అన్వేషించండి

TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో అరెస్ట్, న్యూజిలాండ్ నుంచి వచ్చి చంచల్‌గూడ జైలుకు

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో తాజాగా మరో నిందితుడి అరెస్ట్ నమోదైంది. న్యూజిలాండ్‌ నుంచి వచ్చిన సాన ప్రశాంత్‌ (31) అనే వ్యక్తిని నగర సీసీఎస్‌/సిట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో తాజాగా మరో నిందితుడి అరెస్ట్ నమోదైంది. న్యూజిలాండ్‌ నుంచి వచ్చిన సాన ప్రశాంత్‌ (31) అనే వ్యక్తిని నగర సీసీఎస్‌/సిట్‌ పోలీసులు శనివారం (నవంబర్‌ 4) అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ ఈ కేసులో అరెస్ట్‌ అయిన వారి సంఖ్య 100 మందికి పైకి చేరింది. సిట్‌ అధికారులు అరెస్ట్‌ చేసిన వారిలో అధిక మంది విద్యార్ధులే ఉండటం విశేషం. వీరందరిపై ఐపీసీలోని 381, 409, 420, 411, 120 (బీ), 201తో పాటు ఐటీ యాక్ట్‌లోని వివిధ సెక్షన్ల కింద సిట్ ఆధికారులు కేసులు నమోదు చేశారు.

ఇంతకు ఈ ప్రశాంత్ ఎవరు?
తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ కార్యాలయంలో నెట్‌వర్క్‌ అడ్మిన్‌గా పనిచేసిన రాజశేఖర్‌రెడ్డికి స్వయానా బావమరిది ఈ ప్రశాంత్. న్యూజిలాండ్‌లో ఉద్యోగం చేస్తున్న తన బావమరిదికి కూడా క్వశ్చన్ పేపర్ చేరవేశాడు. గ్రూప్‌-1 ప్రశ్నపత్రం చేరవేసిన తర్వాత అతను పరీక్షకు సిద్ధంమై పరీక్ష కూడా రాశాడు. రెండు రోజుల క్రితం నిందితుడు ప్రశాంత్‌ న్యూజిలాండ్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చాడు. సమాచారం అందుకున్న సిట్‌ పోలీసులు విమానాశ్రయంలోనే అతన్ని అరెస్ట్‌ చేసి నవంబరు 4న కోర్టు ఎదుట హాజరుపరిచారు. విచారించిన న్యాయస్థానం రిమాండ్‌ విధించటంతో చంచల్‌గూడ జైలుకు నిందితుడిని తరలించినట్లు అధికారులు మీడియాకు తెలిపారు.

కాగా తెలంగాణలో సంచలం సృష్టించిన ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ప్రవీణ్‌, రాజశేఖర్‌ రెడ్డిలను కీలక నిందితులుగా పోలీసులు దర్యాప్తులో గుర్తించిన సంగతి తెలిసిందే. వీరు ప్రశ్నాపత్రాలను పలువురు అభ్యర్థులకు అమ్మి, వారి నుంచి భారీ మొత్తంలో వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసిన అభ్యర్థులు, దళారులను గుర్తించిన అధికారులు వారందరినీ అరెస్ట్‌ చేసి కటకటాల వెనుక వేశారు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్‌కు కూడా సిట్‌ పోలీసులు నోటీసులు పంపారు. అయితే అతని నుంచి సరైన సమాధానం రాకపోవటంతో లుక్‌ ఔట్‌ నోటీసులు (ఎల్‌వోసీ) జారీ చేశారు. దీంతో అతను తాజాగా రాష్ట్రానికి రావడంతో అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ప్రధాన నిందితుడు రమేష్ ఏఈఈ, డీఏవో పరీక్షకు సంబంధించిన సమారు 25 ప్రశ్నపత్రాలను పలువురికి విక్రయించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా ఏఈఈ పరీక్షలో ఏడుగురు అభ్యర్థులకు పరీక్ష హాల్‌లోకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జట్స్ ద్వారా డీఈ రమేష్ సమాధానాలు అందించినట్లు దర్యాప్తులో అధికారులు వెల్లడించారు. నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌ రెడ్డి గ్రూప్‌ 1తో సహా పలు ప్రశ్నాపత్రాలను లీక్‌ చేయడంతో చీమల పుట్ట మాదిరి దర్యాప్తు చేసే కొద్ది నిందితుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది.

