By: ABP Desam | Updated at : 10 Nov 2022 05:14 PM (IST)
కంప్యూటర్ డ్రాట్స్‌మ్యాన్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబార్డినేట్ సర్వీస్‌లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ అక్టోబరు 17న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దీనిద్వారా ఎనిమిది కంప్యూటర్ డ్రాట్స్‌మ్యాన్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పదోతరగతితోపాటు ఐటీఐ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ నవంబరు 10న ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 29లోగా నిర్ణీత దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లించి నవంబరు 30 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
పోస్టుల వివరాలు..
* కంప్యూటర్ డ్రాట్స్‌మ్యాన్
పోస్టుల సంఖ్య: 08
జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు: గుంటూరు-01, నెల్లూరు-01, కడప-01, చిత్తూరు-03, అనంతపురం-01, కర్నూలు-01.
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గుర్తింపు పొందిన ఐటీఐ సంస్థ నుంచి డ్రాట్స్‌మ్యాన్( సివిల్) విభాగంలో రెండేళ్ల కోర్సుకు సంబంధించి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి. అందులో సర్వేయింగ్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
వయోపరిమితి: 01/07/2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు, పరీక్ష ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.250 చెల్లించాలి. పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్-సర్వీస్‌మెన్, తెల్ల రేషన్ కార్డు, నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
జీతం: రూ.34,580 -1,07,210.
రాతపరీక్ష విధానం:
* మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. రాతపరీక్షలో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి.
* పేపర్-1లో జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ నుంచి 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి.
* పేపర్-2లో ఐటీఐ(సివిల్) విభాగం నుంచి 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి.
* ఒక్కో పేపరుకు 150 నిమిషాల సమయం కేటాయిస్తారు.
* ఇక 50 మార్కులకు కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. దీనికి 30 నిమిషాల సమయం కేటాయించారు.
పరీక్ష విధానం, సిలబస్ వివరాలు..
ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.11.2022.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.11.2022.
* దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది: 29.11.2022.
Also Read:
➨ DCCB Kurnool Jobs: కర్నూలు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో క్లర్క్ ఉద్యోగాలు, అర్హతలివే!
➨ ఏలూరు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో 95 క్లర్క్ పోస్టులు, అర్హతలివే!
➨ విజయవాడ ఏపీకోఆపరేటివ్ బ్యాంకులో ఖాళీలు, అర్హతలివే!
RITES: రైట్స్ లిమిటెడ్‌లో 257 అప్రెంటిస్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
HSL Recruitment: వైజాగ్ హిందుస్థాన్ షిప్‌యార్డులో 99 మేనేజర్, కన్సల్టెంట్ పోస్టులు - అర్హతలివే
BEL Jobs: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 52 ట్రైనీ, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
SSC JE Exams: ఎస్ఎస్సీ జేఈ టైర్-2 పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
CSIR UGC NET 2023: సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబరు) 2023 దరఖాస్తు గడువు పొడిగింపు - ఎప్పటివరకంటే?
తెలంగాణలో రేపే కౌంటింగ్-ఉదయం 10గంటల్లోగా తొలి ఫలితం
Chandrababu: ఈ నెల 10 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన - పూర్తి షెడ్యూల్ వివరాలు
Magic figure tention: మ్యాజిగ్ ఫిగర్ దాటకపోతే ఏం చేయాలి-మంతనాల్లో మునిగిపోయిన పార్టీలు
Alia Bhatt Rashmika: క్రష్మిక క్లబ్లో ఆలియా భట్ - భర్తను వదిలేసింది ఏంటి?
/body>