Rozgar Mela: ‘రోజ్‌గార్ మేళా’ ప్రారంభించిన ప్రధాని మోదీ, 75 వేల మంది అభ్యర్థులకు నియామక పత్రాలు!
అక్టోబరు 22న ‘రోజ్‌గార్ మేళా’ను మోదీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 75 వేల మందికి వర్చువల్‌గా ఉద్యోగ నియామక ప్రతాలు ప్రధాని మోదీ అందజేశారు.
దేశవ్యాప్తంగా 10లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని ఇటీవల హామీ ఇచ్చిన ప్రధాని మోదీ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు అక్టోబరు 22న 'రోజ్ గార్ మేళా' డ్రైవ్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 10 లక్షల ఉద్యోగాల కోసం ఈ మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ జరుగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా 75 వేల మంది అభ్యర్థులు అపాయింట్ మెంట్ లెటర్స్ అందుకోనున్నారు. ఎంపికైన అభ్యర్థులు భారత ప్రభుత్వంలోని 38 మంత్రిత్వ శాఖలు, ఇతర విభాగాల్లో పనిచేయనున్నారు.
పలువురు కేంద్ర మంత్రులు రోజ్ గార్ మేళాలో పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మన్ సుఖ్ మాండవియా, అనురాగ్ ఠాకూర్, పీయుష్ గోయల్ తో పాటు మరికొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గోనున్నారు. ఎంపీలు తమ తమ నియోజకవర్గాల్లో యువతకు అపాయింట్ మెంట్ లెటర్స్ అందిచనున్నారు. రోజ్ గార్ మేళా నిర్వహించడంపై నిరుద్యోగ యువత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దేశం నలుమూలల నుండి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు 38 మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో వివిధ స్థాయిల్లో విధుల్లో చేరనున్నారు. వీటిలో గ్రూప్-ఎ, గ్రూప్-బి(గెజిటెడ్), గ్రూప్-బి (నాన్-గెజిటెడ్), గ్రూప్-సి పోస్టులు ఉన్నాయి. నియామకాలు జరుపుతున్న ఉద్యోగాలలో కేంద్ర సాయుధ దళ సిబ్బంది, సబ్ ఇన్ స్పెక్టర్, కానిస్టేబుల్, ఎల్‌డీసీ, స్టెనో, పీఏ, ఇన్ కమ్ టాక్స్ ఇన్ స్పెక్టర్‌లు, ఎంటీఎస్, తదితర పోస్టులు భాగంగా ఉన్నాయి. ఈ నియామకాలను మంత్రిత్వ శాఖలు, విభాగాలు అయితే స్వతహాగా లేదా యూపీఎససీ, ఎస్ఎస్‌సీ , రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు వంటి నియామక సంస్థల ద్వారా లేదా మిషన్ మోడ్‌లో చేపట్టడం జరుగుతుంది.
దేశవ్యాప్తంగా 10లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని ఇటీవల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాదిన్నర కాలంలో 10 లక్షల మందిని మిషన్ మోడ్‌లో నియమించాలని వివిధ ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖలను ఈ ఏడాది జూన్‌లో మోదీ కోరారు. 10 లక్షల మందిని రిక్రూట్ చేసుకునేందుకు ఉద్దేశించిన ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 22న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ఇదే వేడుకలో మోదీ వర్చువల్‌గా 75 వేల మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసి, వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారని పీఎంవో తెలిపింది.
దేశంలో నిరుద్యోగంపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో జూన్‌లో మోదీ కీలక ప్రకటన చేశారు. ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మోదీ ఆదేశాలకు అనుగుణంగా అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు తమ పరిధిలోని ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాయి. నియామక ప్రక్రియను సరళం చేశాయి.
Addressing the Rozgar Mela where appointment letters are being handed over to the newly inducted appointees. https://t.co/LFD3jHYNIn
— Narendra Modi (@narendramodi) October 22, 2022
ఉద్యోగ భర్తీపై నాలుగు నెలల క్రితమే సమీక్ష..
దేశవ్యాప్తంగా 10లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని ఇటీవల హామీ ఇచ్చిన ప్రధాని మోదీ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. అయితే ఇదే అంశంపై జూన్‌లోనే ప్రధాని నరేంద్ర మోడీ అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలలో మానవ వనరులను సమీక్షించారు. కొన్ని నెలల్లో 10 లక్షల ఉద్యోగాలు కల్పించే ప్లాన్‌తో ముందుకు కదులుతున్నారు. దీనితో పాటు వచ్చే ఏడాదిన్నర కాలంలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రభుత్వం మిషన్ పద్ధతిలో పనిచేయాలని ఆదేశించారు.
గతేడాది, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా, మార్చి 1, 2020 నాటికి కేంద్ర ప్రభుత్వ శాఖలలో 8.72 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఈ సంఖ్య దాదాపు 10 లక్షలకు చేరి ఉంటుందని భావిస్తున్నారు. వారిని రిక్రూట్ చేయడానికి పీఎం మోదీ ఈ చొరవ తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని అన్ని విభాగాల్లో మొత్తం 40 లక్షల 4 వేల పోస్టులు ఉన్నాయని, వాటిలో దాదాపు 31 లక్షల 32 వేల మంది ఉద్యోగులను నియమించుకున్నారని జితేంద్ర సింగ్ చెప్పారు. అంటే 8.72 లక్షల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.