PGCIL: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఆఫీసర్ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలుండాలి
PGCIL Jobs: పీజీసీఐఎల్‌లో ఆఫీసర్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. యూజీసీ నెట్-2024 అర్హత ఉన్నవారు డిసెంబర్ 24 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
PGCIL Recruitment: గురుగ్రామ్‌లోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశ వ్యాప్తంగా ఉన్న పీజీసీఐఎల్ రీజియన్/ కార్యాలయాల్లో ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్, సోషల్ మేనేజ్‌మెంట్, హెచ్‌ఆర్, పీఆర్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 71 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఫుల్ టైం డిగ్రీ, పీజీ, డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు యూజీసీ నెట్-2024 స్కోరు తప్పనిసరై ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి 28 సంవత్సరాలకు మించకూడదు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. సరైన అర్హతలున్నవారు డిసెంబర్ 24 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 71 పోస్టులు
* ఆఫీసర్ ట్రైనీ పోస్టులు
పవర్ గ్రిడ్ విభాగంలో ఖాళీలు..
⏩ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్: 14 పోస్టులు
రిజర్వ్ కేటగిరీ: యూఆర్- 08 పోస్టులు, ఎస్సీ- 01 పోస్టు, ఎస్టీ- 01 పోస్టు, ఓబీసీ(ఎస్‌సీఎల్)- 03 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 01 పోస్టు.
అర్హత: గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/యూనివర్శిటీ నుంచి కనీసం 60% మార్కులతో ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/నేచురల్ రిసోర్స్ మేనేజ్‌మెంట్/ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్‌లో 2 సంవత్సరాల ఫుల్ టైమ్ మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి. యూజీసీ నెట్-2024 స్కోరు తప్పనిసరి.
⏩ సోషల్ మేనేజ్‌మెంట్: 15 పోస్టులు
రిజర్వ్ కేటగిరీ: యూఆర్- 07 పోస్టులు, ఎస్సీ- 02 పోస్టులు, ఎస్టీ- 01 పోస్టు, ఓబీసీ(ఎస్‌సీఎల్)- 04 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 01 పోస్టు.
అర్హత: గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/యూనివర్శిటీ నుంచి కనీసం 60% మార్కులతో సోషల్ వర్క్‌లో 2 సంవత్సరాల ఫుల్ టైమ్ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. యూజీసీ నెట్-2024 స్కోరు తప్పనిసరి.
⏩ హెచ్‌ఆర్: 35 పోస్టులు
రిజర్వ్ కేటగిరీ: యూఆర్- 15 పోస్టులు, ఎస్సీ- 05 పోస్టులు, ఎస్టీ- 03 పోస్టులు, ఓబీసీ(ఎస్‌సీఎల్)- 09 పోస్టులు, ఈడబ్ల్యూఎస్- 03 పోస్టులు.
అర్హత: గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/యూనివర్శిటీ నుంచి కనీసం 60% మార్కులతో హెచ్‌ఆర్/ పర్సనల్ మేనేజ్‌మెంట్ / ఇండస్ట్రియల్ రిలేషన్స్ / సోషల్ వర్క్ (పర్సనల్ మేనేజ్‌మెంట్ & ఇండస్ట్రియల్ రిలేషన్స్‌లో స్పెషలైజేషన్‌తో) హెచ్‌ఆర్‌ఏమ్ అండ్ లేబర్ రిలేషన్స్/ లేబర్ అండ్ సోషల్ వెల్ఫేర్‌లో 2 సంవత్సరాల ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ / డిప్లొమా /ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి. యూజీసీ నెట్-2024 స్కోరు తప్పనిసరి.
⏩ పీఆర్: 07 పోస్టులు
రిజర్వ్ కేటగిరీ: యూఆర్- 04 పోస్టులు, ఎస్సీ- 01 పోస్టు, ఓబీసీ(ఎస్‌సీఎల్)- 02 పోస్టులు.
అర్హత: గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/యూనివర్శిటీ నుంచి కనీసం 60% మార్కులతో మాస్ కమ్యూనికేషన్ / పబ్లిక్ రిలేషన్స్ / జర్నలిజంలో గ్రాడ్యుయేట్‌తో పాటు పీజీ డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
సీటీయూఐఎల్(CTUIL) విభాగంలో ఖాళీలు..
⏩ హెచ్‌ఆర్: 02 పోస్టులు
రిజర్వ్ కేటగిరీ: యూఆర్- 01 పోస్టు, ఓబీసీ(ఎస్‌సీఎల్)- 01 పోస్టు.
గరిష్ఠ వయోపరిమితి: 24.12.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; పీడబ్ల్యూబీడీ 10 సంవత్సరాలు; మాజీ సైనికులు/డీఈఎస్‌ఎమ్/ అల్లర్ల బాధిత అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: యూజీసీ నెట్ డిసెంబర్ 2024 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా.
పే స్కేల్: నెలకు ట్రైనింగ్ సమయంలో రూ.40,000; ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాక రూ.50,000 నుంచి రూ.1,60,000.
ముఖ్యమైన తేదీలు..
🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.12.2024.
🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24.12.2024.