SCCL Jobs: సింగరేణిలో 327 ఉద్యోగాలు, దరఖాస్తుకు మరో వారంరోజులే గడువు - వెంటనే అప్లయ్ చేయండి
Singareni Recruitment: సింగరేణిలో ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో 327 పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 15న ప్రారంభమైంది. జూన్ 29తో ప్రక్రియ ముగియనుంది.
![SCCL Jobs: సింగరేణిలో 327 ఉద్యోగాలు, దరఖాస్తుకు మరో వారంరోజులే గడువు - వెంటనే అప్లయ్ చేయండి Singareni Collieries Company Limited Recruitment deadline for applications is June 29 2024 SCCL Jobs: సింగరేణిలో 327 ఉద్యోగాలు, దరఖాస్తుకు మరో వారంరోజులే గడువు - వెంటనే అప్లయ్ చేయండి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/22/10645610a257d1ddcca9908ea559ba0c1719054429198522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Singareni Collieries Company Ltd Recruitment: సింగరేణి బొగ్గు గనుల్లో ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో 327 పోస్టుల భర్తీకి మార్చి 14న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 15న ప్రారంభంకాగా.. జూన్ 29తో గడువు ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులు జూన్ 29న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, సింగరేణి సంస్థ ఉద్యోగులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు. మొత్తం ఖాళీల్లో ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌లో 49 పోస్టులను, నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో 278 పోస్టులను భర్తీచేయనున్నారు. మొత్తం ఖాళీల్లో 95 శాతం లోకల్ అభ్యర్థులతో భర్తీచేయనున్నారు. మిగతా 5 శాతం పోస్టులను నాన్-లోకల్ అభ్యర్థులతో భర్తీచేస్తారు.
పోస్టుల వివరాలు..
ఖాళీల సంఖ్య: 327
* ఎగ్జిక్యూటివ్ క్యాడర్: 49 పోస్టులు
➥ ఈఅండ్‌ఎం మేనేజ్‌మెంట్ ట్రైనీ: 42 పోస్టులు
విభాగం: ఎగ్జిక్యూటివ్ క్యాడర్.
అర్హత: 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజినీరింగ్ (ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్). ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
➥ మేనేజ్‌మెంట్ ట్రైనీ: 07 పోస్టులు
విభాగం: సిస్టమ్స్.
అర్హత: 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజినీరింగ్ (కంప్యూటర్ సైన్స్/ఐటీ) లేదా ఎంసీఏ. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
* నాన్- ఎగ్జిక్యూటివ్ క్యాడర్: 278 పోస్టులు
➥ జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ (గ్రేడ్-సి): 100 పోస్టులు
విభాగం: మైనింగ్.
అర్హత: డిప్లొమా (మైనింగ్ ఇంజినీరింగ్). డిప్లొమా చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
➥ అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ: 09 పోస్టులు
విభాగం: మెకానికల్.
అర్హత: డిప్లొమా (మెకానికల్ ఇంజినీరింగ్). డిప్లొమా చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
➥ అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ: 24 పోస్టులు
విభాగం: ఎలక్ట్రికల్.
అర్హత: డిప్లొమా (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్). డిప్లొమా చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
➥ ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ-1: 47 పోస్టులు
విభాగం: ఫిట్టర్.
అర్హత: పదోతరగతితోపాటు ఐటీఐ (ఫిట్టర్ ట్రేడ్) అర్హత ఉండాలి. అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి.
➥ ఎలక్ట్రిషియన్ ట్రైనీ కేటగిరీ-1: 98 పోస్టులు
విభాగం: ఎలక్ట్రిషియన్.
అర్హత: పదోతరగతితోపాటు ఐటీఐ (ఎలక్ట్రిషియన్ ట్రేడ్) అర్హత ఉండాలి. అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి.
వయోపరిమితి: 15.05.2024 నాటికి 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అయిదేళ్లపాటు వయో సడలింపు వర్తిస్తుంది. సంస్థ ఉద్యోగులకు ఎలాంటి వయోపరిమితి వర్తించదు.
దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, సింగరేణి సంస్థ ఉద్యోగులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష (ఆఫ్‌లైన్/ఆన్‌లైన్), ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.
రాతపరీక్ష అర్హత మార్కులు..
కేటగిరీ | ఎగ్జిక్యూటివ్ కేడర్ | నాన్- ఎగ్జిక్యూటివ్ కేడర్ |
OC/EWS | 40% | 30% |
BC/PWD | 35% | 25% |
SC/ST | 25% | 15% |
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.05.2024. (12 AM నుంచి)
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 29.06.2024. (5 PM వరకు)
ALSO READ: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో 'అగ్నివీర్ వాయు' ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)