ఈ కేసును అధికారులు విచారణ చేసినప్పటి నుంచి రోజుకో కొత్త విషయం బయటకి వస్తుంది. నిందితులు ఒకరి తర్వాత ఒకరు బయట పడుతున్నారు. చివరకి ఈ కేసులో ఎంత మంది ఉన్నారో తెలియాల్సి ఉంది. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు ఇప్పటివరకు 100 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా ఎన్ని అరెస్టులు ఉంటాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. సిట్ విచారణ కొనసాగుతూనే ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

UGC NET 2026 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలివే
UGC NET 2026 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలివే
SSC Results 2026: పదతరగతి ఫెయిల్ అయినా పిలిచి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారు! పూర్తి వివరాలు ఇవే!
పదతరగతి ఫెయిల్ అయినా పిలిచి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారు! పూర్తి వివరాలు ఇవే!
Oracle layoffs: ఇప్పుడు ఒరాకిల్ వంతు - 20వేల మంది సీనియర్లకు ఊస్టింగ్ - ఏఐ మింగేస్తోంది!
ఇప్పుడు ఒరాకిల్ వంతు - 20వేల మంది సీనియర్లకు ఊస్టింగ్ - ఏఐ మింగేస్తోంది!
8th Pay Commission: కనీస వేతనం 4 రెట్లు పెంచాలని డిమాండ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారా ?
కనీస వేతనం 4 రెట్లు పెంచాలని డిమాండ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారా ?

వీడియోలు

RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్
Starc vs Yashasvi Jaiswal IPL 2026 | 6 ఇన్నింగ్స్.. 4 సార్లు అవుట్ అయిన జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rs 1 Lakh Reward: కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష .. తెలంగాణ పోలీసుల ప్రకటన
Rs 1 Lakh Reward: కరీంనగర్ దొంగల ఆచూకీ చెబితే 1 లక్ష .. తెలంగాణ పోలీసుల ప్రకటన
IPL 2026 KKR VS SRH Result Update: బ్యాటింగ్ వైఫ‌ల్యంతో స‌న్ కు ఓట‌మి.. రాణించిన హెడ్, ఆక‌ట్టుకున్న వ‌రుణ్, ర‌ఘువంశీ, ర‌హానే, KKR హ్యాట్రిక్స్ విన్
బ్యాటింగ్ వైఫ‌ల్యంతో స‌న్ కు ఓట‌మి.. రాణించిన హెడ్, ఆక‌ట్టుకున్న వ‌రుణ్, ర‌ఘువంశీ, ర‌హానే, KKR హ్యాట్రిక్స్ విన్
Akividu Rama Temple: ఆకివీడులో రామాలయ నిర్మాణానికి రఘురామ శంకుస్థాపన.. 8 శతాబ్దాలు నిలిచేలా కృష్ణ శిలతో
ఆకివీడులో రామాలయ నిర్మాణానికి రఘురామ శంకుస్థాపన.. 8 శతాబ్దాలు నిలిచేలా కృష్ణ శిలతో
Hyderabad Viral Video: బైక్‌ను ఢీకొట్టి, కారు బానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. హైదరాబాద్‌లో దారుణం
బైక్‌ను ఢీకొట్టి, కారు బానెట్‌పై వ్యక్తిని 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్.. హైదరాబాద్‌లో దారుణం
US Iran Tension: అమెరికాకు 14 పాయింట్ల ఫార్ములా పంపిన ఇరాన్- అనుమానాలు వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్
అమెరికాకు 14 పాయింట్ల ఫార్ములా పంపిన ఇరాన్- అనుమానాలు వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్
Bandla Ganesh Daughter Engagement : బండ్ల గణేష్ కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుక - టాలీవుడ్ టాప్ సెలబ్రిటీల సందడి
బండ్ల గణేష్ కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుక - టాలీవుడ్ టాప్ సెలబ్రిటీల సందడి
Beer in Summer : వేసవిలో బీర్ తాగితే నిజంగా కూల్ అవుతారా? సైడ్ ఎఫెక్ట్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
వేసవిలో బీర్ తాగితే నిజంగా కూల్ అవుతారా? సైడ్ ఎఫెక్ట్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Telangana Cabinet Expansion: తెలంగాణ కేబినెట్ విస్తరణకు మరింత సమయం! రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారా? రేసులో ఉన్నదెవరు?
తెలంగాణ కేబినెట్ విస్తరణకు మరింత సమయం! రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారా? రేసులో ఉన్నదెవరు?
Embed widget