అన్వేషించండి

Mahanadi Coalfields Recruitment: మహానది కోల్‌ఫీల్డ్స్‌లో 295 ఉద్యోగాలు, అర్హతలివే!

మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో మొత్తం 295 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు.

ఒడిశా రాష్ట్రంలోని బుర్లా, జాగృతీ విహార్‌లోని మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో మొత్తం 295 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జనవరి 3 నుంచి 23 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులను మహానది కోల్ ఫీల్డ్స్/ కోల్ ఇండియా లిమిటెడ్‌లోని ఏ ఖనులు లేదా ప్రాజక్టుల్లోనైనా నియమించొచ్చు. కోల్ ఇండియా అనుబంధ సంస్థలకూ బదిలీ చేయొచ్చు. కాబట్టి దేశంలో ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండే అభ్యర్థులే దరఖాస్తు చేయాలి.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 295.

1) జూనియర్ ఓవర్‌మ్యాన్: 82 పోస్టులు

పోస్టుల కేటాయింపు: జనరల్-43, ఈడబ్ల్యూఎస్‌-08, ఎస్సీ-14, ఎస్టీ-07, ఓబీసీ(ఎన్‌సీఎల్‌)-10.

2) మైనింగ్ సర్దార్: 145 పోస్టులు

పోస్టుల కేటాయింపు: జనరల్-74, ఈడబ్ల్యూఎస్‌-14, ఎస్సీ-13, ఎస్టీ-35, ఓబీసీ(ఎన్‌సీఎల్)-09. 

3) సర్వేయర్: 68 పోస్టులు

పోస్టుల కేటాయింపు: జనరల్-27, ఈడబ్ల్యూఎస్-06, ఎస్సీ-12, ఎస్టీ-14, ఓబీసీ(ఎన్‌సీఎల్)-09.

వయోపరిమితి: 23.01.2023 నాటికి 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. ఓబీసీ (ఎన్‌సీఎల్)లకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. డిపార్ట్ మెంటల్ అభ్యర్థులకు గరిష్ఠ వయసు లేదు.

అర్హతలు..

* జూనియర్ ఓవర్‌మ్యాన్ పోస్టుకు మూడేళ్ల మైనింగ్ ఇంజినీరింగ్ డిప్లొమా/మైనింగ్ ఇంజినీరింగ్ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. ఓపెన్ కాస్ట్ (ఓసీ), అండర్ గ్రౌండ్ (యూజీ) మైన్స్‌లో పనిచేసినట్టుగా ఓవర్‌మ్యాన్ కాంపిటెన్సీ సర్టిఫికెట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్, గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికెట్ ఉండాలి.

* మైనింగ్ సర్దార్ పోస్టుకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. లేదా మూడేళ్ల మైనింగ్ ఇంజినీరింగ్ డిప్లొమా/మైనింగ్ ఇంజినీరింగ్ డిగ్రీ/ తత్సమాన పరీక్ష పాసవ్వాలి. ఓసీ అండ్ యూజీ మైన్స్‌లో పనిచేసినట్టుగా మైనింగ్ సర్దార్‌ షిప్ సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్, గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికెట్ ఉండాలి.

* సర్వేయర్ పోస్టుకు ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష పాసై ఉండాలి. లేదా మైనింగ్/మైన్ సర్వేయింగ్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా లేదా తత్సమాన పరీక్ష పాసవ్వాలి. ఓసీ, యూజీ మైన్స్‌లో పనిచేసినట్టుగా సర్వే సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్ఎం, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లించాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్ టెస్ట్(సీబీటీ), సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాతపరీక్ష(సీబీటీ)లో సాధించిన మార్కుల ఆధారంగా 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ కోసం పిలుస్తారు. సీబీటీలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల తుది జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఆయా అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలి. ప్రభుత్వ, అనుబంధ సంస్థలు, కోల్ ఇండియా లిమిటెడ్, దాని అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్నవారు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ను సమర్పించాలి. ఒరిజినల్ డాక్యుమెంట్లు/ సర్టిఫికెట్ల పర్యవేక్షణ తేదీ, వేదికను వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు. దాని ప్రకారం అభ్యర్థులు హాజరుకావాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లను పరీక్షించిన తర్వాత దాంట్లో ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజనల్ సెలెక్ట్ లిస్ట్‌ను వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు. సీబీటీలో చూపిన ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగా ప్రొవిజనల్ జాబితాలోని అభ్యర్థులకు ఆఫర్ లెటర్లను జారీచేస్తారు.

పరీక్ష విధానం: 

* మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. 

* పరీక్షలో సెక్షన్-ఎ, సెక్షన్-బి రెండు విభాగాలు ఉంటాయి. సెక్షన్-ఎలో జనరల్ అవేర్‌నెస్/ఆప్టిట్యూడ్ ప్రశ్నలు 20 ఉంటాయి. సెక్షన్-బిలో టెక్నికల్ నాలెడ్జ్‌కు సంబంధించిన 80 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు 1 మార్కు.  

* పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు. ఇంగ్లిష్/హిందీ భాషల్లో ప్రశ్నలు ఉంటాయి.
కనీస అర్హత మార్కులు: జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 45 శాతం, ఓబీఎస్(ఎన్‌సీఎల్) అభ్యర్థులకు 40 శాతం, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 35 శాతం మార్కులు ఉండాలి. 

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.01.2023

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23.01.2023

Notification

Website

Also Read: 

1392 జేఎల్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

తెలంగాణలోని జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 20న ప్రారంభమైంది. అభ్యర్థులు జనవరి 10న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తు చేసుకోవచ్చు. వాస్తవానికి డిసెంబరు 16 నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకావాల్సి ఉన్నప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల డిసెంబరు 20న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.200, పరీక్ష ఫీజు కింద రూ.120 చెల్లించాలి. నిరుద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు పరీక్ష ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..

147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ‌లో 1147 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 34 విభాగాల్లో 1147 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. 18 నుంచి 44 సంవత్సరాల మ‌ధ్య వ‌య‌సున్న వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మొత్తం పోస్టుల్లో అధికంగా అన‌స్థీషియా విభాగంలో 155, జ‌న‌ర‌ల్ స‌ర్జరీలో 117, జ‌న‌ర‌ల్ మెడిసిన్‌లో 111 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబరు 20న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జ‌న‌వ‌రి 5న సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..

 మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
Virat Kohli News: వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు
వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు
Coimbatore : రూ.1, రూ.2 నాణేలతో భార్యకు భరణం-షాకైన కోర్టు, ఆ తర్వాతేమైందంటే..
రూ.1, రూ.2 నాణేలతో భార్యకు భరణం-షాకైన కోర్టు, ఆ తర్వాతేమైందంటే..
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Embed widget