అన్వేషించండి

TSPSC: టీఎస్‌పీఎస్సీకి త్వరలో కొత్త 'టీమ్', ఆ వెంటనే నియామక ఫలితాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు వెల్లడి

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి సహా ఐదుగురు సభ్యుల రాజీనామాలకు గవర్నర్ తమిళిసై ఆమోదించిన సంగతి తెలిసిందే. రాజీనామాల ఆమోదానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం తెలపడంతో గవర్నర్ ఆమోదించారు.

TSPSC Chairman Resignation: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి(Janardan Reddy) సహా ఐదుగురు సభ్యుల రాజీనామాలకు జనవరి 10న గవర్నర్ తమిళిసై(Tamilisai) ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. రాజీనామాల ఆమోదానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం తెలపడంతో.. న్యాయసలహాలు తీసుకున్న అనంతరం గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. గత ఛైర్మన్, బోర్డు హయాంలో జరిగిన పేపర్ లీకేజీ, ఇతర అవకతవకలపై సమగ్ర విచారణ కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించారు. నిరుద్యోగుల జీవితాలతో మరెవరూ భవిష్యత్‌లో ఆటలాడకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

త్వరలో కొత్త కమిషన్..
టీఎస్‌పీస్సీ సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించడంతో ప్రభుత్వం త్వరలోనే కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం పలువురి పేర్లను పరిశీలిస్తోంది. కొత్త సభ్యుల నియమాకం తరువాత ఉద్యోగ  నోటిఫికేషన్లపై స్పష్టత  వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పలు పరీక్షలు పూర్తయినా టీఎస్‌పీఎస్సీ ఫలితాలు ప్రకటించలేదు. కొత్తగా ఛైర్మన్, సభ్యుల నియామకం జరిగితే వాటిని వెల్లడించే అవకాశముంది. 

కమిషన్‌కు అయిదుగురు కొత్త సభ్యులు..
తెలంగాణలో ఉద్యోగాల నియామకాలకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ (TSPSC) వ్యవహారంలో నెలకొన్న సందిగ్ధతకు తెరదించి.. కార్యకలాపాల్లో వేగం పెంచేందుకు కమిషన్‌లో కొత్తగా అయిదుగురు సభ్యులను ప్రభుత్వం నియమించనుంది. కమిషన్‌లో ఛైర్మన్ (TSPSC Chairman), మరో 10 మంది సభ్యులు ఉండాలి. ప్రస్తుతం ఛైర్మన్ జనార్దన్ రెడ్డి, అయిదుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. వారిలో ఛైర్మన్, ముగ్గురు సభ్యులు గవర్నర్‌కు రాజీనామా సమర్పించగా.. తాజాగా ఆమోదం లభించింది. ఉద్యోగ నియామకాలను వేగవంతం చేసుకునేందుకు కొత్తగా అయిదుగురిని సభ్యులుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు ఇప్పటికే పలువురి పేర్లను పరిశీలిస్తోంది. పరీక్షలు పూర్తయినా ఫలితాలు ప్రకటించాల్సినవి ఎన్నో ఉన్నాయి. సభ్యులు వస్తే వాటిని వెల్లడించవచ్చని భావిస్తున్నారు. కొత్తగా నియమించే సభ్యుల్లో ఒకరికి తాత్కాలిక ఛైర్మన్ బాధ్యతలు అప్పగిస్తారా? అన్న చర్చ సాగుతోంది.

లీకేజీ వ్యవహారంతో..
ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చాక టీఎస్‌పీస్సీ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన విషయంలో ఛైర్మన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఆయనను తొలగించడంతోపాటు బోర్డును ప్రక్షాళన చేయాలని రాజకీయ పార్టీలు, నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. ఈ పరిణామాల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేయాలని ఛైర్మన్ జనార్దన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. అయితే ఆయన రాజీనామా నిర్ణయాన్ని అప్పటి భారాస ప్రభుత్వం తిరస్కరించింది. కమిషన్‌లో జరిగిన పొరపాట్లు సరిదిద్దాలని, సంస్కరణలు చేపట్టి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించడంతో ఆయన ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. రెండోసారి నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను హైకోర్టు రద్దు చేయడంతో కమిషన్‌పై నిరుద్యోగుల్లో మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సహా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బోర్డును ప్రక్షాళన చేస్తామంటూ హామీలు ఇచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యం ప్రభుత్వం మారడంతో డిసెంబర్‌లో జనార్దన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఈ రాజీనామాకు ఎట్టకేలకు గవర్నర్ ఆమోదం తెలిపారు.

యూపీఎస్సీ తరహాలో మార్పులు..
రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ)ను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) తరహాలో పటిష్ఠమైన వ్యవస్థగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.  ఇందుకు సంబంధించి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యూపీఎస్సీ ఛైర్మన్‌ మనోజ్‌ సోని సాయం కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జ‌న‌వ‌రి 5న‌ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిలతో కలిసి ఇక్కడి యూపీఎస్సీ భవన్‌లో ఛైర్మన్‌ మనోజ్‌ సోని, కార్యదర్శి శశిరంజన్‌కుమార్‌లతో భేటీ అయ్యారు. ఇంతటి సుదీర్ఘ ప్రయాణంలో యూపీఎస్సీ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు విడుదల చేసి నిర్దిష్ట కాలపరిమితిలోగా పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి పారదర్శకంగా నియామక ప్రక్రియ పూర్తిచేయడం అభినందనీయమని ప్రశంసించారు. రాజకీయ ప్రమేయం లేకుండా ఛైర్మన్‌, సభ్యుల నియామకం చేపట్టనున్నట్లుగా  రేవంత్ రెడ్డి  చెబుతున్నారు.   కమిషన్‌లో అవకతవకలకు తావులేకుండా శాశ్వత ప్రాతిపదికన సిబ్బందిని నియమించనున్నారు.  టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌తోపాటు, సభ్యులకు   శిక్షణ ఇచ్చేందుకు యూపీఎస్సీ చైర్మన్ అంగీకరించారు. ఏడాది లోగా 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి ఖాళీలు భర్తీ చేస్తామన్నారు.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Embed widget