SSC SI Exam: ఎస్‌ఎస్‌సీ ఎస్‌ఐ 'టైర్-2' పరీక్ష తేది వెల్లడి, ఎప్పుడంటే?
SSC CPO 2023: ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ (CAPF) ఫోర్సెస్ విభాగంలో ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించి 'టైర్-2' రాతపరీక్ష తేదీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించింది.
SSC CPO 2023 Paper 2 Exam Date: ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ (CAPF) ఫోర్సెస్ విభాగంలో ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించి 'టైర్-2' రాతపరీక్ష రీషెడ్యూల్ తేదీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 22న నిర్వహించాల్సిన టైర్-2 పరీక్షను జనవరి 8న నిర్వహించనున్నారు. ఈ మేరకు డిసెంబరు 15న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. పేపర్-2లో అర్హత సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, డీఎంఈ (డిటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్) నిర్వహించి తుది ఎంపికలు చేపడతారు. ఎంపికైతే నెలకు రూ.35,400-రూ.1,12,400 జీతం ఇస్తారు.
పేపర్-2 పరీక్ష విధానం..
మొత్తం 200 మార్కులకు కంప్యూటర్ ఆధారితంగా పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్షలో నెగెటివ్ మార్కులు వర్తిస్తాయి. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోత విధిస్తారు.
ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)లో సబ్-ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్ష-2023కు సంబంధించి పేపర్-1 (కంప్యూటర్ ఆధారిత) ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అక్టోబరు 25న విడుదల చేసిన సంగతి తెలిసిందే. పేపర్-1 పరీక్షలో 2607 మంది మహిళలు అర్హత సాధించగా.. 28,633 మంది పురుష అభ్యర్థుల అర్హత సాధించారు. ఇక ఢిల్లీ పోలీసు విభాగం నుంచి మొత్తం 182 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-1లో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఫిజికల్ ఈవెంట్లు (పీఈటీ/ పీఎస్‌టీ) నిర్వహించారు. ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన అభ్యర్థులకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.
ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో 1876 ఎస్‌ఐ (గ్రౌండ్ డ్యూటీ), ఎస్‌ఐ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 22న నోటిఫికేషన్ (SSC CPO 2023) విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్ విభాగాలు సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో ఖాళీలను భర్తీచేయనున్నారు. మొత్తం ఖాళీల్లో 1710 పురుషులకు కేటాయించగా.. 166 పోస్టులను మహిళలకు కేటాయించారు.
పోస్టుల వివరాలు..
* ఎస్‌ఐ పోస్టులు
ఖాళీల సంఖ్య: 1876 (పురుషులు-1710, మహిళలు-166).
పోస్టులవారీగా ఖాళీలు..
➥ ఢిల్లీ పోలీసు: 106 పోస్టులు
➥ బీఎస్‌ఎఫ్: 113 పోస్టులు
➥ సీఐఎస్‌ఎఫ్: 630 పోస్టులు
➥ సీఆర్‌పీఎఫ్: 818 పోస్టులు
➥ ఐటీబీపీ: 63 పోస్టులు
➥ ఎస్ఎస్బీ: 90 పోస్టులు
➥ పేపర్-1 పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు కంప్యూటర్ ఆధారితంగా పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్-50 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ నాలెడ్జ్ & జనరల్ అవేర్‌నెస్-50 ప్రశ్నలు-50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-50 ప్రశ్నలు-50 మార్కులు, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్-50 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. ఆబ్జె్క్టివ్ విధానంలోనే ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కులు వర్తిస్తాయి. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోత విధిస్తారు.
➥ ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్/ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్‌లో భాగంగా అభ్యర్థుల శారీరక ప్రమాణాలు (ఎత్తు, ఛాతీ), లాంగ్ జంప్, హైజంప్, షార్ట్‌పుట్ నిర్వహిస్తారు.
➥ డీఎంఈ (డిటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్) చివరగా పూర్తిస్థాయిలో అభ్యర్థులకు మెడికల్ పరీక్షలు నిర్వహించి తుది ఎంపికలు చేపడతారు.