అన్వేషించండి

RPF Constable Exam: ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ పరీక్షల షెడ్యూల్ వెల్లడి - 19 రోజులపాటు కొనసాగనున్న పరీక్షలు

RPF: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక పరీక్ష తేదీలను రైల్వేశాఖ ప్రకటించింది. అభ్యర్థులకు మార్చి 2 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

RPF Constable Exam Dates: రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(RPF)లో కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన నియామక పరీక్షల తేదీలను రైల్వే శాఖ జనవరి 28న వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మార్చి 2 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను పరీక్షకు పది రోజుల ముందు నుంచి అందుబాటులో ఉంచనున్నారు. ఈ స్లిప్పులో పరీక్ష కేంద్రం, నగరం, తేదీ, సమయం, మార్గదర్శకాలు తదితర వివరాలు ఉంటాయి. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, యూజర్‌ పాస్‌వర్డ్/ పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి పరీక్ష కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చు. కానిస్టేబుల్ పరీక్ష అడ్మిట్‌ కార్డులను అభ్యర్థులు పరీక్షకు 4 రోజుల ముందు నుంచి అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్‌ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. 

రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌‌లో మొత్తం 4,660 కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 452 సబ్ ఇన్‌స్పెక్టర్(SI), 4208 కానిస్టేబుల్‌ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల నుంచి ఏప్రిల్  15 నుంచి మే 14 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మే 15 నుంచి 24 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. అయితే ఇప్పటికే ఎస్‌ఐ పోస్టులకు గతేడాది డిసెంబర్‌ 2, 3, 9, 12, 13  తేదీల్లో నియామక పరీక్షలు నిర్వహించారు. ఇక తాజాగా కానిస్టేబుల్ పరీక్ష తేదీలను అధికారులు వెల్లడించారు. మార్చి 2 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది.

రాతపరీక్ష విధానం..
మొత్తం 120 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. ఇందులో జనరల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులు, అరిథ్‌మెటిక్ 35 ప్రశ్నలు-35 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 ప్రశ్నలు-35 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు.

ఆర్‌పీఎఫ్ పీఈటీ (ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్): రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాత దశలో ఫిజికల్ ఈవెంట్లు నిర్వహిస్తారు. ఫిజికల్ ఈవెంట్ల నిర్వహణ కింది విధంగా ఉంటుంది.

విభాగం 1600 మీటర్ల పరుగు 800 మీటర్ల పరుగు  లాంగ్  జంప్ హైజంప్
ఎస్‌ఐ (మెన్) 6.30 నిమిషాలు  - 12 ఫీట్లు 3 ఫీట్ల 9 అంగుళాలు 
ఎస్‌ఐ (ఉమెన్) - 4 నిమిషాలు 9 ఫీట్లు 3 ఫీట్లు

ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT):

ఆర్‌పీఎఫ్ ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT)
విభాగం ఎత్తు (సెం.మీ.లలో ) ఛాతీ (సెం.మీ.లలో ){పురుషులకు మాత్రమే}
జనరల్/ఓబీసీ   165 157 80 85
ఎస్సీ/ఎస్టీ 160 152 76.2 81.2
గర్వాలీలు, గూర్ఖాలు, మరాఠాలు, డోగ్రాలు, కుమాయోనీస్ మరియు ప్రభుత్వం పేర్కొన్న ఇతర కేటగిరీలకు చెందినవారికి 163 155 80 85

డాక్యుమెంట్ వెరిఫికేషన్: 
అన్ని పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు చివరికి ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. ఉద్యోగాల సంఖ్యకు అనుగుణంగా సరైన అర్హతలు, ధ్రువపత్రాలు ఉన్నవారికి ఉద్యోగాలకు ఎంపికచేస్తారు. అభ్యర్థులు ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులైతే.. వారు పనిచేస్తున్న సంస్థ యాజమాన్యం నుంచి నిరభ్యంతర పత్రం (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ - NOC) తీసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget