NTPC Jobs: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు, ఎంపికైతే నెలకు రూ.1.20 లక్షల వరకు జీతం
NTPC: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ సంస్థ అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించవచ్చు.
NTPC Limited Recruitment Notification: న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) సంస్థ సేఫ్టీ విభాగంలో అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 50 ఖాళీలను భర్తీచేయనున్నారు. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 10లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్హతలు, స్క్రీనింగ్ పరీక్ష, రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.30,000 - రూ.1,20,000 వరకు జీతంగా చెల్లిస్తారు.
వివరాలు..
* అసిస్టెంట్ ఆఫీసర్ (సేఫ్టీ)
ఖాళీల సంఖ్య: 50.
పోస్టుల కేటాయింపు: జనరల్ (యూఆర్)-22, ఈడబ్ల్యూఎస్-05, ఓబీసీ-14, ఎస్సీ-06, ఎస్టీ-03.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ సివిల్/ ప్రొడక్షన్/ కెమికల్/ కన్‌స్ట్రక్షన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్)తో పాటు డిప్లొమా/అడ్వాన్స్‌డ్ డిప్లొమా/ పీజీ డిప్లొమా (ఇండస్ట్రియల్ సేఫ్టీ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 45 సంవత్సరాలు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: విద్యార్హతలు, అప్లికేషన్ షార్ట్‌లిస్టింగ్/ స్క్రీనింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.300; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు రూ.30,000 - రూ.1,20,000 వరకు.
దరఖాస్తు సమయంలో సమర్పించాల్సిన డాక్యుమెంట్లు..
➥ పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం పదోతరగతి మార్కుల సర్టిఫికేట్
➥ ఆధార్ కార్డు, పాన్ కార్డు
➥ ఇంజినీరింగ్ డిగ్రీ కన్సాలిడేటేడ్ మార్కుల షీట్/ట్రాన్స్‌క్రిప్ట్/ అన్ని సెమిస్టర్ల మార్కుల షీట్లు
➥ సేఫ్టీ డిప్లొమా(ఫైనల్/ప్రొవిజినల్ సర్టిఫికేట్)
➥ ఇంజినీరింగ్ ఫైనలియర్ లేదా కన్సాలిడేట్ మార్కుల మెమో.
➥ క్యాస్ట్ సర్టిఫికేట్ - ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు.
➥ ఓబీసీ నాన్ క్రీమిలేయర్ సర్టిఫికేట్
➥ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైతే ఇన్‌కమ్, అసెట్ సర్టిఫికేట్ (FY 2023-24).
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.11.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.12.2024.
ALSO READ:
టెన్త్ అర్హతతో ఆర్మీ ఉద్యోగాలు, హైదరాబాద్‌లో ‘అగ్నివీర్’ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఎప్పుడంటే?
పదోతరగతి ఉత్తీర్ణులైన యువకులకు డిసెంబర్ 8 నుంచి 16 వరకు హైదరాబాద్‌లో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. హైదరాబాద్-గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో నియామక ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులు వెల్లడించారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్/స్టోర్ కీపర్ ట్రేడ్‌లలో నియామకాలు చేపట్టనున్నారు. అగ్నివీర్ జనరల్ డూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్ / స్టోర్ కీపర్ అగ్నివీర్ ట్రెడ్స్ మెన్ పోస్టులకు పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇక అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాలకు 8వ తరగతి ఉతీర్ణత ఉంటే సరిపోతుంది. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే రిక్రూట్ మెంట్ కార్యాలయం ఫోన్ నంబర్: 040-27740059, 27740205 ద్వారా పరిష్కరించుకోవచ్చు. నియామక ప్రక్రియ పూర్తిగా అటోమేటేడ్, ఫెయిర్, పారదర్శకంగా నిర్వహించనున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..