీల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. నవంబరు 24న సాయంత్రం 5 గంటల నుంచి నవంబరు 28న సాయంత్రం 5 గంటల వరకు ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఆన్సర్ కీపై అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే తెలపవచ్చు. నవంబరు 24న సాయంత్రం 5 గంటల నుంచి నవంబరు 28న సాయంత్రం 5 గంటల వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు అభ్యంతరాలు తెలిపే ప్రతి ప్రశ్నకు రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా వచ్చిన అభ్యంతరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.  

ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్స్, అభ్యంతరాల నమోదు కోసం క్లిక్ చేయండి..

స్టాఫ్ సెలక్షన్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ఆగస్టు 20న స్టెనోగ్రాఫ‌ర్ ఎగ్జామినేష‌న్ - 2022 ప్రక‌ట‌న‌ను విడుద‌ల చేసింది. దీనిద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల్లో స్టెనోగ్రాఫ‌ర్ (గ్రేడ్-సి, గ్రేడ్-డి) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ విద్యార్హత ఉండి,  టైపింగ్ తెలిసిన అభ్యర్థుల నుంచి ఆగస్టు 20 నుంచి సెప్టెంబరు 5 వరకు దరఖాస్తులు స్వీకరించింది. సెప్టెంబరు 7న దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించింది. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో స్కిల్ టెస్ట్, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది నియామకాలు చేపడతారు.

నోటిఫికేషన్, పరీక్ష విధానం తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

Also Read:

జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పేపర్-2 పరీక్ష తేదీ వెల్లడి, ఎప్పుడంటే?
కేంద్రప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి నిర్వహించినున్న పేపర్-2 ఎగ్జామినేషన్ తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నవంబరు 23న వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 11న పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. పేపర్-1 పరీక్షలో అర్హత సాధించిన 3,224 మంది అభ్యర్థులు పేపర్-2 పరీక్ష రాయడానికి అర్హులు. వాస్తవానికి డిసెంబరు 4న పరీక్ష నిర్వహించాలని మొదట భావించారు. కానీ డిసెంబరు 11న నిర్వహించనున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
పరీక్ష పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

కానిస్టేబుల్‌ పరీక్ష మార్కుల వివరాలు వెల్లడి, ఇలా చూసుకోండి!
కేంద్ర సాయుధ బలగాలైన సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు ఫోర్స్, సెక్రటేరియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, రైఫిల్‌మెన్‌ ఇన్‌ అసోం రైఫిల్స్‌, ఎన్‌ఐఏలో కానిస్టేబుల్‌(జీడీ) నియామక పరీక్ష-2021 ఫలితాల తుది మార్కుల జాబితాను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నవంబర్ 23న వెల్లడించింది. పరీక్ష ఫలితాలను నవంబర్ 7న విడుదల చేసిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థుల తుది మార్కులను ఎస్‌ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. పరీక్ష రాసిన అభ్యర్థులు వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ద్వారా మార్కులను చూసుకోవచ్చు. ఈ అవకాశం డిసెంబర్ 7 వరకు అందుబాటులో ఉంటుంది.
మార్కుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Vijayawada Gold Smuggling: విజయవాడలో రూ.5.84 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీ సీజ్.. బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు
విజయవాడలో రూ.5.84 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీ సీజ్.. బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు
CM Chandrababu: రప్పా రప్పా అంటూ రౌడీయిజం చేస్తే తాట తీయండి.. ఖాకీ అంటే బాధ్యత, భరోసా: సీఎం చంద్రబాబు
రప్పా రప్పా అంటూ రౌడీయిజం చేస్తే తాట తీయండి.. ఖాకీ అంటే బాధ్యత, భరోసా: సీఎం చంద్రబాబు
Vizianagaram Municipal Corporation Election: విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల తేదీలో మార్పు.. కలెక్టర్ లేఖతో ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం
విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల తేదీలో మార్పు.. కలెక్టర్ లేఖతో ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Vijayawada Gold Smuggling: విజయవాడలో రూ.5.84 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీ సీజ్.. బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు
విజయవాడలో రూ.5.84 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీ సీజ్.. బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు
CM Chandrababu: రప్పా రప్పా అంటూ రౌడీయిజం చేస్తే తాట తీయండి.. ఖాకీ అంటే బాధ్యత, భరోసా: సీఎం చంద్రబాబు
రప్పా రప్పా అంటూ రౌడీయిజం చేస్తే తాట తీయండి.. ఖాకీ అంటే బాధ్యత, భరోసా: సీఎం చంద్రబాబు
Vizianagaram Municipal Corporation Election: విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల తేదీలో మార్పు.. కలెక్టర్ లేఖతో ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం
విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల తేదీలో మార్పు.. కలెక్టర్ లేఖతో ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం
FCRI Admissions 2026: ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!
ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!
Down Payment లేకుండా Jawa లేదా Yezdi Bikes ఇంటికి తీసుకెళ్లవచ్చు.. స్పెషల్ ఆఫర్లు
Down Payment లేకుండా Jawa లేదా Yezdi Bikes ఇంటికి తీసుకెళ్లవచ్చు.. స్పెషల్ ఆఫర్లు
Graduate MLC Election: తొలిసారి ఎన్నికల బరిలోకి కవిత పార్టీ.. తొలి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన
తొలిసారి ఎన్నికల బరిలోకి కవిత పార్టీ.. తొలి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన
Andhra Pradesh Odisha Border Dispute: ఒడిశాలో ఆంధ్రా గో బ్యాక్ నినాదం - కోటియా సరిహద్దు రచ్చ వెనుక అసలు నిజాలు ఇవే!
ఒడిశాలో ఆంధ్రా గో బ్యాక్ నినాదం - కోటియా సరిహద్దు రచ్చ వెనుక అసలు నిజాలు ఇవే!
Embed widget